Just SportsLatest News

WPL 2026: దీప్తి శర్మ, శ్రీచరణిలకు జాక్ పాట్.. మ్యాచ్ విన్నర్స్ పై కాసుల వర్షం

WPL 2026: ఇక ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మెగ్ లానింగ్ కోసం కూడా ఫ్రాంచైజీలు తీవ్రంగానే పోటీపడ్డాయి. లానింగ్స్ ను యూపీ వాలియర్స్ ఫ్రాంచైజీ రూ.1.90 కోట్లకు కొనుగోలు చేసింది.

WPL 2026

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2026) వేలంలో ఊహించినట్టుగానే భారత స్టార్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ రికార్డ్ ధర పలికింది. ఇటీవల వన్డే ప్రపంచకప్ లో అదరగొట్టిన దీప్తి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచింది. దీంతో వేలంలో ఆమెకు భారీ డిమాండ్ వస్తుందని అంతా అనుకున్నారు. అయితే ఆమె బిడ్డింగ్ సమయంలో హైడ్రామా నడిచింది. రూ.50 లక్షల బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చిన దీప్తి కోసం అదే ధరకు ఢిల్లీ క్యాపిటల్స్ బిడ్ చేసింది. ఆర్టీఎం ఆప్షన్ ఉండడంతో యూపీ వారియర్స్ దానికి సిద్ధపడింది.

దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ తమ చివరి ధరగా రూ.3.20 కోట్లు ఆఫర్ చేయడంతో అదే ధరను ఇచ్చేందుకు యూపీ వారియర్స్ అంగీకరించింది. ఫలితంగా ఆర్టీఎం ద్వారా దీప్తి శర్మ మళ్లీ పాత జట్టు(WPL 2026) కే వచ్చింది. గత సీజన్లో ఆమెను రూ.2.60 కోట్లకు యూపీ దక్కించుకుంది. వేలానికి ముందు రిటైన్ చేసుకోని యూపీ ఆర్టీఎంలో భారీ మొత్తం వెచ్చించాల్సి వచ్చింది.

ఇదిలా ఉంటే డబ్ల్యూపీఎల్(WPL 2026) చరిత్రలో అత్యధిక ధర పలికిన రెండో ప్లేయర్ దీప్తి రికార్డులకెక్కింది. గతంలో స్మృతి మంధానను ఆర్సీబీ రూ.3.40 కోట్లకు కొనుగోలు చేసింది. దీప్తి శర్మ తర్వాత అత్యధిక ధర పలికిన క్రికెటర్లలో ఎక్కువ మంది విదేశీ ప్లేయర్సే ఉన్నారు. న్యూజిలాండ్ ప్లేయర్ అమెలియా కేర్న ముంబై ఇండియన్స్ రూ.3 కోట్లకు కొనుగోలు చేయగా.. అదే దేశానికి చెందిన సోఫీ డిజైన్ను గుజరాత్ జెయింట్స్ రూ.2 కోట్లకు దక్కించుకుంది.

WPL 2026
WPL 2026

ఇక ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మెగ్ లానింగ్ కోసం కూడా ఫ్రాంచైజీలు తీవ్రంగానే పోటీపడ్డాయి. లానింగ్స్ ను యూపీ వాలియర్స్ ఫ్రాంచైజీ రూ.1.90 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక విండీస్ ఆల్ రౌండర్ చినెల్లి హెన్రీ కోసం ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించాయి. చివరికి ఢిల్లీ క్యాపిటల్స్ రూ.1.30 కోట్లకు ఆమెను దక్కించుకుంది. సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ ను రూ.1.10 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ చక్కించుకుంది. గత సీజన్ లో రూ.30 లక్షలే పలికిన ఈ సఫారీ స్టార్ ప్లేయర్ ఇటీవల వరల్డ్ కప్ లో పరుగుల వరద పారించింది.

మరోవైపు ఈ వేలంలో తెలుగమ్మాయి శ్రీచరణి కూడా జాక్ పాట్ కొట్టింది. కడప జిల్లాకు చెందిన శ్రీచరణి స్పిన్నర్ ఇటీవల ప్రపంచకప్ లో తనదైన మార్క్ చూపించింది. ఫలితంగా వేలంలో ఆమె కోసం గట్టిపోటీనే నడిచింది. రూ.30 లక్షల బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చిన శ్రీచరణి కోసం యూపీ వారియర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి. దీంతో బిల్డింగ్ ధర పెరుగుతూ పోయింది. చివరికి రూ.1.30 కోట్లకు శ్రీచరణిని ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.

గత సీజన్లో లో కూడా ఢిల్లీకే ఆడిన ఈ తెలుగమ్మాయికి అప్పుడు రూ.56 లక్షల ధర పలికింది. ప్రపంచకప్ లో అదిరిపోయే ప్రదర్శనతో ఇప్పుడు రెట్టింపు మొత్తం వచ్చింది. వరల్డ్ కప్ లో 9 మ్యాచ్ లు ఆడి 14 వికెట్లు పడగొట్టింది. ఇదిలా ఉంటే హైదరాబాదీ క్రికెటర్ అరుంధతి రెడ్డిని వేలంలో ఆర్సీబీ రూ.75 లక్షలకు సొంతం చేసుకుంది. ఇక భారత ఆల్ రౌండర్ శిఖా పాండేకు వేలంలో మంచి డిమాండ్ కనిపించింది.

రూ.40 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఆమె కోసం ఆర్సీబీ, యూపీ తీవ్రంగా పోటీపడ్డాయి. హోరాహోరీ బిడ్డింగ్ లో యూపీ వారియర్స్ రూ.2.40 కోట్లతో శిఖా పాండేను సొంతం చేసుకుంది. అలాగే భారత పేనర్ రేణుకాసింగ్ ను గుజరాత్ జెయింట్స్ రూ.60 లక్షలకు, ఇంగ్లాండ్ ప్లేయర్ సోఫీ ఎక్లిస్టోన్ను రూ.85 లక్షలకు యూపీ వారియర్స్ ఆర్టీఎం ద్వారా రిటైన్ చేసుకుంది. ఇటీవల ప్రపంచకప్ లో సత్తా చాటిన ప్లేయర్స్ పైనే ఫ్రాంచైజీలు ప్రధానంగా ఫోకస్ పెట్టి తమ తమ జట్లలోకి తీసుకున్నాయి.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button