Vinayaka Chavithi: వినాయక చవితికి అలాంటి విగ్రహం అస్సలు కొనొద్దు?
Vinayaka Chavithi: వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించిన తర్వాత, పూజించే సమయంలో ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి.

Vinayaka Chavithi
వినాయక చవితి వచ్చేస్తోంది. ఇంకొద్ది రోజుల్లో ఊరూవాడా భక్తి భావంతో ఉప్పొంగిపోతాయి. ఈ ఏడాది ఆగస్టు 27, బుధవారం నాడు వినాయక చవితి వేడుకలు మొదలవుతాయి. ఈ పర్వదినం సందర్భంగా, తొమ్మిది రోజుల పాటు గణపయ్యను పూజించి, భజనలు చేసి, నిమజ్జనంతో ఈ వేడుకలను ముగిస్తారు. అయితే, ఈ పండుగ వేళ ఇంటిలో విగ్రహాన్ని ప్రతిష్ఠించే ముందు కొన్ని నియమాలు తెలుసుకోవడం అవసరం.
గణేష్ చతుర్థి(Vinayaka Chavithi) సందర్భంగా ఇంటిలో విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు కొన్ని నియమాలు తప్పక పాటించాలని పండితులు చెబుతున్నారు. వినాయకుడి విగ్రహం కొనేటప్పుడు, ఆయన తొండం కుడివైపునకు తిరిగి ఉన్నదే తీసుకోవాలి. ఇది శుభప్రదంగా భావిస్తారు.
గణపయ్య ఎలుక వాహనంపై కూర్చొని ఉన్న విగ్రహాలను మాత్రమే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. కూర్చున్న భంగిమ స్థిరత్వాన్ని, ప్రశాంతతను సూచిస్తుంది.

వినాయకుడు నిలబడి ఉన్న లేదా నాట్యం చేస్తున్నట్లు ఉన్న విగ్రహాలు ఇంట్లో పూజకు తగినవి కాదని పండితులు చెబుతున్నారు. ఎప్పుడూ కూడా దెబ్బతిన్న (డ్యామేజ్ అయిన) విగ్రహాన్ని కొనుగోలు చేయకూడదు, ఇది అశుభం అని అంటున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించిన తర్వాత, పూజించే సమయంలో ..మొత్తంగా పూజ జరిగే రోజుల్లో ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి.ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా పూజ చేసి గణపయ్యకు నైవేద్యం సమర్పించాలి. ఉండ్రాళ్లు, కుడుములు, గరిక, పండ్లు, పానకం వంటివి గణపయ్యకు ఇష్టమైన నైవేద్యాలు అంటారు పండితులు.

గణపతి ఇంట్లో ఉన్న రోజులలో మాంసాహారం వండకూడదు.ఇంటిలో మూడు రోజులు, ఐదు రోజులు లేదా తొమ్మిది రోజుల పాటు గణపతిని ఉంచి పూజలు నిర్వహించవచ్చు.ఈ నియమాలన్నీ పాటిస్తూ వినాయకుని పూజిస్తే, ఆ విఘ్ననాయకుడి ఆశీస్సులు మీ కుటుంబానికి లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు.