Vastu:వాస్తు వెనుక ఇంత రహస్యం ఉందా?
Vastu: వాస్తు యొక్క అంతిమ లక్ష్యం, ఆ నిర్మాణంలో నివసించే వ్యక్తులలో సానుకూల శక్తి ప్రవాహాన్ని (Positive Energy Flow) పెంచి, ఆరోగ్యం , శ్రేయస్సును మెరుగుపరచడం.
Vastu
భారతీయ నిర్మాణ వారసత్వం , విజ్ఞానంలో భాగమైన వాస్తు (Vastu)శాస్త్రం అనేది కేవలం గృహాల దిశలు, అలంకరణకు సంబంధించినది మాత్రమే కాదు. ఇది సూర్యుడు, భూమి యొక్క అయస్కాంత క్షేత్రం (Earth’s Magnetic Field), గాలి, నీరు, కాంతి వంటి ఐదు ప్రాథమిక మూలకాల (పంచ భూతాలు) యొక్క శక్తిని గరిష్టంగా ఉపయోగించుకునే ఒక సాంకేతికతగా తేల్చారు నిపుణులు.
వాస్తు (Vastu)యొక్క అంతిమ లక్ష్యం, ఆ నిర్మాణంలో నివసించే వ్యక్తులలో సానుకూల శక్తి ప్రవాహాన్ని (Positive Energy Flow) పెంచి, ఆరోగ్యం , శ్రేయస్సును మెరుగుపరచడం. ఉదాహరణకు, ఇంటికి ఈశాన్య (North-East) మూలలో ఎక్కువ ఖాళీ స్థలం ఉంచమని వాస్తు సూచిస్తుంది.

దీని వల్ల ఈ దిశ నుంచి ఉదయం వేళల్లో వచ్చే సూర్యరశ్మి (విటమిన్ డి తో సహా) ఇంట్లోకి ప్రవేశించి, ఆ ప్రాంతాన్ని బ్యాక్టీరియా రహితంగా, శుభ్రంగా ఉంచుతుంది, ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే, దక్షిణం వైపు తల ఉంచి పడుకోవాలని చెప్పడం వెనుక భూమి యొక్క అయస్కాంత శక్తికి అనుగుణంగా మన శరీరం ధ్రువణాన్ని (Polarity) సమతుల్యం చేసుకోవడం అనే శాస్త్రీయ కారణం ఉంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందని, నిద్ర నాణ్యతను పెంచుతుందని నమ్ముతారు.
సరైన వాస్తు నిర్మాణం ఆ ప్రాంతంలో శాంతిని , ప్రశాంతతను నెలకొల్పుతుంది, ఇది నివసించే వారి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. కాబట్టి, వాస్తు అనేది పర్యావరణ శక్తిని మానవ శరీరానికి అనుగుణంగా మార్చుకునే ఒక ప్రాచీన జీవనశైలి విజ్ఞానం.



