Just NationalLatest News

PM Kisan: పీఎం కిసాన్ 21వ విడత బిగ్ అలర్ట్.. ఆ తేదీనే రైతుల ఖాతాలోకి రూ. 2వేలు

PM Kisan: దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఈ రూ. 2,000 ఆర్థిక సహాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.

PM Kisan

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM-KISAN) లబ్ధిదారులు 21వ విడత కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఈ రూ. 2,000 ఆర్థిక సహాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే, నివేదికల ప్రకారం ఈసారి డబ్బులు విడుదల తేదీతో పాటు, కొందరు రైతులకు ఈ విడత ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 21వ విడత విడుదల తేదీని నవంబర్ 3వ తేదీన ఈ మొత్తం త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది.

పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో ఇటీవలి వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన సుమారు 2.7 మిలియన్ల మంది రైతులకు ఇప్పటికే రూ. 2,000 ముందస్తుగా విడుదలయ్యాయి.

మిగిలిన రాష్ట్రాల రైతులకు నవంబర్ 5 నాటికి రూ. 2,000 జమ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

అయితే కొంతమంది రైతులకు 21వ విడత డబ్బులు అందకపోవచ్చు. ఈ ఆర్థిక సహాయం ఆగిపోవడానికి ప్రధాన కారణాలు కింద ఇవ్వబడ్డాయి. మీ చెల్లింపు సజావుగా సాగాలంటే, ఈ లోపాలను వెంటనే సరిదిద్దుకోవాలి.

PM Kisan
PM Kisan

e-KYC పూర్తి చేయకపోవడం.. పీఎం కిసాన్(PM Kisan) లబ్ధిదారులు తప్పనిసరిగా e-KYC (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) ప్రక్రియను పూర్తి చేయాలి. ఇది చేయని వారికి డబ్బులు అందవు.

ఆధార్-బ్యాంక్ లింక్.. మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ నంబర్ లింక్ (సీడింగ్) చేయకపోతే విడత ఆగిపోతుంది.

దరఖాస్తు లోపాలు.. అప్లికేషన్‌లో తప్పుగా ఇచ్చిన IFSC కోడ్, సరైన వివరాలు లేకపోవడం లేదా మూసివేయబడిన బ్యాంక్ ఖాతా నంబర్ ఇవ్వడం వంటివి కూడా డబ్బులు ఆగిపోవడానికి కారణం అవుతాయి.

మీరు పీఎం కిసాన్ యోజనకు(PM Kisan) అర్హులా కాదా, అలాగే మీ పేరు జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ కింది విధంగా చెక్ చేసుకోవచ్చు.
ముందుగా, pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి.హోమ్ పేజీలో కనిపించే ‘Farmer Corner’ విభాగాన్ని క్లిక్ చేయండి.అందులో ‘Beneficiary List’ ఆప్షన్‌ను ఎంచుకోండి.తర్వాత, డ్రాప్‌డౌన్ మెను నుండి మీ రాష్ట్రం, జిల్లా, ఉప-జిల్లా (Sub-District), బ్లాక్, గ్రామం వివరాలను ఎంపిక చేయండి.చివరగా, ‘Get Report’ బటన్‌ను క్లిక్ చేయండి.

మీ గ్రామానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితా తెరపై కనిపిస్తుంది. అందులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. 21వ విడత డబ్బులు సకాలంలో పొందాలంటే, పైన పేర్కొన్న e-KYC, ఆధార్-బ్యాంక్ లింక్ వంటి అన్ని పనులను ఆలస్యం చేయకుండా వెంటనే పూర్తి చేసుకోండి.

మరిన్ని నేషనల్ న్యూస్అప్ డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button