Celebrate: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోండి.. కానీ కండీషన్స్ అప్లై.. ఎక్కడ? ఏంటా షరతులు?
Celebrate: నగరంలోని బహిరంగ ప్రదేశాల్లో, రోడ్ల మీద కేక్ కటింగ్ చేయడాన్ని పూర్తి స్థాయిలో నిషేధించారు.
Celebrate
న్యూ ఇయర్‌కు వెల్కమ్ చెప్పే వేళ తెలుగు రాష్ట్రాల్లోని యూత్ అంతా జోష్(Celebrate)లో ఉంటారు. అయితే ఈ జోష్ కాస్త హద్దులు దాటితే అది ప్రమాదాలకు దారితీస్తుందని భావించిన ఏపీ, తెలంగాణ పోలీసులు ఈసారి అత్యంత కఠినమైన ఆంక్షలను విధిస్తున్నారు. ఇది కేవలం రొటీన్ గా ఇచ్చే అలర్ట్ కాదు, గడిచిన సంవత్సరాల్లో న్యూ ఇయర్ వేడుక(Celebrate)లలో జరిగిన ప్రమాదాలను, పెరిగిన డ్రగ్స్ కల్చర్‌ను దృష్టిలో పెట్టుకుని వేసిన ఒక పక్కా వ్యూహం.
ముఖ్యంగా విజయవాడ , హైదరాబాద్ నగరాల్లో పోలీసులు అమలు చేస్తున్న నిబంధనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. న్యూ ఇయర్‌కు ప్రజలకు స్వేచ్ఛనిస్తూనే, మరోవైపు భద్రత విషయంలో రాజీ పడకుండా పోలీసులు తీసుకుంటున్న ఈ ‘స్ట్రాటజిక్ మూవ్’ నిజంగా అభినందించదగ్గదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
ముందుగా విజయవాడ విషయానికి వస్తే, అక్కడ పోలీస్ కమిషనర్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. నగరంలోని బహిరంగ ప్రదేశాల్లో, రోడ్ల మీద కేక్ కటింగ్ చేయడాన్ని పూర్తి స్థాయిలో నిషేధించారు. సాధారణంగా న్యూ ఇయర్ అంటేనే కేక్ కటింగ్, ఫైర్ వర్క్స్ గుర్తుకు వస్తాయి. కానీ గతేడాది డేటా ప్రకారం, ఇలా రోడ్ల మధ్యలో కేక్ కటింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ స్తంభించిపోవడమే కాకుండా, ఘర్షణలు , ప్రమాదాల రేటు 25 శాతం పెరిగిందట.
అందుకే ఈసారి డిసెంబర్ 31 రాత్రి , జనవరి 1న బహిరంగ ప్రదేశాల్లో కేక్ కోయడం, బాణాసంచా కాల్చడం, డ్రోన్లు ఎగురవేయడం వంటివి సెలబ్రేట్ (Celebrate) చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. ఇది కేవలం ట్రాఫిక్ కోసమే కాదు, డ్రోన్ల పేరుతో లేదా టపాసుల చాటున డ్రగ్స్ సరఫరా చేసే ముఠాల ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇక హైదరాబాద్ విషయానికి వస్తే, ఇక్కడ పోలీసుల టార్గెట్ ప్రధానంగా డ్రగ్స్ , డ్రంక్ అండ్ డ్రైవ్. హైదరాబాద్ సీపీ ఈసారి ‘జీరో టోలరెన్స్’ పాలసీని ప్రకటించారు. నగరవ్యాప్తంగా వందకు పైగా చెక్ పాయింట్లను ఏర్పాటు చేసి, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయబోతున్నారు. ముఖ్యంగా పబ్బులు , ప్రైవేట్ ఈవెంట్లలో డ్రగ్స్ వాడకం జరిగితే, ఆ పబ్ లైసెన్స్‌ను తక్షణమే రద్దు చేస్తామని గట్టి వార్నింగ్ ఇచ్చారు.
గతేడాది న్యూ ఇయర్ వేడుకల్లో 150 కి పైగా డ్రగ్స్ కేసులు నమోదు కావడం, భారీగా కొకైన్ ,ఎండీఎంఏ సీజ్ చేయడం పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది. అందుకే ఈసారి ప్రివెంటివ్ మెజర్స్ లో భాగంగా ఐటీ, మరియు పార్టీ జోన్ల మీద ప్రత్యేక నిఘా పెట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే 10 వేల రూపాయల ఫైన్ తో పాటు లైసెన్స్ సస్పెండ్ చేయడం, అవసరమైతే జైలుకు పంపడం ఖాయమని స్పష్టం చేశారు.
రెండు నగరాల వ్యూహాలను పోల్చి చూస్తే.. విజయవాడ పోలీసులు క్రౌడ్ మేనేజ్మెంట్ , పబ్లిక్ డిజార్డర్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. విజయవాడ చిన్న నగరం కాబట్టి అక్కడ ఇలాంటి నిషేధాలు అమలు చేయడం ఈజీ. ఈ రిజల్ట్ కూడా 100 శాతం ఉంటుంది. అదే హైదరాబాద్ మెట్రో నగరం కాబట్టి, ఇక్కడ ఆంక్షలు మల్టీ-లేయర్డ్ గా ఉన్నాయి.
పబ్బులకు తెల్లవారుజామున 1 గంట వరకు అనుమతి ఇచ్చినా, సీసీటీవీల ద్వారా ప్రతి మూలను పర్యవేక్షిస్తున్నారు. కేవలం వేడుకలనే కాకుండా, లిక్కర్ అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని , ప్రజల ప్రాణాలను రెండింటినీ బ్యాలెన్స్ చేయడమే పోలీసుల అసలు లక్ష్యం. గతేడాదితో పోలిస్తే ఈ కఠిన ఆంక్షల వల్ల ప్రమాదాల శాతం 20 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
మొత్తానికి వేడుకలు చేసుకోవచ్చు కానీ, మన సరదా పక్కవారికి ఇబ్బందిగా మారకూడదు. పోలీసులు విధించిన లక్ష్మణ రేఖను దాటకుండా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటే అందరికీ క్షేమం. హ్యాపీ న్యూ ఇయర్ 2026!




One Comment