Just LifestyleLatest News

Sit: మీరు కూర్చునే విధానం మీరేంటో చెబుతుంది..సైకాలజీ సీక్రెట్స్ ఇవిగో!

Sit:మీరు ఏ విధంగా కూర్చుంటారో గమనించారా? మీ భంగిమ ఏ విధంగా ఉందో, మీ వ్యక్తిత్వం ఎలా ఉందో చూసుకుని సరిపోల్చుకోండి.

Sit

మీరు ఒకరిని మొదటిసారి కలిసినప్పుడు, వారు మాట్లాడే విధానం కంటే వారి బాడీ లాంగ్వేజ్ నుంచే వారి గురించి తెలుసుకోవచ్చు. అవును, మన ప్రవర్తన, మనసులో ఏముందో మన శరీర కదలికలే చెబుతాయి. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, మనం కూర్చునే విధానం కూడా మన వ్యక్తిత్వాన్ని, మన ఆలోచనా ధోరణిని బయటపెడుతుంది. సైకాలజీ (Psychology)ప్రకారం, కూర్చునే భంగిమను బట్టి ఒక వ్యక్తిని ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

1. అడ్డంగా కాళ్లు పెట్టి కూర్చోవడం(Sit)..మీరు కూర్చున్నప్పుడు రెండు పాదాలు ఎదురెదురుగా ఉండేలా, అంటే అడ్డంగా కాళ్లు పెట్టి కూర్చుంటారా? అయితే మీరు చాలా క్రియేటివ్ అండ్ ఆకర్షణీయమైన వ్యక్తి. మీరు ఎక్కువగా ఆలోచించకుండానే నిర్ణయాలు తీసుకుంటారు. ఈ పద్ధతి ఒక్కోసారి సమస్యలకు దారితీసినా, మీలోని సహజత్వం మిమ్మల్ని వాటి నుంచి బయటపడేస్తుంది. మీరు సాహసాలు చేయడాన్ని ఇష్టపడతారు. కొత్త స్నేహితులను సులభంగా సంపాదించుకుంటారు, కానీ అంతే త్వరగా వారితో దూరమయ్యే అవకాశం కూడా ఉంది.

2. కాలిపై కాలు వేసి కూర్చోవడం(Sit)..కాలి మీద కాలు వేసుకుని పాదాలు నిటారుగా పెట్టి కూర్చునేవారు తరచుగా కలల ప్రపంచంలో ఉంటారు. వీరు తమను తాము గొప్పగా ఊహించుకుంటూ ఉంటారు. వీరు సులభంగా కొత్త బంధాలను ఏర్పరచుకుంటారు, కానీ కొన్నిసార్లు తమను తాము వెనక్కి తగ్గించుకుంటారు. వీరికి తమ సొంత అభిప్రాయాలు బలంగా ఉంటాయి, కాబట్టి తమ భావాలను స్పష్టంగా వ్యక్తం చేయగలుగుతారు.

3. కాళ్లు దూరంగా పెట్టి కూర్చోవడం(Sit)..రెండు కాళ్లు దూరంగా పెట్టి, పాదాలు పక్కపక్కనే ఉంచి కూర్చునేవారు కాస్త గజిబిజి ఆలోచనలతో, ఏకాగ్రత లేకుండా ఉంటారు. వీరు ఇతరులు ఏమనుకుంటారోనని ఆలోచించకుండా మాట్లాడతారు. ఏకాగ్రత లోపించడం వల్ల చిన్న విషయాలకే విసుగు చెందుతారు. ఇలాంటి మనస్తత్వం ఉన్నవారు తెలివైనవారు, కానీ బంధాల విషయంలో నిరాసక్తిని ప్రదర్శిస్తారు. అందుకే వీరిని ప్రోత్సహించడానికి ఎల్లప్పుడూ ఎవరో ఒకరు అవసరం.

sit
sit

4. కాళ్లు దగ్గరగా పెట్టి కూర్చోవడం..రెండు కాళ్లు నిటారుగా, దగ్గరగా పెట్టి కూర్చునేవారు చాలా మంచి ఆలోచనలు కలిగి ఉంటారు. వీరు సమయపాలన, శుభ్రతను ఎక్కువగా పాటిస్తారు. వీరి ఇళ్లలో ప్రతి వస్తువు దాని స్థానంలోనే ఉంటుంది. వీరు కొంచెం రిజర్వ్‌డ్‌గా ఉంటారు, తమ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు. వీరు నిజాయితీగా, ప్రశాంతంగా ఉంటారు, పుకార్లను నమ్మరు. ఎలాంటి ఒత్తిడిలోనైనా తమ ఏకాగ్రతను కోల్పోకుండా ఉంటారు.

5. కాళ్లు వంపుగా పెట్టి కూర్చోవడం..రెండు కాళ్లు కుడివైపునకు వంపుగా పెట్టి, పాదాలు దగ్గరగా ఉంచి కూర్చునేవారు తమ లక్ష్యాలకు అనుగుణంగా కష్టపడతారు. వీరు తమ కెరీర్‌కు ఎక్కువ విలువ ఇస్తారు. తమకు వచ్చిన దానితో సంతృప్తి చెందకుండా, మరింత సాధించాలని తపిస్తుంటారు. ఆరోగ్యం విషయంలో వీరు చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రేమ విషయంలో కూడా వీరి ప్రత్యేకమైన ఆలోచనలు ఎదుటివారిని ఆకర్షిస్తాయి.

మీరు ఏ విధంగా కూర్చుంటారో గమనించారా? మీ భంగిమ ఏ విధంగా ఉందో, మీ వ్యక్తిత్వం ఎలా ఉందో చూసుకుని సరిపోల్చుకోండి. ఇది కేవలం ఒక ఆసక్తికరమైన సమాచారం మాత్రమే!

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button