Just Lifestyle

eating:నేలపై కూర్చొని తింటే ఇన్ని ప్ర‌యోజ‌నాలా..!

eating:నేలపై కూర్చొని తినడం(eating) వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

eating:కాలంతో పాటు మనుషులు కూడా మారిపోతున్నారు. ఈ జీవనశైలిలో వచ్చిన మార్పుల కారణంగా మనిషి ఆహారపు అలవాట్లతో పాటు, ఆహారాన్ని తీసుకునే విధానంలోనూ మార్పులు వచ్చాయి. ఒకప్పుడు నేలపై కూర్చొని భోజనం చేసేవారు కానీ ఇప్పుడు డైనింగ్ టేబుల్‌పై కూర్చోవడం తప్పనిసరిగా మారిపోయింది. అయితే నేలపై కూర్చొని(sitting on the floor) తినడం(eating) వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం.

1. ఊబకాయాన్ని నివారిస్తుంది
నేలపై కూర్చొని భోజనం చేయడం వల్ల మన శరీరం నిటారుగా ఉంటుంది. దీని వల్ల ఆహారం తిన్నప్పుడు అది నేరుగా జీర్ణాశయం ద్వారా శరీరంలోని వివిధ భాగాలకు చేరుతుంది. దీని ద్వారా మీరు అతిగా తినకుండా ఉంటారు. దీని వల్ల బరువు అదుపులో ఉండి ఊబకాయం(Prevents obesity) రాదు.

2. శరీరంలో రక్త ప్రసరణను పెంచుతుంది
నేలపై కూర్చున్నప్పుడు మన శరీరంలోని రక్తనాళాలు సక్రమంగా పనిచేస్తాయి. దీని వల్ల శరీరంలో రక్త ప్రసరణ(blood circulation) సక్రమంగా ఉంటుంది. ఆహారం వల్ల ఉత్పత్తి అయ్యే రక్తం ఈ గొట్టాల ద్వారా మీ తల నుంచి కాలి వరకు సులభంగా ప్రసరిస్తుంది. మంచం లేదా కుర్చీపై కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు ఇది జరగదు.

3. ఎసిడిటీ, గ్యాస్‌ను దూరం చేస్తుంది
నేలపై కూర్చొని భోజనం చేయడం శరీరంలోని జీర్ణవ్యవస్థకు మంచిదని చెబుతారు. ఇలా చేయడం వల్ల ఎసిడిటీ, గ్యాస్ ఏర్పడే సమస్య ఉండదు. మీరు రోజూ ఉదయం, సాయంత్రం నేలపై కూర్చొని ఆహారం తీసుకుంటే మీ మోకాళ్లకు వ్యాయామం జరుగుతుంది. అవి మీ శరీర బరువును ఎక్కువసేపు భరించగలవు.

4. కుటుంబంతో అనుబంధాన్ని పెంచుతుంది
నేలపై కూర్చొని తినేటప్పుడు కుటుంబ సభ్యులంతా కలిసి తినడం కూడా ఆనవాయితీగా ఉంటుంది. ఇది కుటుంబంతో బాంధవ్యాన్ని పెంచుతుంది. కింద కూర్చుని తినడం వల్ల ప్రశాంతమైన, సంతోషకరమైన మూడ్ ఉంటుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button