Tholi Ekadashi: ఆషాడంలో వచ్చే తొలి ఏకాదశికి ఎందుకంత ప్రాముఖ్యత..?
ఏకాదశి(Tholi Ekadashi) అనగా 11 అని అర్ధం. మనకు ఉన్న ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు వీటిని పనిచేయించే అంతరేంద్రియం అయిన మనసు కలిపితే పదకొండు సంఖ్య వస్తుంది. ఈ పదకొండును ఏకోన్ముకంగా పనిచేసే సమయమే ఏకాదశిగా పెద్దలు చెబుతారు.

ఏకాదశి (Ekadashi)అనగా 11 అని అర్ధం. మనకు ఉన్న ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు వీటిని పనిచేయించే అంతరేంద్రియం అయిన మనసు కలిపితే పదకొండు సంఖ్య వస్తుంది. ఈ పదకొండును ఏకోన్ముకంగా పనిచేసే సమయమే ఏకాదశిగా పెద్దలు చెబుతారు. ఈరోజు మహా విష్ణువు యోగనిద్రలోకి వెడతాడు.
అలాగే ఈరోజు నుంచే చాతుర్మాస్య దీక్షారంభం.
Tholi Ekadashi:
తొలి ఏకాదశి (Tholi Ekadashi)హిందూ క్యాలెండర్లో అత్యంత పవిత్రమైన రోజు, ఇది ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు వస్తుంది. సంవత్సరంలో వచ్చే 24 నుండి 26 ఏకాదశులలో ఇది మొదటిదిగా భావిస్తారు, అందుకే దీనిని తొలి లేదా మొదటి ఏకాదశి అని పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజును శయన ఏకాదశి(Shayana Ekadashi), దేవశయన ఏకాదశి, మరియు పద్మా ఏకాదశి అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి సాధారణంగా జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటి వారంలో వస్తుంది.
శయన ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి అంటే ఉత్తాన ఏకాదశి వరకు వచ్చే నాలుగు నెలలను చాతుర్మాస్యంగా పరిగణిస్తారు. భక్తులు ఈ కాలాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావించి, ప్రార్థనలు, ఉపవాసాలు , ధ్యానంలో గడుపుతారు.
పురాణ కథ:
పురాణాల ప్రకారం, ఒకప్పుడు ముచి అనే రాక్షసుడు భూమిని పీడిస్తుండేవాడు. అతని అకృత్యాలు ఎక్కువ కావడంతో దేవతలు శ్రీమహావిష్ణువును శరణు వేడారు మరియు పద్మా ఏకాదశి అనే దివ్యశక్తిని ప్రార్థించారు. ఆమె ముచి రాక్షసుడిని సంహరించింది. ఈ రోజునే శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్ళిన రోజుగా భావిస్తారు, అందుకే దీనిని పద్మా ఏకాదశి అని కూడా అంటారు.
తొలి ఏకాదశి ప్రాముఖ్యత:
శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్ళే రోజు ఇది. ఈ రోజున శ్రీమహావిష్ణువు శేషతల్పంపై శయనించి యోగనిద్రలోకి వెళ్తాడు. ఆయన కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తిరిగి మేల్కొంటాడు. ఈ నాలుగు నెలల కాలాన్ని దేవశయనం అంటారు.
చాతుర్మాస్య వ్రతాలకు ప్రారంభమైన రోజుగా చెబుతారు. వ్రతాచారులు, సాధువులు మరియు గురువులు ఈ రోజు నుంచే చాతుర్మాస్య వ్రతాలను ప్రారంభిస్తారు. వర్షాకాలంలో త్రికరణ శుద్ధితో, నియమబద్ధంగా జీవనం గడపడానికి ఇది ప్రారంభ దినం.
పుణ్యకాల ప్రారంభం:
తొలి ఏకాదశి నుండి వచ్చే ప్రతి రోజూ పుణ్యదాయకం అని పురాణాలలో ఉంది. తొలి ఏకాదశి రోజు చేసే ల ఉపవాసం(Fasting), జపం, ధ్యానం, దానం వంటి కార్యాలు చేయడం వల్ల ఆ ఫలితాలు పదింతలు అవుతాయని పండితులు చెబుతూ ఉంటారు.
తొలి ఏకాదశి వ్రత విధానం:
ఉదయం పవిత్ర స్నానం చేసి, శ్రీమహావిష్ణువు(Lord Vishnu) ను పూజించాలి. తులసి ఆకులు మరియు పుష్పాలతో అర్చన చేసి, విష్ణు సహస్రనామ పఠనం చేయాలి. కొందరు భక్తులు నిరాహారంగా, మరికొందరు పండ్లాహారంతో ఉపవాసం చేస్తారు. రాత్రి జాగరణ అంటే నిద్రలేకుండా జపం చేయడంచేస్తే విశేష ఫలితాలుంటాయి. ఈ రోజున అన్నదానం, వస్త్రదానం, తులసి మొక్కలు లేదా ధాన్యదానం చేసినా అది పుణ్యకార్యం.
తొలి ఏకాదశి ఆచరణ వల్ల కలిగే లాభాలు:
తొలి ఏకాదశిని ఆచరించడం ద్వారా అనేక లాభాలు కలుగుతాయని నమ్ముతారు. పూర్వ పాపాల నిర్మూలనం,మానసిక, ఆధ్యాత్మిక శుద్ధి కలగడంతో పాటు..
కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం కలిగి..పితృశాంతి, దైవ అనుగ్రహం కూడా కలుగుతాయని పెద్దలు చెబుతున్నారు.
చాతుర్మాస కాలంలో నియమబద్ధ జీవనానికి శుభారంభం:
తొలి ఏకాదశి ఆధ్యాత్మిక ప్రబోధానికి, నియమబద్ధమైన జీవనానికి ఒక గొప్ప ఆరంభం. భక్తి, శ్రద్ధ, నియమం కలిసిన ఈ పవిత్ర దినం మన జీవితాన్ని ధర్మమార్గంలో నడిపించే శక్తిని కలిగిస్తుంది. ప్రతి ఒక్కరూ తమకు సాధ్యమైన విధంగా ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీమహావిష్ణువు కృప పొందవచ్చు.