Selfie deaths:సెల్ఫీ పిచ్చికి బలైపోతున్న ప్రాణాలు..టాప్ ప్లేసులో భారత్
Selfie deaths:కేవలం ఒక చిత్రాన్ని క్యాప్చర్ చేయాలన్న ఆత్రం, ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతోంది. ఈ విషాదకరమైన సెల్ఫీ ట్రెండ్‌లో, అత్యధిక మరణాలతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచిన పరిస్థితిలో భారతదేశం ఉంది.

Selfie deaths
ఒక అందమైన ప్రదేశం, ఒక ఆనందకరమైన క్షణం, ఒక మర్చిపోని నవ్వు… ఇవన్నీ ఫోన్‌లో పదిలపరుచుకోవడానికి మనం వాడే అద్భుతమైన సాధనం సెల్ఫీ. కానీ, అదే సెల్ఫీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విషాదాలను సృష్టిస్తోంది. లైకుల వేటలో, ప్రశంసల దాహంలో, ఎన్నో జీవితాలు సెల్ఫీ బారిన పడి విగతజీవులుగా మిగిలిపోతున్నాయి. కేవలం ఒక చిత్రాన్ని క్యాప్చర్ చేయాలన్న ఆత్రం, ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతోంది. ఈ విషాదకరమైన సెల్ఫీ ట్రెండ్‌లో, అత్యధిక మరణాలతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచిన పరిస్థితిలో భారతదేశం ఉంది.
ప్రపంచవ్యాప్తంగా సెల్ఫీ మరణాల (Selfie deaths) అధ్యయనం ప్రకారం, మార్చి 2014 నుంచి మే 2025 మధ్య జరిగిన మొత్తం సెల్ఫీ మరణాల్లో 42.1% కేసులు మన భారతదేశంలోనే సంభవించాయి. అంటే ప్రపంచంలోనే అత్యధిక సెల్ఫీ మరణాలు భారత్‌లోనే జరుగుతున్నాయి. ఈ ప్రమాదకరమైన ప్రవర్తన వెనుక ఉన్న కారణాలు, పరిష్కార మార్గాలపై ఒక అవలోకనం.
Gold : మరోసారి పెరిగిన పుత్తడి ధర.. ఈరోజు ఎంత పెరిగిందంటే..
సెల్ఫీలు తీసుకునేటపుడు యువత చేసే అతి జాగ్రత్తలేని పనులు ప్రమాదాలకు(Selfie deaths) దారితీస్తున్నాయి. ఎత్తైన భవనాలు, కొండలు, రైలు పట్టాలు, నదుల మధ్య ఉన్న రాళ్లు వంటి ప్రమాదకర ప్రాంతాల్లో సెల్ఫీలు తీసుకునే ప్రయత్నంలో చాలా మంది జారిపడటం, రైలు ప్రమాదాల బారిన పడటం, నీటిలో మునిగిపోవడం జరుగుతోంది. భారతదేశం తర్వాత యునైటెడ్ స్టేట్స్, రష్యా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.

హైదరాబాద్‌లో, ఎత్తయిన భవనంపై సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో ఒక యువకుడు పడిపోయాడు.అలాగే ముంబైలో, రైలు పట్టాల మీద సెల్ఫీలు తీసుకుంటూ ఎంతో మంది ప్రమాదాలకు (Selfie deaths)గురయ్యారు.అంతేకాదు భద్రాద్రి కొత్తగూడెంలో, అందమైన కొండప్రాంతంలో సెల్ఫీ కోసం వెళ్లి పడిపోయి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన కూడా తాజాగా జరిగింది.
సోషల్ మీడియా ప్రభావంపై మానసిక నిపుణుల హెచ్చరిక..ఈ ప్రమాదాల వెనుక ఉన్న ముఖ్య కారణం సోషల్ మీడియా ప్రభావం. ఎక్కువ “లైకులు”, “షేర్లు” కోసం యువత తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. సామాజికంగా గుర్తింపు పొందాలనే ఆరాటం, ప్రమాదాలను పట్టించుకోని ప్రవర్తన దీనికి ప్రధాన కారణాలుగా మానసిక ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సోషల్ మీడియా డిపెండెన్సీని తగ్గించుకోవడం కోసం అవగాహన కార్యక్రమాలు, కుటుంబ సభ్యుల సహాయం, అవసరమైతే థెరపీ తీసుకోవడం ముఖ్యమని మానసిక ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
సెల్ఫీ ప్రమాదాలను నివారించడానికి ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకుంటున్నాయి. అనేక నగరాల్లో ప్రమాదకర ప్రాంతాలను సెల్ఫీ నిషేధిత జోన్‌లుగా ప్రకటించారు. సెల్ఫీలు మన జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకునేందుకు ఒక మంచి సాధనం మాత్రమే. దానిని అతి జాగ్రత్తగా ఉపయోగించాలి. ఈ ప్రమాదాలను నివారించడానికి ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా యువత, కుటుంబ సభ్యులు, సమాజం మొత్తం కలిసి ప్రయత్నించాలి. ఒక్క చిన్న జాగ్రత్త మన ప్రాణాలను కాపాడుతుందని గుర్తుంచుకోవాలి.
One Comment