Just NationalLatest News

Income Scheme: పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం.. రిస్క్ లేకుండా నెలనెలా డబ్బులు

Income Scheme: ఒకేసారి కొంత మొత్తాన్ని డిపాజిట్ చేసి, ఆ మొత్తానికి ప్రతి నెలా వడ్డీ రూపంలో కచ్చితమైన ఆదాయాన్ని పొందొచ్చు.

Income Scheme

ఎక్కువ శ్రమ లేకుండా, ప్రతి నెలా ఇంటి నుంచే ఆదాయం సంపాదించాలని ఆలోచించే వారికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఒక అద్భుతమైన పొదుపు పథకం(Income Scheme) ఉంది. అదే పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం (POMIS). ఈ పథకం ద్వారా మీరు ఒకేసారి కొంత మొత్తాన్ని డిపాజిట్ చేసి, ఆ మొత్తానికి ప్రతి నెలా వడ్డీ రూపంలో కచ్చితమైన ఆదాయాన్ని పొందొచ్చు.ఇది ఎప్పుడో ఉన్నా కూడా ఇప్పుడు దీనిని మరింత అప్ డేట్ చేశారు.

ప్రభుత్వ మద్దతు ఉండటంతో.. మీ పెట్టుబడికి పూర్తి భద్రత ఉంటుంది. ప్రస్తుతం ఈ(Income Scheme) పథకంపై 7.4% వార్షిక వడ్డీ రేటు లభిస్తోంది. ఈ వడ్డీ ప్రతి నెలా మీ ఖాతాలో జమ అవుతుంది, ఇది మీ రోజువారీ లేదా నెలవారీ ఖర్చులకు గొప్ప సహాయకారిగా ఉంటుంది.

ఈ (Income Scheme)పథకంలో కనీసం రూ.1,000 తో ఖాతాను తెరవవచ్చు. పెట్టుబడి పరిమితులను పరిశీలిస్తే, వ్యక్తిగత ఖాతాలో గరిష్టంగా రూ. 9 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. అయితే, పెళ్లైన వారు లేదా భవిష్యత్తు కోసం కలిసి ప్లాన్ చేసుకోవాలనుకునే వారికి జాయింట్ అకౌంట్ ఉంటే మంచిది. జాయింట్ అకౌంట్‌లో గరిష్టంగా రూ. 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంది.

ఉదాహరణకు మీరు ఉమ్మడి ఖాతాలో గరిష్టంగా రూ. 15 లక్షలు జమ చేస్తే, ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం మీకు నెలకు సుమారుగా రూ. 9,250 స్థిరమైన ఆదాయం లభిస్తుంది.

Income Scheme
Income Scheme

ఒకవేళ మీరు వ్యక్తిగత ఖాతాలో గరిష్టంగా రూ. 9 లక్షలు జమ చేస్తే, నెలకు సుమారు రూ.5,550 చొప్పున స్థిరమైన ఆదాయం పొందొచ్చు.ఈ పథకంలో గరిష్టంగా ముగ్గురు వ్యక్తులు కలిసి కూడా జాయింట్ అకౌంట్‌ను తెరవడానికి అవకాశం ఉంది.

ఈ పథకం మెచ్యూరిటీ కాలం 5 సంవత్సరాలు. మెచ్యూరిటీ తర్వాత మీరు మీ పెట్టుబడి మొత్తాన్ని తిరిగి తీసుకోవచ్చు లేదా అప్పటికి ఉన్న తాజా వడ్డీ రేటుతో మరో ఐదేళ్ల పాటు పొడిగించుకునే వెసులుబాటు ఉంది. దీని వల్ల మీ నెలవారీ ఆదాయం ఎక్కువ కాలం కొనసాగుతుంది. ఒక వ్యక్తి తన గరిష్ట పెట్టుబడి పరిమితికి లోబడి ఎన్ని POMIS ఖాతాలైనా తెరవవచ్చు. ముఖ్యంగా 10 ఏళ్లు దాటిన పిల్లల పేరు మీద కూడా సంరక్షకులు ఈ ఖాతాను తెరవొచ్చు, ఆ ఆదాయాన్ని వారి ఫీజులు లేదా ఇతర ఖర్చుల కోసం ఉపయోగించుకోవచ్చు.

అత్యవసర పరిస్థితుల్లో ఈ ఖాతాను ముందస్తుగా మూసివేసే అవకాశం ఉంది, అయితే కొన్ని నిబంధనలు వర్తిస్తాయి. ఖాతా తెరిచిన ఏడాదిలోపు డబ్బును ఉపసంహరించుకోవడానికి అనుమతి లేదు. 1 నుంచి 3 ఏళ్ల మధ్య క్యాన్సిల్ చేస్తే, డిపాజిట్ చేసిన మొత్తంలో 2% కోత విధించి మిగిలినది చెల్లిస్తారు. 3 ఏళ్ల తర్వాత మూసివేస్తే కేవలం 1% కోత మాత్రమే ఉంటుంది.

పన్ను విషయానికి వస్తే, ఈ పథకం నుంచి వచ్చే నెలవారీ వడ్డీ ఆదాయం మీ పన్ను పరిధిలోకి వస్తుంది, అయితే పోస్ట్ ఆఫీస్ దీనిపై TDS (ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్) ను విధించదు. అంతేకాకుండా, మీ POMIS ఖాతాను దేశంలోని ఒక పోస్ట్ ఆఫీస్ నుంచి మరొక పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేసుకునే సదుపాయం కూడా ఉంది. ఈ పథకం ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్‌కు, రిస్క్ లేకుండా స్థిరమైన నెలవారీ ఆదాయాన్ని కోరుకునే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Bihar Elections: పీకే వ్యూహం సక్సెస్ అవుతుందా ?

Related Articles

Back to top button