Allu Arjun: అల్లు అర్జున్ , అట్లీ మ్యాజిక్..విల్ స్మిత్ ఎంట్రీ ?
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)'బ్లాక్‌బస్టర్' డైరెక్టర్ అట్లీ (Atlee)కాంబినేషన్ రోజురోజుకి బౌండరీలు దాటేస్తోంది.

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)’బ్లాక్‌బస్టర్’ డైరెక్టర్ అట్లీ (Atlee)కాంబినేషన్ రోజురోజుకి బౌండరీలు దాటేస్తోంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో, అడుగడుగునా గ్రాండియర్ ఫీలింగ్‌ని కలిగించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు డైరెక్టర్ అట్లీ. దీంతో ఇది హాలీవుడ్ ఫిల్మ్ లాగా అనిపిస్తుందని బన్నీ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు.
Allu Arjun:
అల్లు అర్జున్ ‘డ్యూయల్ రోల్’.. విల్ స్మిత్ ‘మెయిన్ విలన్’?
Allu Arjun:ఇందులో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నాడు అనేది మన అందరికీ తెలిసిందే. ఒక క్యారెక్టర్ నెగటివ్ షేడ్స్‌లో ఉంటుందని కూడా అన్నారు. అయితే, ఇప్పుడు ఈ సినిమాలో మెయిన్ విలన్ క్యారెక్టర్ కోసం ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ హీరో, ఆస్కార్ అవార్డ్స్ గ్రహీత విల్ స్మిత్‌ను ఎంచుకున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి.
రీసెంట్గా అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ(Atlee) అమెరికాకు వెళ్లి విల్ స్మిత్( Will Smith)ను కలిశారట. ఆయనకు ఈ స్టోరీ నరేషన్ మొత్తం వినిపించారట. హీరో క్యారెక్టర్ కంటే పవర్ ఫుల్‌గా ఉండటంతో పాటు, స్క్రిప్ట్ కూడా నచ్చడంతో ఆయన ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అంతే కాదు ఆయన క్యారెక్టర్‌కి సంబంధించిన లుక్ టెస్ట్‌ని కూడా పూర్తి చేశారట. ప్రస్తుతం అల్లు అర్జున్ అమెరికాలోనే ఉన్నాడు.
స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన మేకర్స్..
ఇప్పటికే అల్లు అర్జున్‌కి సంబంధించిన స్పెషల్ వీడియోని మేకర్స్ విడుదల చేశారు. అలాగే రీసెంట్గా హీరోయిన్గా నటిస్తున్న దీపికా పదుకొనే వీడియోని కూడా విడుదల చేశారు. ఇప్పుడు విల్ స్మిత్ కి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైన వీడియోని షూట్ చేశారట. ఒక మంచి అకేషన్ని చూసి త్వరలోనే ఈ వీడియోని విడుదల చేస్తారట మేకర్స్. ఈ ప్రకటనతో సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతుందని అంటున్నారు.
పాన్-వరల్డ్ బ్యాటిల్లో అల్లు అర్జున్ vs మహేష్ బాబు
ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో ఒక అంతర్జాతీయ చిత్రం తెరకెక్కుతుంది. అల్లు అర్జున్, అట్లీ మూవీని చూస్తుంటే రాజమౌళి చిత్రం కంటే ఇదే పెద్దది లాగా అనిపిస్తుంది. ఈ రెండు సినిమాలు మన మార్కెట్‌ని పాన్-వరల్డ్‌కి విస్తరింపజేసే ప్రయత్నం లాగా భావించవచ్చు. వీళ్ళిద్దరిలో ఎవరు ముందుగా పాన్-వరల్డ్ బాక్స్ ఆఫీస్ మీద జెండాలు పాతుతారో చూడాలి.
‘ఫోర్ హీరోయిన్స్’ ఫిక్స్..!
ఇక అల్లు అర్జున్ – అట్లీ మూవీలో దీపికా పదుకొనే(Deepika Padukone ) మాత్రమే కాకుండా మరో నలుగురు హీరోయిన్స్ ఉన్నారని సమాచారం. అందులో ఒకరు మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ఉన్నారు. రీసెంట్గా మృణాల్ , అల్లు అర్జున్లపై ముంబై లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఆమె క్యారెక్టర్ కూడా ఈ చిత్రంలో చాలా పవర్ ఫుల్‌గా ఉంటుందని టాక్. మిగిలిన ముగ్గురు హీరోయిన్స్‌లో జాన్వీ కపూర్(Janhvi Kapoor) ఖరారు అయ్యింది. మిగిలిన ఇద్దరు ఎవరో తెలియాల్సి ఉంది. కాగా అల్లు అర్జున్, అట్లీ డెడ్లీ కాంబినేషన్‌తో వస్తున్న ఈ మూవీపై అంచనాలు పీక్స్‌కు చేరాయి.