Just SpiritualLatest News

Tirumala: ప్రపంచ ధనవంతమైన ఆలయం..కోట్లాది భక్తులను ఆకర్షించే తిరుమల ప్రాముఖ్యత

Tirumala: తిరుమల దేవాలయం ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.

Tirumala

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి కొండపై వెలసిన ఈ(Tirumala) దేవాలయం కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి చెందింది. ఇది ప్రపంచంలో అత్యంత ధనవంతమైన దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయం విష్ణువు యొక్క అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామి (బాలాజీ) కి అంకితం చేయబడింది.

తిరుమల దేవాలయం ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. భక్తులు సమర్పించే బంగారం, నగదు ,తలనీలాలు (కేశఖండనం) ఇక్కడ అపారంగా ఉంటాయి. భక్తులు తమ మొక్కులను తీర్చుకోవడానికి తలనీలాలను సమర్పించడం ఇక్కడ ఒక ప్రసిద్ధ సంప్రదాయం.

ఇక్కడి మూల విగ్రహం నిలబడిన భంగిమలో, నాలుగు చేతులతో ఉంటుంది. విగ్రహం అలంకరణ , ఆభరణాల వైభవం అద్భుతం.

విష్ణు అవతారం.. కలియుగంలో మానవులను రక్షించడానికి, శ్రీమహావిష్ణువు వెంకటేశ్వర స్వామి రూపంలో భూమిపై అవతరించారని నమ్ముతారు.

Tirumala
Tirumala

రుణం కథ.. వెంకటేశ్వర స్వామి తన వివాహం కోసం కుబేరుడి నుండి భారీ మొత్తంలో రుణం తీసుకున్నారని, కలియుగం అంతమయ్యే వరకు ఆ రుణాన్ని తీరుస్తారని ప్రతీతి. అందుకే భక్తులు స్వామివారికి ధనం సమర్పిస్తే, తమ రుణ భారాలు కూడా తొలగిపోతాయని నమ్ముతారు.

ఆలయ రహస్యాలు.. స్వామివారికి నిజమైన వెంట్రుకలు ఉన్నాయని, విగ్రహం వెనుక భాగం ఎప్పుడూ తేమగా ఉంటుందని, విగ్రహం ప్రధాన మండపానికి మధ్యలో ఉన్నట్లు కనిపించినా, అది మూలలో ఉందని కొన్ని నమ్మకాలు ఉన్నాయి.

తిరుమల (Tirumala)దేవాలయం కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు దైవభక్తికి, విశ్వాసానికి కేంద్రం. ప్రతి సంవత్సరం కోట్లాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు.

Diwali: దీపావళి ఒక్కరోజు పండుగ కాదు ఐదు రోజుల పండుగ.. ఏ రోజు ఏం చేయాలంటే

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button