GST tricks: ప్యారాచూట్, కిట్ క్యాట్: కోట్లు ఆదా చేస్తున్న జిఎస్‌టి ట్రిక్స్
GST tricks: ప్యారాచూట్ ఆయిల్ అనేది హెయిర్ ఆయిల్ కాదు. ఈ విషయాన్ని ఆ కంపెనీనే స్వయంగా ప్రకటించింది.

GST tricks
మనలో చాలామంది ఇంట్లో ప్యారాచూట్ ఆయిల్ బాటిల్ తప్పకుండా ఉంటుంది. ప్రత్యేకించి మహిళలు దీన్ని జుట్టుకు రాసుకోవడానికి ఎక్కువగా వాడతారు. అయితే, మీరు రోజూ వాడే ఈ నూనె… నిజంగా ఏంటి? మీకు తెలుసా, ప్యారాచూట్ ఆయిల్ అనేది హెయిర్ ఆయిల్ కాదు. ఈ విషయాన్ని ఆ కంపెనీనే స్వయంగా ప్రకటించింది. మీరు దాని బాటిల్‌ను గమనిస్తే, ముందు భాగంలో 100% ప్యూర్ కోకోనట్ ఆయిల్ అని, కానీ వెనుక భాగంలో చిన్నగా ఎడిబుల్ ఆయిల్ (తినే నూనె) అని రాసి ఉంటుంది. దీని వెనుక ఒక ఆసక్తికరమైన బిజినెస్ ట్రిక్ (GST tricks)దాగి ఉంది.
మన ప్రభుత్వం నిబంధనల ప్రకారం, హెయిర్ ఆయిల్‌పై 18% జీఎస్టీ (GST ) చెల్లించాలి. కానీ ఎడిబుల్ ఆయిల్ (తినే నూనె) అయితే కేవలం 5% జీఎస్టీ మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఈ భారీ తేడా కారణంగా ప్యారాచూట్ కంపెనీ తమ ఉత్పత్తిని ఎడిబుల్ ఆయిల్ పేరుతో మార్కెటింగ్ చేస్తూ, ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు ఆదా చేసుకుంటోంది.

ఇలాంటి వ్యూహాన్నే(GST tricks) మొన్నటివరకూ కిట్ క్యాట్ కంపెనీ కూడా పాటించింది. కిట్ క్యాట్ అంటే మనందరికీ చాక్లెట్ అని తెలుసు. కానీ కిట్ క్యాట్ అనేది చాక్లెట్ కాదు, అది ఒక వేఫర్. ఎందుకంటే, చాక్లెట్‌పై 20% జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది, అదే వేఫర్‌పై అయితే 10% మాత్రమే. దీంతో 1999లో కిట్ క్యాట్ తమ ఉత్పత్తి చాక్లెట్ కాదు, వేఫర్ అని అధికారికంగా ప్రకటించింది. ఈ విధంగా చట్టపరమైన లూప్‌హోల్స్‌ను ఉపయోగించుకుని ఈ రెండు కంపెనీలు తమ వ్యాపారంలో భారీగా లాభాలు పొందాయి..పొందుతున్నాయి.