Just National

MiG-21: ముగిసిన మిగ్-21 శకం ఫేర్ వెల్ ఇచ్చిన వాయుసేన

MiG-21: మిగ్-21 జెట్ సేవలను కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు. 1971లో జరిగిన యుద్ధం మొదలు.. ఇటీవల ఆపరేషన్ సిందూర్ వరకు మిగ్-21 ఫైటర్ జెట్‌ది కీలక పాత్రగా గుర్తు చేశారు.

MiG-21

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఒక చారిత్రక శకం ముగిసింది. ఆరు దశాబ్దాలకుపైగా భారత వాయుసేన కీలక సేవలందించిన మిగ్-21 ఫైటర్ జెట్ రిటైరయింది. ఈ ప్రతిష్టాత్మక జెట్ ఫైటర్ కు వాయుసేన ఘనంగా ఫేర్ వెల్ ఇచ్చింది. భారత వాయుసేనలోకి ఈ మిగ్-21(MiG-21) యుద్ధ విమానం 1963లో తొలిసారిగా ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫైటర్ జెట్ ను రష్యా తయారు చేసింది. భారత్ లో మొట్టమొదటి సూపర్‌సోనిక్ యుద్ధ విమానం ఇదే. అప్పటి నుంచీ ఇటీవల ఆపరేషన్ సిందూర్ వరకు వాయుసేనలో ఎన్నో కీలక సేవలు అందించింది. పలు యుద్ధాల్లో భారత్ సాధించిన విజయాల్లో మిగ్-21 దే కీలకపాత్రగా ఉంది.

MiG-21
MiG-21

తాజాగా చండీగఢ్ లో మిగ్ -21 యుద్ధవిమానానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్ ఘనంగా వీడ్కోలు పలికారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఐఏఎఫ్ సీనియర్ అధికారులు ఈ ఫేర్ వెల్ కార్యక్రమానికి హాజరయ్యారు. వీడ్కోలు సందర్భంగా మిగ్‌లకు వాటర్ సెల్యూట్ చేశారు. తరువాత ఐఏఎఫ్ చీఫ్ మిగ్ ఫైటర్ జెట్స్ కు సంబంధించిన లాగ్‌బుక్‌ను రాజ్‌నాథ్ సింగ్‌కు అందజేశారు. మిగ్ -21 శకానికి వీడ్కోలుకు గుర్తుగా ఒక స్పెషల్ పోస్టల్ కవర్ ను కూడా విడుదల చేశారు.

ఈ సందర్భంగా వాయుసేన మిగ్-21 జెట్ సేవలను కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు. 1971లో జరిగిన యుద్ధం మొదలు.. ఇటీవల ఆపరేషన్ సిందూర్ వరకు మిగ్-21 ఫైటర్ జెట్‌ది కీలక పాత్రగా గుర్తు చేశారు. భారత్ చేసిన అనేక వీరోచిత పోరాటాలకు మిగ్-21 యుద్ధ విమానం సాక్ష్యంగా నిలిచిందన్నారు.. 1971 యుద్ధం, కార్గిల్ వార్, ఆపరేషన్ సింధూర్ వంటి ప్రధాన యుద్ధాల్లో మిగ్ 21 జెట్ కీలకంగా వ్యవహరించిందని తెలిపారు.
మిగ్-21(MiG-21) కేవలం ఒక విమానం మాత్రమే కాదన్న రాజ్ నాథ్ సింగ్…

MiG-21
MiG-21

భారత్, రష్యా మధ్య లోతైన సంబంధానికి నిదర్శనమన్నారు.ఎయిర్ ఫోర్స్ లో ఎంతో పవర్ ఫుల్ గా ఉండే మిగ్-21 దేశానికి రక్షణ కవచంగా నిలిచిందని ప్రశంసించారు. గత కొన్ని తరాలుగా వైమానిక వీరులకు మిగ్ 21 ఎంతో స్ఫూర్తినిచ్చిందన్నారు. అయితే గత రెండేళ్ళుగా కొన్ని సాంకేతిక లోపాలతో ఈ ఫైటర్ జెట్స్ ప్రమాదాలకు గురయ్యాయి. అప్పటి నుంచి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తేజాస్ పై ఫోకస్ పెరిగింది. ప్రస్తుతం మిగ్-21 సేవలకు ముగింపు పలికిన భారత వాయుసేన ఇక తేజాస్ ను ఉపయోగించనుంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button