Just LifestyleHealthLatest News

Bottle:ప్లాస్టిక్ ,గాజు బాటిల్‌లో ఏది బెస్ట్? అసలు మంచినీళ్లు తాగడానికి సరైన బాటిల్ ఏది?

Bottle : గాజు బాటిల్స్‌కు అల్యూమినియం క్యాప్స్ ఉంటాయి. ఈ అల్యూమినియం డైరక్టుగా నీటితో తాకినప్పుడు కొన్ని రసాయనాలు నీటిలో చేరే ప్రమాదముంది.

Bottle

మనం తాగే నీళ్లు ఎంత శుభ్రంగా ఉన్నాయో చూసుకుంటాం కానీ, ఆ నీళ్లను దేనిలో నిల్వ చేస్తున్నామనే విషయాన్ని పెద్దగా పట్టించుకోము. చాలామంది ప్లాస్టిక్ బాటిల్స్(Bottle) ఆరోగ్యానికి హానికరమని తెలిసి గాజు బాటిల్స్(Bottle) వైపు మళ్లుతున్నారు. అయితే, గాజు బాటిల్ వాడేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. అసలు మన ఆరోగ్యానికి ఏది అత్యంత సురక్షితమో ఓసారి చూద్దాం.

ప్లాస్టిక్ బాటిల్స్(Bottle) తయారీలో బిస్ఫినాల్-A (BPA) వంటి రసాయనాలను వాడతారు. దీంతో వేసవి కాలంలో ఈ బాటిల్స్ వేడికి గురైనప్పుడు, ఆ ప్లాస్టిక్ కణాలు నీటిలో కరిగిపోతాయి. దీనివల్ల థైరాయిడ్ సమస్యలతో పాటు, హార్మోన్ల అసమతుల్యత , దీర్ఘకాలంలో తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశముంది. యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ బాటిల్స్‌ను కూడా కొంతమంది దాచుకుని వాడతారు. అవి మళ్లీ మళ్లీ వాడటం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.

ఆరోగ్య పరంగా చూస్తే ప్లాస్టిక్ కంటే గాజు చాలా రెట్లు మేలు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే గాజు, నీటితో ఎటువంటి రసాయనిక చర్య జరపదు. అయితే, ఇక్కడే ఒక చిన్న సమస్య ఉంది. చాలా గాజు బాటిల్స్‌కు అల్యూమినియం క్యాప్స్ ఉంటాయి. ఈ అల్యూమినియం డైరక్టుగా నీటితో తాకినప్పుడు కొన్ని రసాయనాలు నీటిలో చేరే ప్రమాదముంది. అందుకే గాజు బాటిల్ వాడేవారు అది ప్యూర్ మెటల్ క్యాప్ కాకుండా, స్టీల్ కానీ, లోపల ఫుడ్ గ్రేడ్ సిలికాన్ సీల్ ఉన్న మూతలు ఉన్నవి ఎంచుకోవాలి. అలాగే బాటిల్ మెడ భాగం, క్యాప్‌ను తరచుగా శుభ్రం చేస్తూ ఉండాలి.

అయితే మనం వాడే పాత్రలన్నింటిలో కూడా మట్టి కుండ అత్యంత మంచిది. మట్టి కుండ నీటిని సహజంగానే చల్లబరచడమే కాకుండా, నీటిలోని ఆమ్ల గుణాన్ని (Acidity) తగ్గించి క్షార గుణాన్ని (Alkaline) పెంచుతుంది. దీనివల్ల జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. మట్టిలోని ఖనిజాలు నీటిలో కలవడం వల్ల ఆ నీరు అమృతంలా మారుతుంది. అయితే ప్రతి రోజు కూడా కుండలోని పాత నీటిని తీసేసి, శుభ్రం చేసి కొత్త నీటిని నింపుకోవాలి.

Bottle
Bottle

రాగి పాత్రలో నీటిని ఎనిమిది గంటల పాటు నిల్వ ఉంచితే ఆ నీళ్లు యాంటీ బ్యాక్టీరియల్‌గా మారుతుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచివిి. కానీ, రాగి పాత్రలో నిమ్మరసం లేదా ఇతర పుల్లటి పదార్థాలు వేయకూడదు, ఇది రియాక్షన్ ఇస్తుంది. ఇక స్టెయిన్‌లెస్ స్టీల్ బాటిల్స్ అయితే ప్రయాణాలకు చాలా సురక్షితం. ఇవి పగిలిపోయే భయం ఉండదు ,ప్లాస్టిక్ లాగా ఎలాంటి రసాయనాలను కూడా విడుదల చేయవు.

అందుకే ఇంట్లో ఉన్నప్పుడు మట్టి కుండ నీటిని తాగడం అన్నిటికంటే మంచిది. ఒకవేళ బాటిల్ వాడాలనుకుంటే, మంచి క్వాలిటీ ఉన్న స్టెయిన్‌లెస్ స్టీల్ లేదా సిలికాన్ ప్రొటెక్షన్ ఉన్న గాజు బాటిల్‌ను ఎంచుకోవాలి. ఏ పాత్ర వాడినా దానిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం అనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు.

Under 19 World Cup : శతక్కొట్టిన ఆరోన్ జార్జ్..అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో భారత్

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button