HealthJust LifestyleLatest News

Water: నీళ్లు తక్కువ తాగితే అన్ని అనర్ధాలా?

Water: నీళ్లు తక్కువగా తాగితే ముందుగా మనకు కనిపించే లక్షణాలు చాలా చిన్నవిగా ఉంటాయి.

Water

నీళ్లు (Water)ఎక్కువగా తాగాలని మనం రోజూ వినే మాటే. కానీ తక్కువ తాగితే ఏమవుతుందో చాలామందికి క్లారిటీ లేదు. నీళ్లు తక్కువైతే బాడీలో మొదట అల్లాడిపోయేది కిడ్నీలు.

మన శరీరంలో రక్తాన్ని శుభ్రం చేసి, విష పదార్థాలను బయటకు పంపే ఫిల్టర్లు ఇవే. ఈ వడపోత ప్రక్రియ సాఫీగా జరగాలంటే కిడ్నీలకు తగినంత నీరు కావాలి. నీళ్లు అందకపోతే కిడ్నీలకు వెళ్లే రక్తం మందంగా మారిపోతుంది. దాంతో విషాలన్నీ బయటకు వెళ్లకుండా కిడ్నీల్లోనే పేరుకుపోతాయి.

Water
Water

నీళ్లు తక్కువగా తాగితే ముందుగా మనకు కనిపించే లక్షణాలు చాలా చిన్నవిగా ఉంటాయి. మూత్రం ముదురు రంగులోకి మారడం, తక్కువసార్లు రావడం, ఒక రకమైన వాసన రావడం వంటివి కనిపిస్తాయి. వీటిని పట్టించుకోకపోతే అవి కిడ్నీ స్టోన్స్ గా మారతాయి.

అంతేకాకుండా నీళ్లు తక్కువైతే రక్తం గట్టిగా మారిపోతుంది. ఆ గట్టిపడిన రక్తాన్ని పంప్ చేయడానికి గుండెకు చాలా కష్టమవుతుంది. దీనివల్ల రక్తపోటు (బీపీ) పెరుగుతుంది.

మెదడు మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. ఏకాగ్రత తగ్గడం, తలనొప్పి రావడం ఇవన్నీ డీహైడ్రేషన్ వల్ల కలిగే ఇబ్బందులే. అందుకే దాహం వేసే వరకు ఆగకుండా రోజంతా కొంచెం కొంచెంగా నీళ్లు తాగుతూ ఉండాలి.

మరిన్ని హెల్త్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button