BC reservation :ఢిల్లీ మే సవాల్..ఇచ్చట బీసీలకు రాజ్యాధికారం ఇవ్వబడును!
BC reservation: తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన 42% బీసీ రిజర్వేషన్(BC reservation) బిల్లులు కేంద్రం ముందు పెండింగ్‌లోనే ఉన్నాయి. అందుకే..రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు జంతర్ మంతర్‌కి వెళ్లి ఏకంగా ధర్నా ప్రారంభించారు.

BC reservation
ఒకప్పుడు ఓటు వేయించేటప్పుడు మాత్రమే బీసీ అన్న పదం గుర్తుకు వచ్చేది కానీ పదవులు ఇచ్చేటప్పుడు మాత్రం మౌనమే జవాబుగా ఉండేది . కానీ ఇప్పుడు ఆ మౌనాన్ని ఢిల్లీ వీధుల్లో నినాదాలతో కుదిపేస్తున్నాయి.దీంతో తెలంగాణ రాజకీయం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఢిల్లీలో గళమెత్తింది.మొత్తంగా తెలంగాణ రాజకీయం అంతా బీసీల చుట్టూనే తిరుగుతోంది.
తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన 42% బీసీ రిజర్వేషన్(BC reservation) బిల్లులు కేంద్రం ముందు పెండింగ్‌లోనే ఉన్నాయి. అందుకే..రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు జంతర్ మంతర్‌కి వెళ్లి ఏకంగా ధర్నా ప్రారంభించారు.
ఢిల్లీ జంతర్‌మంతర్ నుంచి రేవంత్ రెడ్డి బీసీలకు న్యాయం చేయాలని గళం విప్పారు. చేతిలో రిజర్వేషన్ బిల్లులు(BC reservation), గట్టిగా నినాదాలు, వెనక వందల మంది కార్యకర్తలు. వీరి ప్రస్తుత లక్ష్యం ఒక్కటే ..బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌కి రాష్ట్రపతి ఆమోదం తీసుకురావాలి.

ఇది హఠాత్తుగా తెరమీదకు వచ్చిన ఆందోళన కాదు. కొన్ని నెలలుగా రేవంత్(Revanth Reddy) ప్రభుత్వం ఈ బిల్లుల్ని పంపి, ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. కానీ కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి డైరెక్ట్‌గా గళం వినిపించేశారు.
ఇప్పటికీ కేంద్రం బీసీలకు పూర్తి న్యాయం చేసింది అనిపించదనే వాదన ఉంది. అయితే గతంలో కులగణన వద్దంటూ మాట్లాడిన బీజేపీ, ఇప్పుడు మాత్రం అవసరమైతే కులగణన చేస్తామని చెబుతోంది.బీసీల లో నుంచి వస్తున్న ఒత్తిడి రోజు రోజుకీ పెరుగుతుండటమే దీనికి కారణం.
కవిత(Kavitha) కూడా బీసీలపై రిజర్వేషన్ విషయంలో 72 గంటల దీక్ష చేశారు. కాంగ్రెస్, బీజేపీలు రెండు పార్టీలూ బీసీలను వాడుకుంటున్నాయని… ముస్లింలకు BC కోటాలో కాకుండా ప్రత్యేకంగా రిజర్వేషన్ ఇవ్వాలంటూ మరో డిమాండ్ పెట్టారు. అయితే ఈసారి కవిత ‘జాగృతి’ బ్యానర్‌తో ముందుకెళ్లిన తీరు చూస్తే, పార్టీకంటే ఆమె స్వతంత్రంగా తానే దూకాలని భావిస్తోందేమో అనిపిస్తోంది.
మరోవైపు ( Ktr) మాత్రం ఒకటి చెప్పి, మరొకటి చేసే కాంగ్రెస్ నాటకం ఆపాలంఅంటూ తనదైన టోన్‌లో పంచ్ వేశారు. దీంతో వాళ్ల పాలనలో బీసీలకు ఏం చేశారు అని ఎదురుదాడి చేసిన కాంగ్రెస్.. మేమే రిజర్వేషన్ పెంచాం, మేమే పోరాడుతున్నాం అంటూ తనదైన ప్రచారాన్ని కొనసాగిస్తోంది.
బీజేపీలో మాత్రం బీసీ నాయకులు ఎవరు? సీఎం అభ్యర్థిగా ఎవరు? అనే అంశంలో అంతర్గత చిచ్చు బయటపడుతోంది. ఈటల రాజేందర్, బండి సంజయ్ మధ్య లీడర్ ఎవరు? అనే టాపిక్ ఎప్పుడూ హాట్ టాపిక్‌గా హీటు పుట్టిస్తూనే ఉంది. ఇలాంటి సమయంలో బీసీ సీఎం కావాలి అన్న మాటలు బీజేపీ నుంచి వచ్చినా ప్రజలు నమ్ముతున్నారా అనేది డౌటే.
ఈ అన్నీ చూస్తే ఒక డౌటు అందరికీ వస్తోంది నిజంగా బీసీల సమస్యల మీద పార్టీలు పనిచేస్తున్నాయా? లేక రాబోయే ఎన్నికల్లో ఓట్లు ఎలా రాబట్టుకోవాలా అనే బీసీ నినాదం ఎత్తుకున్నాయా అన్న అనుమానం తొలిచేస్తుంది.
బీసీ ఓటు బ్యాంక్ కోసం పాట్లు పడుతున్నారు. కానీ నిజంగా విద్య, ఉద్యోగాల్లో మార్పు వస్తుందా? రిజర్వేషన్ బిల్లులు శాశ్వతంగా అమలవుతాయా? కులగణన న్యాయంగా పూర్తవుతుందా? ఇవే ఇప్పుడు ప్రజల్లో వినిపిస్తున్న ప్రశ్నలు.
నిజంగా బీసీలకు న్యాయం కావాలంటే… సభలో నినాదాలు కాదు, ఫైల్ మీద సంతకాలు కావాలి. ఆమోదాలు కావాలి. ఓటు వేయించుకున్న పార్టీలు… ఇప్పుడు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాయా అనే ప్రశ్న.. ప్రతి బీసీ యువకుడి మనసులో ఉంది. ఢిల్లీకి వెళ్లి ధర్నాలు చేయడం కాదు.. దాన్ని అమలు చేయించుకోవడంలోనే అసలైన పనితనం ఉందని భావిస్తున్నాయి.
Also Read: Battery is dead : ఫోన్ ఉబ్బిందా..అయితే మీరు డేంజర్లో పడినట్లే