Sania Mirza: సానియా మీర్జా ఎమోషనల్..సింగిల్ మదర్‌గా జీవించడంపై ఓపెన్ అయిన సానియా
Sania Mirza: తాజాగా, ప్రముఖ దర్శకురాలు ఫరా ఖాన్ నిర్వహించిన ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సానియా, తన ప్రస్తుత జీవన సవాళ్ల గురించి మనసు విప్పి మాట్లాడారు.
Sania Mirza
భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా (Sania Mirza)తన వ్యక్తిగత జీవితంపై అరుదుగా మాట్లాడతారు. అయితే, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో విడాకులు తీసుకున్న తర్వాత, ఆమె ఒంటరి తల్లిగా తన కుమారుడు ఇజ్హాన్‌ను పెంచుతున్నారు. తాజాగా, ప్రముఖ దర్శకురాలు ఫరా ఖాన్ నిర్వహించిన ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సానియా, తన ప్రస్తుత జీవన సవాళ్ల గురించి మనసు విప్పి మాట్లాడారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సానియా మీర్జా(Sania Mirza) తన ఇంటర్వ్యూలో ఒంటరి తల్లిగా జీవించడం ఎంత కష్టమో వివరించారు. ఆమె మాటల్లో..ఒంటరి తల్లిగా జీవించడం చాలా కష్టం. ప్రతి రోజు ఒక కొత్త సవాల్ ఎదురవుతూనే ఉంటుంది. విడాకుల తర్వాత తన కుమారుడు ఇజ్హాన్‌కి తల్లీ, తండ్రి బాధ్యతలను తానొక్కతే భరించాల్సి వస్తుంది.
గతంలో పానిక్ అటాక్ (Panic Attack) వచ్చిన సమయంలో ఫరా ఖాన్ తనకు బలంగా అండగా నిలిచిందని సానియా మీర్జా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. దీనిపై ఫరా ఖాన్ కూడా స్పందిస్తూ, సానియాను “నిజమైన ఫైటర్”గా ప్రశంసించారు. జీవితంలో ఎంత ఒత్తిడిని ఎదుర్కొన్నా, ఆమె ధైర్యంగా నిలబడే వ్యక్తి అని ఫరా వ్యాఖ్యానించారు.

విడాకులు తీసుకున్నా కూడా, పిల్లలపై ఆ ప్రభావం తప్పక ఉంటుందని సానియా అంగీకరించారు. ఆమె తన మనోభావాలను పంచుకుంటూ, “తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి ఉండటం పిల్లల కోసం ఉత్తమం. కానీ, జీవిత పరిస్థితులు ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండవు. అందుకే, మనం ధైర్యంగా ముందుకు వెళ్లాలి” అని చెప్పారు. ప్రస్తుతం సానియా తన కుమారుడితో కలిసి హైదరాబాదులో స్థిరపడి, తన కొత్త జీవన మార్గాన్ని ధైర్యంగా ముందుకు తీసుకెళ్తున్నారు.
ఇక భారతదేశం గర్వించదగిన టెన్నిస్ క్రీడాకారిణి అయిన సానియా మీర్జా 1986, నవంబర్ 15న ముంబైలో జన్మించారు, ఆ తర్వాత ఆమె హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. భారతీయ జాతీయత కలిగిన ఆమె కెరీర్‌లో అత్యంత గొప్ప ఘనత ఏమిటంటే, టెన్నిస్‌లో వరల్డ్ నం. 1 ర్యాంక్ (డబుల్స్ కేటగిరీలో) సాధించిన ఏకైక భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు.
తన కెరీర్ మొత్తంలో ఆమె 6 ప్రతిష్ఠాత్మక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను (3 మహిళల డబుల్స్ , 3 మిక్స్‌డ్ డబుల్స్) గెలుచుకున్నారు. దేశ అత్యున్నత క్రీడా పురస్కారాలలో ఒకటైన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న (2015) తో పాటు, అర్జున అవార్డు (2004), పద్మశ్రీ (2006), మరియు పద్మ భూషణ్ (2016) వంటి పౌర పురస్కారాలను కూడా అందుకున్నారు. వ్యక్తిగత జీవితంలో, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో విడాకులు తీసుకున్న ఆమెకు ఇజ్హాన్ మీర్జా మాలిక్ అనే కుమారుడు ఉన్నాడు.




One Comment