Asia Cup: మొన్న ఓవరాక్షన్.. ఇప్పుడు క్షమాపణ నఖ్వీకి చిప్ దొబ్బినట్టుంది
Asia Cup: మోసిన్ నఖ్వీ క్షమాపణలతో బీసీసీఐ, భారత క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత్ తో పెట్టుకుంటే ఎవరికైనా ఇలాంటి రియాక్షనే ఉంటుందంటూ హెచ్చరిస్తున్నారు.

Asia Cup
ఆసియాకప్(Asia Cup) ముగిసి నాలుగు రోజులవుతున్నా ట్రోఫీ వివాదం మాత్రం కొనసాగుతోనూ ఉంది. ముఖ్యంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్, ఏసీసీ ప్రెసిడెంట్ మోసిన్ నఖ్వీ ఈ వివాదానికి కారణమయ్యాడు. బీసీసీఐ సంగతి తెలిసో… మరి ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాడో తెలీదు కానీ ఆసియాకప్(Asia Cup) ఫైనల్ ముగిసినప్పటి నుంచి ఓవరాక్షన్ చేస్తున్నాడు.
అతను పీసీబీ ఛైర్మన్ గానూ, పాకిస్థాన్ మంత్రిగానూ కూడా వ్యవహరిస్తుండగా.. నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకునేది లేదని భారత జట్టు ముందే క్లారిటీగా చెప్పింది. కానీ తానే ట్రోఫీ ఇస్తానంటూ నానా హంగామా చేసాడు. టీమిండియా క్రికెటర్లు అతను స్టేజ్ పైన ఉండగా కనీసం అటువైపు వెళ్ళలేదు. దీంతో కోపంతో రగిలిపోయిన నఖ్వీ ట్రోఫీ తీసుకుని హోటల్ కు పారిపోయాడు. నఖ్వీ తీరుపై కేవలం బీసీసీఐ మాత్రమే కాదు ఏసీసీలో ఉన్న ఇతర దేశాల బోర్డులు కూడా ఫైర్ అయ్యాయి. అయినా కూడా వెనక్కి తగ్గకుండా మోదీ ట్వీట్ ను సైతం తప్పుపడుతూ నానా రచ్చా చేశాడు.

దీంతో మరింత సీరియస్ గా తీసుకున్న బీసీసీఐ నఖ్వీపై ఐసీసీకి ఫిర్యాదు చేసింది ట్రోఫీని ఐసీసీ ఆఫీసుకు పంపించాలని కూడా డిమాండ్ చేసింది. కానీ నఖ్వీ మాత్రం ససేమీరా అన్నాడు. అదే సమయంలో మిగిలిన దేశాల బోర్డులో నిన్న జరిగిన సమావేశంలో నఖ్వీని కడిగేసినట్టు సమాచారం. ఇంత జరుగుతున్నా కూడా ట్రోఫీ ఇచ్చేందుకు పిచ్చిపిచ్చి కండీషన్లు పెట్టాడు.
సూర్యకుమార్ యాదవ్ ఏసీసీ ఆఫీసుకు వచ్చి ట్రోఫీ తీసుకోవాలంటూ అతను చెప్పడం, దీనిని పాకిస్థాన్ మీడియా విపరీతంగా ప్రచారం చేయడం జరిగాయి. బీసీసీఐకు ఉన్న పరపతి అర్థం చేసుకున్న నఖ్వీ ఎట్టకేలకు వెనకడుగు వేశాడు. తన ప్రవర్తనపై బీసీసీఐకి క్షమాపణలు చెప్పాడు. కానీ ట్రోఫీ అందించే విషయంలో మాత్రం ఇంకా రాద్ధాంతం కంటిన్యూ చేస్తున్నాడు. సూర్యకుమార్ ఎట్టిపరిస్థితుల్లోనూ ఏసీసీ ఆఫీసుకు రాడని, ట్రోఫీ, మెడల్స్ వెంటనే పంపించాలంటూ బీసీసీఐ సెక్రటరీ దేవజీత్ సైకియా డిమాండ్ చేశాడు.
మోసిన్ నఖ్వీ క్షమాపణలతో బీసీసీఐ, భారత క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత్ తో పెట్టుకుంటే ఎవరికైనా ఇలాంటి రియాక్షనే ఉంటుందంటూ హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఐసీసీ ఈ వివాదంలో జోక్యం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో మోనిస్ నఖ్వీని ఏసీసీ ప్రెసిడెంట్ పదవి నుంచి బయటకు పంపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ మొత్తం వివాదంలో నఖ్వీ చేసిన రచ్చను మిగిలిన దేశాల క్రికెట్ బోర్డులు కూడా తీవ్రంగా తప్పుపడుతున్నాయి.