Just Literature
Literature : ప్రశ్న?
Literature : సోక్రటీసుకి ఆయుధమై.. సందేహాల ఛర్నాకోలా విసిరి.. తార్కిక ఆలోచనలకు తల్లిలా నిలిచింది..!!

Literature : ప్రశ్న?
ప్రశ్న..
మనసులో మూల్గుతున్న
ఎన్నో సందేహాలకి..
జవాబు పత్రం అవుతుంది.
విజ్ఞానానికి..
మరిన్ని వన్నెలద్ది
విశ్వాన్ని వెలుగులీనేలా చేస్తుంది.
ఎందుకు ఏమిటి..
ఎప్పుడు.. ఎలా..!?
ఇలాంటి పదాలతో జతకూడి
ఎలాంటి చిక్కు ముడినైనా
చక్కగా విప్పేస్తుంది.
సోక్రటీసుకి ఆయుధమై..
సందేహాల ఛర్నాకోలా విసిరి..
తార్కిక ఆలోచనలకు
తల్లిలా నిలిచింది..!!
బడిలో బీజం వేసుకుని
భవితకు బాటలు పరిచి
జ్ఞానామృతం జగమంతా
ప్రసరించడానికి..
హేతువు అవుతుంది..!
తను ఉన్న దగ్గర..
జ్ఞానం గలగల పారే సెలయేరులా
పరవళ్లు తొక్కుతుంది.
తను ఉన్న దగ్గర..
సందేహాలు చిన్న బోయి
సమాధానాలు సందడి చేస్తాయి.
తను ఉన్న దగ్గర..
అనాదిగా ఉన్న మానవుడు..
ఆధునిక మానవుడై
ప్రగతి పథాన పయనిస్తాడు.
ప్రశ్నతోనే ప్రజ్వలిస్తుంటాడు..!
..కోరాడ అప్పలరాజు(ఎస్.ఎ.తెలుగు )
9550234204