Economic corridor:చరిత్ర సృష్టించబోతున్న ఎకనామిక్ కారిడార్..ఆ 3 రాష్ట్రాల మధ్య భారీగా తగ్గనున్న దూరం

Economic corridor: ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రాజెక్టు పూర్తయితే, ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రస్తుతం ఉన్న 12 గంటల ప్రయాణ సమయం కేవలం 5 గంటలకు తగ్గిపోతుంది.

Economic corridor

రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్) ,విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్) మధ్య ప్రయాణ దూరాన్ని గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ చేపట్టిన ఎకనామిక్ కారిడార్(economic corridor) పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రాజెక్టు పూర్తయితే, ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రస్తుతం ఉన్న 12 గంటల ప్రయాణ సమయం కేవలం 5 గంటలకు తగ్గిపోతుంది.

ప్రాజెక్టు(Economic corridor) వివరాలు:

ప్రస్తుతం రాయ్‌పూర్-విశాఖపట్నం మధ్య ఉన్న జాతీయ రహదారి-26 మార్గం ద్వారా ప్రయాణిస్తే దాదాపు 597 కిలోమీటర్లు దూరం ఉంటుంది. ఈ కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం ద్వారా ప్రయాణ దూరం సుమారు 132 కిలోమీటర్లు తగ్గుతుంది. ఈ దూరం తగ్గడం వలన రవాణా సమయంతో పాటు, ఇంధన ఖర్చులు కూడా గణనీయంగా తగ్గుతాయి.

ఈ ఎకనామిక్ కారిడార్ (Economic corridor)కేవలం రెండు నగరాలను కలపడం మాత్రమే కాదు, ఛత్తీస్‌గఢ్, ఒడిశా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా సాగుతుంది. ఈ మూడు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ, వాణిజ్య రంగానికి ఇది ఒక వరంలా మారనుంది.

Economic corridor

ఛత్తీస్‌గఢ్ ,ఒడిశాలోని పరిశ్రమలు నేరుగా , వేగంగా విశాఖపట్నం పోర్టుకు అనుసంధానమవుతాయి. దీంతో ఎగుమతులు వేగవంతమై, లాజిస్టిక్స్ రంగం బలోపేతమవుతుంది. సరుకు రవాణా ఖర్చు తగ్గి, వ్యాపార లావాదేవీలు పెరుగుతాయి.

ఈ హైవే పనుల వల్ల స్థానిక రైతులు తమ భూముల విలువ అమాంతం పెరిగినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎకరం రూ. 15 లక్షలు పలికిన భూమి, ఇప్పుడు రూ. 1.5 కోట్లకు చేరిందంటే ఈ ప్రాజెక్టు ఆర్థిక ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ మార్గం ద్వారా ట్రక్కు యజమానులకు సమయం, డబ్బు ఆదా అవుతుంది. గతంలో ఒకటిన్నర రోజులు పట్టే ప్రయాణం, ఇప్పుడు పగలు మొదలుపెడితే రాత్రికల్లా పూర్తవుతుంది. డీజిల్ ఖర్చు, వాహనాల నిర్వహణ భారం కూడా తగ్గుతాయి.

ఈ కారిడార్(Economic corridor) ఛత్తీస్‌గఢ్, ఒడిశా , ఆంధ్రప్రదేశ్‌లోని అనేక మారుమూల, గిరిజన ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించి, ఆ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతుంది.

ఈ మెగా ప్రాజెక్టు పూర్తయితే తూర్పు, మధ్య భారతదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడి, దేశ ఆర్థికాభివృద్ధికి ఇది ఒక కీలకమైన మలుపు కానుంది.

మరిన్ని నేషనల్ న్యూస్అప్ డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version