Pawan: పవన్ ఉత్తరాంధ్ర సెంటిమెంట్ .. విశాఖలో ‘సేనతో సేనాని’
Pawan: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును సభ ప్రాంగణానికి పెట్టడం ఒక ప్రత్యేకమైన అంశం.

Pawan
సంకీర్ణ ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్,(Pawan) ఇప్పుడు తన పార్టీ జనసేనను బలోపేతం చేయడానికి పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ఏడాది పాలన పూర్తవడంతో.. పార్టీపై పూర్తి దృష్టి పెట్టేందుకు విశాఖపట్నంలో మూడు రోజుల పాటు సేనతో సేనాని’ పేరుతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఈ సమావేశాలలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును సభ ప్రాంగణానికి పెట్టడం ఒక ప్రత్యేకమైన అంశం. పవన్ కళ్యాణ్(Pawan) స్వయంగా ఈ పేరును పెట్టారు. ఈ పేరు పెట్టడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం, ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవమైన అల్లూరి సీతారామరాజును గౌరవించడమే కాదు, ఉత్తరాంధ్ర ప్రజలతో జనసేనకు ఉన్న అనుబంధాన్ని చాటి చెప్పడమే. ఈ సభ విశాఖ మున్సిపల్ స్టేడియంలో జరుగుతుంది.

ఈ సమావేశాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్(Pawan) హాజరై, మూడు రోజులపాటు విశాఖలోనే ఉంటారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజా ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు హాజరుకానున్నారు.
రేపు అంటే ఆగస్ట్ 29న ముఖ్య నాయకులతో సమావేశం ఉంటుంది. ఆరోజు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎంపికైన పదిమంది పార్టీ సభ్యులతో పవన్ కళ్యాణ్ వివిధ అంశాలపై మాట్లాడుతారు. అలాగే, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కూడా భేటీ అవుతారు.
30న భారీ బహిరంగ సభ ఉంటుంది. ఈ సభకు సుమారు పదిహేను వేల మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా. జనసేన ఆవిర్భావ సభ పిఠాపురంలో జరిగిన తర్వాత, పార్టీ విజయం సాధించడంలో భాగంగా నిర్వహిస్తున్న ఈ సభ విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తవడంతో జనసేన వర్గాలు..
భారీ బహిరంగ సభ సక్సెస్పైనే ఫోకస్ పెంచారు.
నిజానికి పవన్ కళ్యాణ్(Pawan) ఉత్తరాంధ్ర ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారన్న విషయం తెలిసిందే. పార్టీలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా, కొత్త కార్యక్రమం రూపొందించాలన్నా ఉత్తరాంధ్ర నుంచి మొదలుపెట్టడం ఆయన అలవాటుగా చేసుకున్నారు.దీనిలో భాగంగానే..పార్టీకి అత్యంత కీలకమైన ఈ విస్తృత స్థాయి సమావేశాలను విశాఖలో నిర్వహిస్తున్నారు.
‘సేనతో సేనాని’ సదస్సు జనసేనను బలోపేతం చేయడమే కాకుండా, రాబోయే ఎన్నికల కోసం పార్టీ ప్రణాళికలను రూపొందించడంలో ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన సామాజిక-రాజకీయ దృక్కోణాలను బలోపేతం చేస్తుందని పార్టీ వర్గాలు నమ్ముతున్నాయి.