coal : మంత్రిగారి కహానీ… మా బొగ్గు పక్కదేశానికి నడుచుకెళ్లింది !
coal : 4 వేల టన్నుల బొగ్గు కేవలం వరదల్లో కొట్టుకుపోయిందా? అవి ఎక్కడైనా జాడ లేకుండా పోయాయా? నిజంగా కొట్టుకుపోతే, వాటి ఆచూకీ ఎందుకు లభించడం లేదు?

coal : మేఘాలయ రాష్ట్రంలో ఏకంగా 4 వేల టన్నుల బొగ్గు అదృశ్యమవ్వడం ఒకటైతే, దీనిపై ఆ రాష్ట్ర మంత్రి ఇచ్చిన వివరణ పొలిటికల్ సునామీని సృష్టిస్తోంది. భారీ వర్షాలకు బొగ్గు కొట్టుకుపోయి బంగ్లాదేశ్‌లోకి ప్రవహించి ఉండొచ్చంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు అటు ప్రజల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
coal
రాజాజు, దియంగాన్ గ్రామాల్లోని రెండు బొగ్గు నిల్వ కేంద్రాల నుంచి ఇటీవల దాదాపు 4 వేల టన్నుల బొగ్గు మాయమైంది(Coal Missing). ఈ భారీ మొత్తం అటు డిపోలలో లేదు, ఇటు అమ్మకాల లెక్కల్లోనూ కనిపించడం లేదు. దీనిపై అక్రమ తరలింపు ఆరోపణలు వెల్లువెత్తగా, రాష్ట్ర హైకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యులను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని స్పష్టంగా ఆదేశించింది.
ఇలాంటి పరిస్థితుల్లో, రాష్ట్ర మంత్రి కీర్మెన్ షిల్లా రంగంలోకి దిగి మరీ, దేశంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే రాష్ట్రాలలో మేఘాలయ(Meghalaya) ఒకటి. తూర్పు జైంతియా హిల్స్ నుంచి కురిసే భారీ వర్షాల వల్ల వరద నీరు నేరుగా బంగ్లాదేశ్‌లోకి ప్రవహిస్తుంది. ఈ క్రమంలోనే బొగ్గు నిల్వ చేసిన గ్రామాల్లో వరదలు వచ్చి, ఆ 4 వేల టన్నుల బొగ్గు పొరుగు దేశంలోకి కొట్టుకుపోయి ఉండొచ్చని వివరించారు. ఈ అసాధారణ వాదన విన్న వారందరూ అవాక్కవుతున్నారు. 4 వేల టన్నుల బొగ్గు కేవలం వరదల్లో కొట్టుకుపోయిందా? అవి ఎక్కడైనా జాడ లేకుండా పోయాయా? నిజంగా కొట్టుకుపోతే, వాటి ఆచూకీ ఎందుకు లభించడం లేదు? ఈ వింత వివరణ అక్రమ తవ్వకాలు(Illegal Mining), తరలింపుపై ఎప్పటినుంచో ఉన్న అనుమానాలను మరింత పెంచుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మంత్రి షిల్లా వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. చివరికి బొగ్గును కూడా వదల్లేదు దొంగలు” అని ఆరోపిస్తున్నాయి. ఇంత భారీ మొత్తంలో బొగ్గు అదృశ్యమైతే, దానిపై సరైన దర్యాప్తు జరపకుండా, వరదలపై నెట్టేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నాయి. ఇది అధికారుల నిర్లక్ష్యాన్ని, లేదా అంతకుమించిన పెద్ద స్కామ్‌ను కప్పిపుచ్చడానికి చేసిన ప్రయత్నంగానే చూస్తున్నాయి.
మొత్తం మీద, మేఘాలయలో బొగ్గు మాయం కేసు ఇప్పుడు కేవలం ఒక విచారణ అంశం కాకుండా, మంత్రి ఇచ్చిన వింత వివరణతో రాజకీయ దుమారంగా మారింది. ఈ సంఘటన రాష్ట్ర ప్రభుత్వ పారదర్శకత, జవాబుదారీతనంపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది.