Just NationalLatest News

scrap plane : బీహార్‌ ‘స్క్రాప్ విమానం’ కథలో ట్విస్ట్

scrap plane :బీహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన అవినాష్ కుమార్ చేసిన అద్భుతం.. అంటూ సోషల్ మీడియా షేర్లతో ఉక్కిరిబిక్కిరైంది

scrap plane : కేవలం పాత ఇనుప ముక్కలు, పనికిరాని వస్తువులతో అద్భుతం చేశాడన్న వార్తలు సోషల్ మీడియాను హోరెత్తించాయి. మన బీహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన అవినాష్ కుమార్ చేసిన అద్భుతం.. అంటూ సోషల్ మీడియా షేర్లతో ఉక్కిరిబిక్కిరైంది.అయితే అత్యంత ఉత్కంఠను రేపిన ఈ వైరల్ వీడియో(Viral Video) వెనుక దాగి ఉన్న అసలు సత్యాన్ని తెలుసుకుంటే.. ఎవరైనా గ్యారంటీగా కంగుతింటారు.

scrap plane

వైరల్ అయిన ఆ 42 సెకన్ల వీడియోలో పచ్చని పొలాల్లో.. వందలాది మంది జనం కిక్కిరిసి ఉన్నారు. మధ్యలో పాత ఇనుప చట్రాలతో, రకరకాల విడి భాగాలతో, ఎంతో కష్టపడి తయారుచేసిన ఓ చిన్నపాటి విమానం.. టేకాఫ్‌కు సిద్ధంగా ఉంది. తర్వాత విమానం నెమ్మదిగా కదలడం.. ఆపై ఒక్కసారిగా వేగం పుంజుకోవడంతో చుట్టూ ఉన్న జనం ఉత్సాహంతో, అరుపులతో, కేకలతో దాన్ని అనుసరిస్తున్నారు. తమ చేతుల్లోని ఫోన్‌లతో ఆ అద్భుతాన్ని బంధిస్తున్నారు. ఈ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఒక టీనేజర్ ఇలాంటి విమానాన్ని(Scrap Plane) ఎలా తయారు చేయగలిగాడు? అదే ప్రశ్న అందరిలోనూ తలెత్తింది.

సోషల్ మీడియాలో వీడియోతో పాటు కల్పిత కథ కూడా వైరల్ అయింది. ముజఫర్‌పూర్‌కు చెందిన అవినాష్ కుమార్(Avinash Kumar) ఈ విమానాన్ని తయారుచేశాడు. ఇది కేవలం 7,000 రూపాయలతో పూర్తి చేశాడు. ఎవరూ చెప్పకుండానే, స్వంతంగా చేసి, 300 అడుగుల ఎత్తుకు విజయవంతంగా ఎగురవేశాడు. అంటూ కథలు కథలుగా చెప్పుకొచ్చారు. పేరు తెలియని ఈ ‘అవినాష్ కుమార్’కు నెటిజన్ల నుంచి అభినందనల వెల్లువ కురిసింది. అతని ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ, ఓ అనామక యువకుడిని రాత్రికి రాత్రే స్టార్‌ను చేసేశారు.

హార్ యువకుడిపై జరుగుతున్న ఈ ప్రచారంపై నెటిజన్ల నుంచే సందేహాలు వ్యక్తమయ్యాయి. “ఇదంతా ఫేక్! అసలు వీడియో ఆఫ్రికాకు చెందినది!” అని కొందరు కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఇదే నిజమా అని FPJ (ఫ్రీ ప్రెస్ జర్నల్) ఓ ఫ్యాక్ట్ చెక్ నిర్వహించింది. పరిశోధనలో దిగ్భ్రాంతికరమైన నిజం బయటపడింది,

ఈ వీడియో 2025 ఏప్రిల్ నుంచే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ, అది బీహార్‌ది కాదు! ఆ వీడియోను మొదట ‘@Ghana the Black Star of Africa’ అనే ఫేస్‌బుక్ పేజీ పోస్ట్ చేసింది. అంటే, విమానం తయారుచేసిన అద్భుత ఘనత ఆఫ్రికాలోని ఘనా దేశానిది. దీనికి బీహార్‌లోని అవినాష్ కుమార్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఈ డిజిటల్ మాయలో ఒక అసలైన ఆవిష్కరణకు వేరే దేశం పేరు అంటగట్టబడింది. సోషల్ మీడియాలో ఎవరో ఒకరు వేల వ్యూస్ కోసం ఒక అవాస్తవాన్ని సృష్టించి, దాన్ని నిజంలా నమ్మించారని తేలింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button