Just SpiritualJust Andhra PradeshLatest News

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ దర్శన టికెట్లు, గదుల బుకింగ్ తేదీలు ఇవే

Tirumala: లక్కీడిప్‌లో టికెట్లు పొందిన వారు ఆగస్టు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

Tirumala

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. నవంబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, వసతి గదుల కోటాను(Tirumala)  తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) త్వరలో ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. టీటీడీ వెబ్‌సైట్ ద్వారా భక్తులు వివిధ రకాల సేవా టికెట్లను, దర్శనాలను, గదులను బుక్ చేసుకోవచ్చు.

నవంబర్ నెల దర్శన కోటా విడుదల వివరాలు..టీటీడీ విడుదల చేయనున్న ముఖ్యమైన తేదీలు, దర్శన కోటాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

నవంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను ఆగస్టు 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది. ఈ టికెట్ల కోసం ఆగస్టు 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ డిప్ కోసం నమోదు చేసుకోవచ్చు. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన వారు ఆగస్టు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

Tirumala
Tirumala

ఆగస్టు 21న.. ప్రత్యేక సేవలు, వర్చువల్ సేవలు

  • కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను ఆగస్టు 21న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
  • వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్ల కోటాను అదే రోజు (ఆగస్టు 21) మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు.
  • ఆగస్టు 23న.. అంగప్రదక్షిణం, శ్రీవాణి, వృద్ధులు/దివ్యాంగుల దర్శనం
  • అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఆగస్టు 23న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
  • శ్రీవాణి ట్రస్టు టికెట్ల ఆన్‌లైన్ కోటా ఆగస్టు 23వ తేదీ ఉదయం 11 గంటలకు అందుబాటులోకి వస్తుంది.
  • వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను అదే రోజు (ఆగస్టు 23) మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ విడుదల చేస్తుంది.
  • ఆగస్టు 25న.. ప్రత్యేక ప్రవేశ దర్శనం, వసతి గదులు
  • ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఆగస్టు 25న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
  • తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను అదే రోజు (ఆగస్టు 25) మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

భక్తులు(Tirumala) ఈ టికెట్లు, దర్శనాలకు సంబంధించిన వివరాలను టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చు. భక్తులు సరైన తేదీలను, సమయాన్ని గుర్తుపెట్టుకుని తమకు కావాల్సిన సేవలు, దర్శన టికెట్లను ముందుగానే బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button