Just Spiritual

Varalakshmi Vratham :ఈ ఏడాది మూడో శుక్రవారం వరలక్ష్మి పూజ ఎందుకు?

Varalakshmi Vratham :హిందూ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన మాసాల్లో శ్రావణ మాసం ఒకటి. ఈ నెలలో మహిళలు విశేష భక్తిశ్రద్ధలతో పూజలు, వ్రతాలు ఆచరిస్తారు. ఆలయాలన్నీ భక్తులతో కళకళలాడుతూ ఆధ్యాత్మిక శోభతో నిండిపోతాయి.

Varalakshmi Vratham :పవిత్ర శ్రావణ మాసంలో చేసే వరలక్ష్మీ వ్రతం(Varalakshmi Vratham) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరిస్తే సంపద, శాంతి, శుభాలు కలుగుతాయని స్త్రీల ప్రగాఢ విశ్వాసం. మరి ఈ ఏడాది శ్రావణ మాసం ఎప్పటి నుంచి మొదలవుతుంది? వరలక్ష్మీ వ్రతం ఏ రోజున చేసుకోవాలి? ఎన్ని శుభకరమైన శుక్రవారాలు, మంగళవారాలు ఈసారి వచ్చాయి? వంటి వివరాలను ఇప్పుడు చూద్దాం.

Varalakshmi Vratham

ఈ సంవత్సరం శ్రావణ మాసం జులై 25, 2025 (శుక్రవారం) నుంచి ప్రారంభమయ్యింది. మొదటి రోజే శుక్రవారంతో ఈ పవిత్ర మాసం మొదలవడం విశేషం. ఆగస్టు 22, 2025న శ్రావణ మాసం ముగుస్తుంది. ఈసారి మొత్తం ఐదు శ్రావణ శుక్రవారాలు రావడం భక్తులకు మరింత ఆనందాన్ని కలిగిస్తోంది.

శ్రావణ శుక్రవారాలు 2025:
మొదటి శుక్రవారం :జులై 25, 2025
రెండో శుక్రవారం: ఆగస్టు 1, 2025
మూడో శుక్రవారం: ఆగస్టు 8, 2025
నాలుగో శుక్రవారం: ఆగస్టు 15, 2025
ఐదో శుక్రవారం: ఆగస్టు 22, 2025

ఈ శుక్రవారాల్లో ప్రతి వారం ప్రత్యేకమైనదే అయినప్పటికీ, వరలక్ష్మీ వ్రతం జరుపుకునే రోజు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటుంది.2025లో వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 8న వస్తోంది. ఇది శ్రావణ మాసంలో మూడవ శుక్రవారం. సాధారణంగా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహిస్తారు. అయితే, ఈ ఏడాది తిథులు, నక్షత్రాల అనుకూలతలను బట్టి, పండితులు మూడో శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతం జరుపుకోమని సూచిస్తున్నారు. ప్రతీ ఏడాదిలా రెండో శుక్రవారం కాకుండా మూడో శుక్రవారం రావడం ఈ ఏడాది ప్రత్యేకత.

శ్రావణ మాసం(Shravana Masam)లో వరలక్ష్మీ వ్రతంతో పాటు, మంగళవారం రోజున జరుపుకునే మంగళ గౌరీ వ్రతం(Mangala Gowri Vratham) కూడా ఎంతో పవిత్రమైనదిగా పండితులు వివరిస్తారు. ఈ వ్రతం మహిళలకు సౌభాగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. 2025 శ్రావణ మాసంలో ఐదు మంగళవారాలు కూడా వచ్చాయి. ఇలా ఐదు శుక్రవారాలు, ఐదు మంగళవారాలు ఒకే మాసంలో రావడం చాలా అరుదైన, శుభప్రదమైన సంఘటనగా పరిగణిస్తారు.

ఈ పవిత్ర మాసంలో లక్ష్మీదేవిని, గౌరీదేవిని పూజించడం వల్ల కుటుంబంలో ఐశ్వర్యం, ఆనందం, శ్రేయస్సు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఇది కేవలం వ్రతాలు, పూజలు చేసే కాలం మాత్రమే కాదు, మనసుకు ప్రశాంతతను అందించే శుభమాసంగా కూడా పరిగణించబడుతుంది. ఈ మాసంలో చంద్రునికి పూజ చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని అనేక హిందూ గ్రంథాలు పేర్కొంటున్నాయి. శ్రావణ మాసం ఆధ్యాత్మిక అనుబంధాన్ని పెంచి, జీవన ప్రశాంతతకు మార్గం సుగమం చేస్తుంది.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button