Just LiteratureLatest News

Literature: మేలుకో తెలుగోడా..!

Literature: తెలుగోడా.. మన గోడు వినేది ఎవడు..?

Literature

తెలుగోడా.. మన గోడు
వినేది ఎవడు..?

మన మాతృభాషేమో
మృతభాష అవుతుంటే
మన అమ్మ భాషేమో
అంపశయ్య మీదుంటే..
ఊపిరెయ్యాల్సిన చోట
ఉరికొయ్యలెక్కిస్తే
ఉరకలెత్తాల్సిన చోట
ఉపేక్ష చూపిస్తే..

తెలుగోడా.. మన గోడు
వినేది ఎవడు..?

పాఠశాలలో లేదు
పాఠాలలో లేదు
పలకరింపులలో లేదు
ప్రియమైన మన తెలుగు…
ఆంగ్ల మాధ్యమ విద్య
తెలుగు మాధ్యమమే మిథ్య
ఇంత నిర్లక్ష్యం మద్య
ఎపుడెలుగు మన తెలుగు..

తెలుగోడా.. మన గోడు
వినేది ఎవడు..?

మేధావి వర్గాలు
మొత్తుకున్నా గాని
భాషాభిమానులు
బాధపడినా గాని
ఆంధ్ర జాతి మీద
ఆంగ్ల మోజు రుద్ది
ఉద్యోగ వేటలో
వెనకబడతావంటూ..
కల్ల మాటలకు నేడు
తెల్లబోయెనే తెలుగు…

తెలుగోడా.. మన గోడు
వినేది ఎవడు..?

కృష్ణ దేవ రాయులు
కొనియాడిన తెలుగు
అష్టదిగ్గజ కవుల
కావ్యాల వెలుగు…
అన్నమాచార్యుని సంకీర్తనై
శ్రీరామదాసుని ఆరాధనై
పోతనామాత్యుని పద్యమై
యోగి వేమనుని తత్వమై
వెలిగింది చరితలో
వెల కట్టలేని తెలుగు..
వెలివేయబడె నేడు
వెలితి కాదా చూడు…

తెలుగోడా.. మన గోడు
వినేది ఎవడు..?

గ్రామీణ యాసకు
ఊతమిచ్చిన గిడుగు
సమాజ శ్రేయస్సుకు
గురజాడ అడుగు…
ఆంధ్రమునే వెలిగించు
కవీంద్రులెందరో…
తెలుగు సాహితీ వనమున
ప్రక్రియలెన్నెనో…
ఏ భాషలో లేదు
ఇంత మధురము
మనమేల మన భాష
మరిచిపోయెదము…

తెలుగోడా.. మన గోడు
వినేది ఎవడు..?

లోకమంతా చూడు
మాతృభాషనే పొగుడు..
అభ్యసించుటకెన్నడు
అడ్డు కానేకాదు
జ్ఞానమన్నదెపుడు
భాష వలన రాదు…
భాష జాలము వీడి
భావజాలం పట్టు
మునుముందు తరాలు
తెలుగు నేర్చేటట్టు..

తెలుగోడా.. మన గోడు
వినేది ఎవడు..?

తెలుగు భాష లేకుంటే
తెలుగు జాతి ఎక్కడ…
రెండొందలేళ్లేలిన
ఆంగ్లేయులే
మన భాషనేనాడు
అణిచేయలే..
నేడేమో మననేలు
నాయకులే
తెలుగుకే తెరలేసే
ప్రయత్నాలు లే..

తెలుగోడా.. మన గోడు
వినేది ఎవడు..?

తెలుగోడా..మన గళం
వినిపించాలి నేడు
తెలుగోడా..ప్రతి పనిని
తెనుగించి చూడు..
మన భాష మన యాస
మన శ్వాస రా…
మన భాష మన కలం
మన బలం రా..
తెలుగోడా..మన గళం
వినిపించాలి నేడు..

– ఫణి మండల

Literature: అదే నేల… అదే గాలి…

Related Articles

20 Comments

  1. వర్తమాన తెలుగు భాష స్తితికి అద్దం పడుతుంది ఈ కవిత. మన తెలుగు వారికి ఉన్న ఆంగ్ల భాషా మోజు మరెవరికి ఉండదేమో? పూర్తిగా నేర్చుకునే ఓపిక లేదు, అమృత భాష ఐన మన అమ్మ భాషను మృతభాష చేసిన ఘనత మనది. స్వంత ప్రాంతం,భాష,ఆచారవ్యవహారాలు, పై మనకు అభిమానం దాదాపు లేదు అనే చెప్పాలి. ఎప్పుడూ భావదాస్యం తో బ్రతికే దిక్కుమాలిన బ్రతుకు మన తెలుగువారి ఘనత. చక్కగా వివరించారు.

