Just NationalLatest News

Amazon: అమెజాన్.. ప్రపంచానికి తెలియని భయానక వాస్తవాలు

Amazon: ప్రపంచంలో ఉన్న మొత్తం ఆక్సిజన్‌లో 20 శాతానికి పైగా అమెజాన్ అడవులు నుంచే ఉత్పత్తి అవుతుంది. వీటి దట్టమైన వృక్షజాలం వల్ల, సూర్యరశ్మి కేవలం 2 శాతం మాత్రమే భూమిపై పడుతుంది.

Amazon

అమెజాన్(Amazon) అడవులు సౌత్ అమెరికాలో విస్తరించిన, ప్రపంచంలోనే అతిపెద్ద వర్షారణ్యం. ఈ అడవులలో దాదాపు 60 శాతం.. బ్రెజిల్‌లోనే ఉంది. ఈ అడవులను భూమికి ఊపిరితిత్తులు అని పిలుస్తారు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న మొత్తం ఆక్సిజన్‌లో 20 శాతానికి పైగా ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతుంది. వీటి దట్టమైన వృక్షజాలం వల్ల, సూర్యరశ్మి కేవలం 2 శాతం మాత్రమే భూమిపై పడుతుంది.

ఇక్కడ పడే వర్షం కూడా నేలకు చేరడానికి దాదాపు పది నిమిషాలు పడుతుంది. ప్రపంచంలోని కాఫీ, చాక్లెట్, రైస్, మిరియాలు, పైన్ ఆపిల్స్ వంటి 80 శాతానికి పైగా ఆహార పదార్థాలు ఈ అడవుల నుంచే లభిస్తున్నాయి.

Amazon
Amazon

అమెజాన్(Amazon) అడవులు ఎన్నో ఆటవిక జాతులకు నిలయంగా ఉన్నాయి. ఇక్కడ దాదాపు 500 ఆటవిక జాతులు నివసిస్తున్నాయి. వాటిలో 50 జాతులకు ప్రపంచంతో ఎటువంటి సంబంధాలు లేవు. మనుషులను తినే జాతులు కూడా ఇక్కడ ఉన్నాయని చెబుతారు.

అలాగే, ఇక్కడ 390 బిలియన్లకు పైగా చెట్లు, 4 వేల వృక్ష జాతులు, 2200 చేప జాతులు, 1200 పక్షి జాతులు, 420 ఉభయచరాలు, 370 సరీసృపాలు నివసిస్తున్నాయి. ఇవి ఎన్నో వింతైన, క్రూరమైన, విషపూరితమైన జంతువులకు ఆవాసంగా ఉన్నాయి. విషపూరితమైన బుల్లెట్ చీమలు, విషపు పిరాన్హ చేపలు, ఎలక్ట్రిక్ ఈల్ చేపలు, పింక్ రివర్ డాల్ఫిన్లు, అనకొండ, జాగ్వార్, ప్యూమా, మరియు స్పైడర్ కోతులు ఇక్కడ కనిపిస్తాయి.

Amazon
Amazon

అమెజాన్(Amazon) నదిలో కనిపించే మరో వింత జీవి పింక్ రివర్ డాల్ఫిన్. దీని గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ ది రాయల్ విక్టోరియా వాటర్ లిల్లీ అనే ప్రపంచంలోనే అతి పెద్ద ఆకులు కూడా కనిపిస్తాయి. ఈ ఆకులు 3 మీటర్ల వెడల్పుతో ఉండి, దాదాపు 40 కిలోల బరువును మోయగలవు. ఇక్కడి తాబేళ్లు ఉప్పు కోసం మనుషుల లేదా పక్షుల కన్నీళ్లు తాగుతాయని ఒక వింత నమ్మకం.

ఇక్కడ ప్రపంచంలో అతి బిగ్గరగా అరిచే టౌకెన్ అనే పక్షి ఉంది. దీని కూత దాదాపు అర మైలు దూరం వరకు వినిపిస్తుందట.అంతేకాదు ఈ దట్టమైన అడవిలోనే ఇక్విటోస్ అనే ఒక మహా నగరం ఉంది. ఇక్కడ దాదాపు 4 లక్షల మంది నివసిస్తూ ఉంటారు. ఈ నగరం మిగిలిన ప్రపంచానికి విమానాలు, లేదా నౌకల ద్వారా మాత్రమే అనుసంధానం అవుతుంది.

Car-free cities: నార్వే,నెదర్లాండ్స్ కారు లేని నగరాలుగా ఎలా మారాయి?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button