Just LifestyleLatest News

Home:తక్కువ ఖర్చుతో ఇంటిని అందంగా మార్చుకునే టిప్స్

Home: కేవలం మన దగ్గర ఉన్న వస్తువులతోనే, కొద్దిపాటి సృజనాత్మకత జోడిస్తే మన ఇల్లు కూడా ఒక లగ్జరీ విల్లా లాగా మెరిసిపోతుంది.

Home

మనం నివసించే ఇల్లు అందంగా, ప్రశాంతంగా ఉంటే..ఆటోమేటిక్‌గా మన మనసు కూడా ఉత్సాహంగా ఉంటుంది. ఇంటిని అందంగా మార్చుకోవాలంటే వేల రూపాయలు ఖర్చు చేసి విలాసవంతమైన వస్తువులు కొనుక్కోనక్కర్లేదు. కేవలం మన దగ్గర ఉన్న వస్తువులతోనే, కొద్దిపాటి సృజనాత్మకత జోడిస్తే మన ఇల్లు (Home) కూడా ఒక లగ్జరీ విల్లా లాగా మెరిసిపోతుంది. బడ్జెట్ ఫ్రెండ్లీగా మీ ఇంటి రూపురేఖలను మార్చే కొన్ని అద్భుతమైన ఐడియాలు ఇవే.

మొదటిది ఇండోర్ ప్లాంట్స్. మీ హాల్ లో లేదా గదుల మూలల్లో మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్ లేదా అలోవెరా వంటి ఇండోర్ మొక్కలను అందమైన కుండీల్లో ఉంచండి. ఇవి ఇంటికి పచ్చదనాన్ని ఇవ్వడమే కాకుండా గాలిని కూడా శుద్ధి చేస్తాయి.

రెండోది లైటింగ్. ఇంటి మూలల్లో లేదా గోడలకు వార్మ్ లైట్స్ కానీ ఫెయిరీ లైట్స్ అమర్చడం వల్ల ఇల్లు(Home) రాత్రి పూట ఎంతో క్లాసిక్ గా కనిపిస్తుంది. పాత ఫ్లవర్ వాజుల స్థానంలో కొత్త తరహా లైట్ స్టాండ్లను వాడండి.

మూడోది కర్టెన్లు, కుషన్లు. గోడల రంగుకు నప్పేలా తేలికపాటి రంగుల కర్టెన్లు, సోఫాపై అందమైన కుషన్లు వేస్తే గదికి కొత్త కళ వస్తుంది.

Home
Home

నాలుగోది ‘పాత వస్తువుల పునర్వినియోగం’. మీ ఇంట్లో ఉన్న పాత గాజు సీసాలను పెయింట్ చేసి వాటిని డెకరేటివ్ పీసెస్ లాగా వాడుకోవచ్చు. అలాగే పాత దుప్పట్లు లేదా చీరలతో అందమైన వాల్ హ్యాంగింగ్స్ తయారు చేయొచ్చు.

ఐదోది ‘ఫోటో గ్యాలరీ’. ఒక గోడను కేవలం ఫ్యామిలీ ఫోటోల కోసం కేటాయించి, వివిధ సైజుల్లో ఉన్న ఫ్రేములను అమర్చాలి. ఇది ఇంటికి ఒక పర్సనల్ టచ్ ఇస్తుంది.

ఇల్లు(Home) అందంగా ఉండాలంటే సామాన్లు ఎక్కువగా ఉండటం కాదు..ఉన్న వస్తువులను ఎంత పొదుపుగా, పొందికగా అమర్చుకున్నామనేది ముఖ్యం. ఎప్పటికప్పుడు అనవసరమైన చెత్తను తొలగించి, వెలుతురు ధారాళంగా వచ్చేలా చూసుకుంటే మీ ఇల్లు ఎప్పుడూ ఆహ్లాదకరంగా, అందంగా ఉంటుంది.

YS Jagan : వైఎస్ జగన్ కీలక నిర్ణయం..పాదయాత్రపై సంచలన ప్రకటన

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button