Smriti Mandhana: నా పెళ్లి రద్దయింది..ఇన్‌స్టాలో స్మృతి సంచలన పోస్ట్

Smriti Mandhana: తన పెళ్లి రద్దయినట్టు క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రకటనతో ఈ విషయం ముగుస్తుందని కోరుకుంటున్నట్టు పోస్టులో రాసుకొచ్చింది.

Smriti Mandhana

అందరూ ఊహించిందే జరిగింది…గత కొన్నిరోజులుగా వచ్చిన వార్తలను నిజం చేస్తూ భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) తన పెళ్లిపై సంచలన ప్రకటన చేసింది. పలాశ్ ముచ్చల్ తో తన వివాహం రద్దయిందని పేర్కొంటూ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టింది. గత కొన్ని వారాలుగా తన జీవితానికి సంబంధించి ఎన్నో ఊహాగానాలు, చర్చలు జరిగాయని పేర్కొంది.

తాను చాలా ప్రైవేట్ పర్సన్ అనీ, డిజర్వ్డ్ గా ఉంటానని తెలిపింది. ఏ విషయం అయినా కూడా ఇలానే ఉండాలని కోరుకుంటాననీ, దీనిలో భాగంగానే తన పెళ్లి రద్దయినట్టు క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రకటనతో ఈ విషయం ముగుస్తుందని కోరుకుంటున్నట్టు పోస్టులో రాసుకొచ్చింది. తాను ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తున్నానని, అందరూ కూడా దీనిని వదిలేయాలని కోరింది.

రెండు కుటుంబాల ప్రైవసీని గౌరవించాలని విజ్ఞప్తి చేసింది. భారత్ తరపున మరిన్ని మ్యాచ్ లు ఆడి మరిన్ని ట్రోఫీలు గెలవడమే తన లక్ష్యంగా ఉన్నట్టు ఇన్ స్టాలో పెట్టిన పోస్టులో వెల్లడించింది. ఇకపై తన ఫోకస్ అంతా క్రికెట్ పైనే ఉంటుందని, దేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యమని పేర్కొంది. దీంతో గత కొన్నిరోజులుగా ఆమె వివాహంపై నెలకొన్న సస్పెన్స్ కు తెరపడింది.

Smriti Mandhana

గత ఏడాదిన్నర కాలంగా స్మృతి(Smriti Mandhana), మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ ప్రేమలో ఉన్నారు. చాలా సందర్భాల్లో వీరిద్దరూ కలిసి కనిపించినప్పుడు పుకార్లు వచ్చాయి. స్మృతి డబ్ల్యూపీఎల్ మ్యాచ్ లకు పలాశ్ ప్రత్యేకంగా వచ్చి మరీ ప్రోత్సహించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. తమ మధ్య ఉన్న రిలేషన్ ను అప్పడప్పుడు ఇన్ స్టా పోస్టుల ద్వారా ఈ జంట అందరికీ హింట్ ఇచ్చింది.

వరల్డ్ కప్ జరుగుతున్న సమయంలో పలాశ్ తమ ఇంటికి ఇండోర్ కోడవు రాబోతోందంటూ చెప్పాడు. వరల్డ్ కప్ గెలిచిన డీవై పాటిల్ స్టేడియంలో స్మృతికి ప్రపోజ్ చేస్తూ వీడియోను కూడా రిలీజ్ చేశాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే ఎంగేట్ మెంట్, పెళ్ళి పనులు కూడా మొదలయ్యాయి.

Smriti Mandhana

స్మృతి(Smriti Mandhana)- పలాష్‌ హల్దీ, మెహందీ, సంగీత్‌ వేడుకలు కూడా ఘనంగా జరిగాయి. అయితే, మరికొన్ని గంటల్లో పెళ్లి ఉందనగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. పెళ్లి రోజు ఉదయం స్మృతి తండ్రి శ్రీనివాస్‌ మంధాన గుండె నొప్పితో హాస్పిటల్ లో చేరడం, పెళ్లి నిరవధికంగా వాయిదా పడడంతో పలు అనుమానాలు తలెత్తాయి. రకరకాల వార్తలు షికారు చేశాయి. అప్పుడు పలాష్‌ ముచ్చల్‌ కూడా ఆస్పత్రిలో చేరాడు. ఇదే సమయంలో పలాశ్ తనతో అనుచితంగా చిట్ చాట్‌ చేశాడంటూ ఓ అమ్మాయి స్క్రీన్‌షాట్లు షేర్‌ చేయడం అనుమానాలు బలపడ్డాయి.

ఈ కారణంగానే పెళ్లిరోజు రెండు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగి గొడవకు దారితీసిందని తెలిసింది. అధికారికంగా ప్రకటించకున్నా కుమార్తె పెళ్ళి ఆగిపోవడంతోనే స్మృతి తండ్రి హాస్పిటల్ లో చేరినట్టు అర్థమవుతోంది. దీంతో నవంబర్ 23న జరగాల్సిన వివాహం ఆగిపోవడం, తర్వాత సోషల్ మీడియాలో పలాశ్ తో ఉన్న తన ఫోటోలను స్మృతి తొలగించడం వార్తలు బలపడ్డాయి. ఇటీవల స్మృతి ఇచ్చిన ఓ ఇంటర్యూలో ఆమె చేతికి ఎంగేజ్ మెంట్ రింగ్ లేకపోవడంతో పెళ్ళి రద్దయినట్టు చాలా మంది తేల్చేశారు. ఇప్పుడు అధికారికంగా స్మృతినే దీనిపై క్లారిటీ ఇచ్చేసింది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version