Char Dham Yatra: చార్‌దామ్ యాత్ర ఎలా ప్రారంభమైంది? ఈ యాత్ర వెనుక 1962 యుద్ధ చరిత్ర ఉందని తెలుసా?
Char Dham Yatra: ఉత్తరాఖండ్‌ను దైవ భూమి అని కూడా అంటారు. ఒకేసారి ఈ నాలుగు ఆలయాలను దర్శించుకోవడం వల్ల పాపాలు తొలిగిపోయి పుణ్యం లభిస్తుందని భక్తులు నమ్ముతారు.

Char Dham Yatra
భారతదేశంలోని అన్ని యాత్రల కంటే చార్‌దామ్ యాత్ర (Char Dham Yatra)చాలా ప్రత్యేకమైనది అలాగే కష్టతరమైనది. ఎత్తైన మంచుకొండలు, లోయలను దాటుకుంటూ వెళ్లాల్సిన ఈ యాత్రలో హిమాలయ పర్వతాలకు ఆనుకొని ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నాలుగు పవిత్ర ఆలయాలను దర్శించుకుంటారు. అవి యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్. అందుకే ఉత్తరాఖండ్‌ను దైవ భూమి అని కూడా అంటారు. ఒకేసారి ఈ నాలుగు ఆలయాలను దర్శించుకోవడం వల్ల పాపాలు తొలిగిపోయి పుణ్యం లభిస్తుందని భక్తులు నమ్ముతారు.
ప్రతి ఏటా ఏప్రిల్ లేదా మే నెలలో ప్రారంభమయ్యే ఈ (Char Dham Yatra)యాత్ర, అక్టోబర్ లేదా నవంబర్ వరకు కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఈ యాత్రకు వెళ్తుంటారు.
చార్‌దామ్ యాత్ర చారిత్రక మలుపు.. ఈ చార్‌దామ్ యాత్ర(Char Dham Yatra)కు 1950వ దశకం కంటే ముందు పరిస్థితి వేరేలా ఉండేది. ఆ రోజుల్లో అక్కడికి వెళ్లడానికి సరైన రోడ్డు మార్గం, రవాణా సౌకర్యం ఉండేది కాదు. అందుకే కేవలం స్థానికులు, సాధువులు, అఘోరాలు మాత్రమే కష్టాలను లెక్కచేయకుండా యాత్రకు వెళ్లేవారు.

ఈ పరిస్థితి 1962లో చైనాతో యుద్ధం జరిగిన తర్వాత పూర్తిగా మారింది. చైనా సరిహద్దులకు సైనికులు వెళ్లడం కోసం, కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాంతంలో యుద్ధ ప్రాతిపదికన రోడ్లను , రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేసింది. యుద్ధం ముగిసిన తర్వాత, ఇతర ప్రాంతాల భక్తులు కూడా ఆ మార్గాల ద్వారా సులభంగా యాత్రకు వెళ్లడం ప్రారంభించారు.
యాత్ర పద్ధతి, ప్రత్యేక సంప్రదాయం.. చార్‌దామ్ యాత్రకు వెళ్లే భక్తులు ఒక క్రమాన్ని పాటిస్తారు. ముందుగా యమునోత్రికి వెళ్లి, ఆ తర్వాత గంగోత్రి, అనంతరం కేదార్‌నాథ్ , చివరగా బద్రీనాథ్ చేరుకుంటారు. యమునోత్రిలో యమునా నదిలోని నీటిని, గంగోత్రిలో గంగానదిలోని పవిత్ర జలాన్ని తీసుకొచ్చి, వాటిని చివరి ఆలయమైన బద్రీనాథుడికి అభిషేకం చేస్తారు. ఇలా చేయడం వల్ల ఆయురారోగ్యాలు, సిరి సంపదలు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు.
ప్రయాణంలో జాగ్రత్తలు, ఆరోగ్య సవాళ్లు.. ఈ నాలుగు ఆలయాలు సముద్ర మట్టానికి వేల కిలోమీటర్ల ఎత్తులో, మంచుకొండల్లో ఉన్నాయి. అందుకే పైకి వెళ్తున్న కొద్దీ ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతాయి. దీని కారణంగా చాలా మందికి తలనొప్పి, వాంతులు వంటి సమస్యలు వస్తాయి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కొందరు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
కొన్ని చోట్ల నడవలేని భక్తుల కోసం గుర్రాలు, పల్లకీలు అందుబాటులో ఉంటాయి.యాత్రలో అత్యంత ఇరుకైన దారుల్లో నడవాల్సి వస్తుంది కాబట్టి, చిన్న తప్పిదం జరిగినా లోయలో పడిపోయే ప్రమాదం ఉంది. అందుకే అత్యంత జాగ్రత్తగా ఉండాలి.
యాత్రకు వెళ్లే ముందు మెడికల్ టెస్ట్‌లు తప్పకుండా చేయించుకోవాలి. పూర్తిగా ఆరోగ్యంగా ఉంటేనే యాత్రకు వెళ్లాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు మందులను తప్పకుండా వెంట తీసుకెళ్లాలి.
ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ టూర్ ప్యాకేజీలు ఈ యాత్ర కోసం అందుబాటులో ఉన్నాయి.