Just NationalLatest News

Delivery: సూపర్‌ ఫాస్ట్‌ డెలివరీ.. దేశంలో ఎక్కడికైనా ఇకపై 24 గంటల్లోనే పార్శిల్‌

Delivery: కేవలం 24 గంటల్లోనే దేశంలోని ఏ ప్రాంతానికైనా పార్శిళ్లను చేరవేసే సరికొత్త 'సూపర్‌ ఫాస్ట్‌ డెలివరీ' విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది.

Delivery

దేశంలో పోస్టల్‌ సేవలు మరింత వేగవంతం కానున్నాయి. ప్రైవేటు కొరియర్ సంస్థలకు దీటుగా, తన సేవలను ఆధునీకరించే దిశగా భారత తపాలా శాఖ (India Post) కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా, కేవలం 24 గంటల్లోనే దేశంలోని ఏ ప్రాంతానికైనా పార్శిళ్లను చేరవేసే సరికొత్త ‘సూపర్‌ ఫాస్ట్‌ డెలివరీ’ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శుక్రవారం వెల్లడించారు.

  • 24 గంటలు, 48 గంటల్లో గ్యారెంటీ డెలివరీ(Delivery)
    కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపిన వివరాల ప్రకారం, దేశవ్యాప్తంగా పోస్టల్ సేవలను రెండు వేర్వేరు గ్యారెంటీ డెలివరీ స్లాట్లలో అందించనున్నారు.
  • 24 గంటల స్పీడ్ పోస్ట్ సర్వీస్.. దేశంలోని అన్ని ప్రధాన నగరాలు, రాష్ట్ర రాజధానులలో మెయిల్స్ , పార్శిళ్లు కేవలం 24 గంటల్లోపు డెలివరీ అయ్యేలా ఈ సేవను రూపొందించారు.
  • 48 గంటల స్పీడ్ పోస్ట్ సర్వీస్.. అదేవిధంగా, నిర్ణీత ప్రాంతాలకు మెయిల్స్ 48 గంటల్లోపు డెలివరీ కోసం మరో గ్యారెంటీ స్పీడ్ పోస్ట్ సేవను కూడా ప్రారంభిస్తారు.
    Delivery
    Delivery
  • అమలు లక్ష్యం.. వచ్చే ఏడాది జనవరి వరకు ఈ సూపర్‌ ఫాస్ట్ డెలివరీ సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడానికి తపాలా శాఖ సన్నాహాలు చేస్తోంది.
  • ఈ-కామర్స్ సంస్థలతో భాగస్వామ్యం.. ఈ నూతన వేగవంతమైన సేవల్లో భాగంగా, ఇండియా పోస్ట్ ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలైన అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్ (Flipkart) వంటి సంస్థలతో కలిసి పనిచేయనున్నట్లు మంత్రి తెలిపారు.

ప్రైవేట్ కొరియర్‌ సంస్థలకు ప్రధాన పోటీని ఇవ్వడానికి , దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా వేగంగా సేవలను అందించడానికి భారత తపాలా శాఖ తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది.

Jubilee hills bypoll: రేవంత్ కు జూబ్లీహిల్స్ టెన్షన్

Related Articles

Back to top button