Just SportsLatest News

T20 World Cup : వామ్మో కివీస్‌పై ఇంత చెత్త రికార్డా ?..ఫైనల్‌కు ముందు భారత్‌కు టెన్షన్

T20 World Cup : టీ20 ప్రపంచకప్ ను వరుసగా రెండోసారి ముద్దాడాలని భారత్ పట్టుదలగా ఉంది. అంచనాలకు తగ్గట్టే సొంతగడ్డపై దుమ్మురేపుతూ ఫైనల్ కు దూసుకొచ్చింది

T20 World Cup

టీ20 ప్రపంచకప్ ను వరుసగా రెండోసారి ముద్దాడాలని భారత్ పట్టుదలగా ఉంది. అంచనాలకు తగ్గట్టే సొంతగడ్డపై దుమ్మురేపుతూ ఫైనల్ కు దూసుకొచ్చింది. టైటిల్ పోరులో న్యూజిలాండ్ తో తలపడబోతోంది. ఆదివారం అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియం వేదికగా మెగా ఫైనల్ జరగనుండగా.. ఇప్పటికే అక్కడికి చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీస్ మొదలుపెట్టాయి.

ఈ సందర్భంగా ఇరు జట్ల బలాబలాలతో పాటు గత రికార్డులపై చర్చ జరుగుతోంది. గత రికార్డుల్లో మాత్రం న్యూజిలాండ్ పై భారత్ అత్యంత పేలవమైన ప్రదర్శన కనబరిచింది. ఇప్పటి వరకూ ఇరు జట్లూ టీ20 ప్రపంచకప్(T20 World Cup) చరిత్రలో మూడుసార్లు తలపడ్డాయి. మూడు సార్లు కూడా కివీస్ దే పైచేయిగా నిలిచింది. ఒక్క మ్యాచ్ లోనూ భారత్ విజయం సాధించలేదు.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్(T20 World Cup) చ‌రిత్ర‌లో భార‌త్, న్యూజిలాండ్ తొలిసారి 2007 ఆరంభ ఎడిషన్ లో ఢీకొన్నాయి. అప్పుడు భారత జట్టే ఛాంపియన్ గా నిలిచినా టోర్నీలో న్యూజిలాండ్ చేతిలోనే ఏకైక మ్యాచ్ లో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో కివీస్ 10 ప‌రుగుల తేడాతో విజయం సాధించింది.

T20 World Cup
T20 World Cup

అలాగే రెండోసారి 2016 టీ20 ప్రపంచకప్ ఎడిషన్ లో ఇరు జట్లు తలపడ్డాయి. సొంతగడ్డపై భారత్ చెలరేగుతుందని అందరూ అంచనా వేస్తే దానికి భిన్నంగా ఫలితం వచ్చింది. భారత బ్యాటర్లు కివీస్ స్పిన్నర్లకు తలవంచారు. 127 పరుగుల టార్గెట్ ను ఛేదించలేక చతికిలపడ్డారు, కివీస్ స్పిన్నర్లు శాంట్నర్, ఇష్ సోధిల దాటికి కేవలం 79 పరుగులకే భారత జట్టు కుప్పకూలింది. ఇక టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్, న్యూజిలాండ్ జట్లు మూడోసారి 2021 ఎడిషన్ లో తలపడ్డాయి.

ఈ మ్యాచ్ లోనూ భారత బ్యాటర్లు చేతులెత్తేశారు, కివీస్ బౌలర్ల ధాటికి టీమిండియా 110 పరుగులకే పరిమితమైంది. తర్వాత ఛేజింగ్ లో అదరగొట్టిన కివీస్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఓవరాల్ గా మాత్రం భారత్ దే కాస్త పైచేయిగా ఉంది. ఇరు జట్లు 30 టీ20ల్లో తలపడితే 16 మ్యాచ్ లలో భారత్ గెలిచింది. న్యూజిలాండ్ జట్టు 14 మ్యాచ్ లలో విజయం సాధించింది. కాగా ఇప్పుడు నాలుగోసారి టీ20 వరల్డ్ కప్ లో కివీస్ తో తలపడనున్న భారత్ గత రికార్డుల పరంపరను బ్రేక్ చేస్తూ వారిని ఓడిస్తేనే వరుసగా రెండోసారి ట్రోఫీని అందుకుంటుంది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button