  2. తెలుగు వెలుగు 🙏🙏🙏🙏
    👏👏👏👏👏👏

  3. ఇలా….. కవులందరూ….. ఆంధ్రుల పౌరుషం నిదుర లేచేలా భాషోద్యమాలు చేయాలి. మన తెలుగును బతికించుకోవాలి.
    ……మహాలక్ష్మి నాయుడు

  4. మాతృ భాషను కాపాడుకొవాలి ఆనీ చాలా బాగా చెప్పారు మాతృ భాషను మరచామంటే మన తల్లిని మరిచినట్లే చాలా బాగుంది ఫణి సార్

  5. మన తెలుగు భాష ఊపిరి తీసుకోవాలి అంటే మీ లాంటి కవులు ముందుకు రావాలి మేము అందరము మీకు తోడు గాఉంటాము

  6. మన మాతృభాష మన అమ్మ వంటిది కాబట్టి మన తెలుగు బాషను కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది సార్ .చాల బాగా రాసారు సార్.చాలా బాగుంది 👌👌👌

  7. ప్రభుత్వం ఉత్తరువు లు తెలుగు లో వస్తున్నా, న్యాయస్థానాలా తీర్పులు తెలుగు లో వస్తున్నా చదవగలిగే విద్యార్థి దొరక డాయే… నూతన విద్యావిదానం మాతృభాషలో బోధన చేయాలి అన్నా.. రాజకీయ ప్రయోజనాలకు బలి అవుతున్న భాష కేవలం తెలుగు భాష యే అవుతుంది.

  8. ప్రభుత్వం ఉత్తరువు లు తెలుగు లో వస్తున్నా, న్యాయస్థానాలా తీర్పులు తెలుగు లో వస్తున్నా చదవగలిగే విద్యార్థి దొరక డాయే… నూతన విద్యావిదానం మాతృభాషలో బోధన చేయాలి అన్నా.. రాజకీయ ప్రయోజనాలకు బలి అవుతున్న భాష కేవలం తెలుగు భాష యే అవుతుంది.
    ఇలానే కొనసాగితే ఎన్నో సంత్సరాలు గా కవులు మునులై సొభగులద్దిన సంప్రదాయం లు అంతరించి పురావస్తు ప్రదర్శన శాలలో. ఉండాల్సిన సమయం వస్తుంది అదే జరిగితే మాటలకందని మారణహోమం ఊహలకందని అమానవీయ ఆగైత్యాలు వెరసి నాగరికమనే అనగాగరిక పోకడలు , పెడ ధోరణిలు లో మమ్మీలు డమ్మీ లుగా డాడీలు shadil గా సంతానం సంతలో చింతకాయ గా ఇలా ఊహకు అందని పరిణామాలు తెగులు జాతి క్షమించాలి తెలుగు జాతి చూడబోతుంది.

  9. తెలుగు భాష నేటి స్థితి కళ్ళకు కట్టినట్లు చెప్పారు.

  10. ఫణి మండల గారు,
    మీచే జాలువారిన’ మేలుకో తెలుగోడా ‘ ప్రతి ఒక్క ఆంధ్రుడు మన తెలుగుభాషను కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేస్తూ తెలుగు భాషకున్న ఔన్నత్యాన్ని తేటతెల్లం చేస్తోంది.భాషాభిమానులు తెలుగుభాషను ప్రతి ఒక్కరికీ చేరువయ్యేలా తెలుగు మాట్లాడుతూ మాట్లాడిస్తూ ప్రోత్సహించాలి.ముఖ్యంగా తల్లితండ్రులు పిల్లలకి తేనెలొలుకు మన తెలుగు భాష విశిష్టతను వివరించి మాట్లాడేలా వెన్ను తట్టాలి.అప్పుడే మన తెలుగు అభివృద్ధిని మనం కాంచగలం.ప్రతి ఒక్క తెలుగోడికి తెలుగును పరిరక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మీరు ఇచ్చిన సందేశం కనువిప్పు కాగలదని ఆశిస్తూ….

  11. అంధ జనాలు, అంధనాయకులు. ఆంగ్ల మోజులో నలిగి పోతున్న మాతృభాష…. ఏవో నాలుగు GO లు తెలుగులో ముద్రించి, అదే భాషా సేవ అని ప్రచారం చేసుకుంటున్నారు. మరో మాతృ భాషా ఉద్యమం మెదలు కావాలి ✊✊✊

  12. చాలా చాలా బాగుంది సార్ ఆంగ్ల భాష మోజు.. అలా ఉంది మరి

  13. వెన్నెల వెలుగులా..
    ఓ వెలుగు వెలిగిన
    మన తెలుగు
    ముసురుకున్న
    చీకట్లలో చిక్కుకుంది
    నేడు ఓ తెలుగోడా!
    ఆంగ్ల గ్రహణం
    ఆవరించిన
    తెలుగు నేల
    అల్లాడుతూ
    బేలచూపులు
    చూస్తుంది
    తెలుగు ఈ వేళ

    గ్రహణం విడువనిదే
    తెలుగు వెలుగు రాదు
    తెలుగోడి గోడు పోదు !

    గోపాల్ రావు గురుగుబెల్లి
    💐🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button