No Happiness: సక్సెస్ దొరికినా ఆనందం లేదా? మీ మనసులో మిగిలిన ఖాళీకి అసలు కారణం ఇదే!
No Happiness: మనం సక్సెస్ కోసం పరుగెత్తేటపుడు మనకు నచ్చిన హాబీలను, బంధాలను పక్కన పెట్టేస్తాం. తీరా విజయం దొరికాక పంచుకోవడానికి సరైన వారు లేక ఒంటరితనం వెంటాడుతుంది.
No Happiness
చాలామంది తమ జీవితం మొత్తం ఒక లక్ష్యం కోసం పరుగు తీస్తూనే ఉంటారు. “ఒక ఉద్యోగం వస్తే చాలు, ఒక పది కోట్లు సంపాదిస్తే చాలు, ఈ ఇల్లు కట్టుకుంటే చాలు నా జీవితం సెటిల్ అయిపోతుంది” అని అనుకుంటారు.
కానీ ఆ లక్ష్యాన్ని చేరుకున్న కొద్ది రోజులకే మళ్లీ పాత అసంతృప్తి మొదలవుతుంది. దీనిని సైకాలజీలో ‘అరైవల్ ఫాలసీ’ అంటారు. అంటే మనం గమ్యాన్ని చేరుకుంటేనే ఆనందంగా ఉంటాం అనుకోవడం ఒక భ్రమ.
సక్సెస్ కోసం మనం ఎంతో కష్టపడతాం, ఎన్నో త్యాగాలు చేస్తాం, కానీ ఆ సక్సెస్ చేతికి అందాక “ఇంతేనా దీని కోసం నేను ఇంత కష్టపడింది?” అనే ప్రశ్న మనసులో తలెత్తుతుంది. ఆ విజయం మనకు ఇచ్చే ఆనందం కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మనసు ఇంకేదో కావాలని (No Happiness)కోరుకుంటుంది.
మనం సక్సెస్ కోసం పరుగెత్తేటపుడు మనకు నచ్చిన హాబీలను, బంధాలను పక్కన పెట్టేస్తాం. తీరా విజయం దొరికాక పంచుకోవడానికి(No Happiness) సరైన వారు లేక ఒంటరితనం వెంటాడుతుంది.
మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన మెదడు ఎప్పుడూ కొత్తదానికే స్పందిస్తుంది. మీరు ఒక కొత్త కారు కొంటే అది మొదటి వారం చాలా ఆనందాన్ని ఇస్తుంది, కానీ నెల రోజుల తర్వాత అది ఒక సాధారణ వస్తువులా మారిపోతుంది. దీనినే ‘హెడోనిక్ ట్రెడ్‌మిల్’ అంటారు.

అంటే మనం ఎంత సాధించినా మన ఆనంద స్థాయి మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తుంది. సక్సెస్ తర్వాత కూడా అసంతృప్తి ఉండటానికి మరో కారణం పోలిక. మనం ఒక మెట్టు ఎక్కగానే మనకంటే పైన ఉన్న వాళ్ళను చూస్తాం.
అప్పుడు మన విజయం మనకు తక్కువగా అనిపిస్తుంది. మనకు కావాల్సింది పేరు, డబ్బు మాత్రమే కాదు.. జీవితానికి ఒక అర్థం కావాలి. మనం చేసే పని వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా లేదా అనే ఆలోచన లేకపోతే ఎంత సంపాదించినా లోపల ఖాళీగానే ఉంటుంది.
అందుకే సక్సెస్ ను చివరి స్టేషన్ లా చూడకుండా, ప్రయాణంలో దొరికే ఒక సాయం లా చూడాలి. ఇతరులకు సహాయం చేయడం లేదా కొత్త విషయాలు నేర్చుకోవడంలోనే శాశ్వతమైన తృప్తి దొరుకుతుంది.



