Cricket: టీ20 మూడ్ నుంచి టెస్ట్ మోడ్ విండీస్ తో తొలి టెస్టుకు భారత్ రెడీ
Cricket: డబ్ల్యూటీసీ 2025-27 సీజన్ లో భారత్ ఆడుతున్న రెండో సిరీస్ ఇది. ఫైనల్ రేసులో నిలవాలంటే ఇక్కడ నుంచి ప్రతీ సిరీస్ కీలకమే. దీంతో సొంతగడ్డపై విండీస్ ను ఓడించి డబ్ల్యూటీసీ సైకిల్ లో బోణీ కొట్టాలని టీమిండియా భావిస్తోంది.

Cricket
దాదాపు రెండు వారాల పాటు సాగిన ఆసియాకప్(Cricket) టోర్నీ టీ ట్వంటీ ఫార్మాట్ కావడంతో ఫ్యాన్స్ బాగానే ఎంజాయ్ చేశారు. పైగా డిఫెండింగ్ ఛాంపియన్ హోాదాలో పూర్తి ఆధిపత్యం కనబరిచిన టీమిండియా ఫైనల్లో పాక్ ను చిత్తు చేసి టైటిల్ అందుకుంది. భారత జట్టు ఆసియాకప్ గెలవడం ఇది తొమ్మిదోసారి. ప్రస్తుతం ఈ టైటిల్ విన్నింగ్ మోడ్ లో ఉన్న అభిమానులు ఇక టెస్ట్ ఫార్మాట్ ను చూడబోతున్నారు. స్వదేశంలో వెస్టిండీస్ తో రెండు టెస్టుల సిరీస్ బుధవారం నుంచే మొదలుకాబోతోంది.
అహ్మదాబాద్ వేదికగా తొలి టెస్ట్ , ఢిల్లీ వేదికగా రెండో టెస్ట్ జరగనున్నాయి. ఆసియాకప్ ముగిసిన తర్వాత కేవలం ఐదురోజుల వ్యవధిలోనే ఈ సిరీస్ మొదలవుతోంది. అయితే టీ ట్వంటీ జట్టులోని నలుగురు ప్లేయర్స్ మాత్రమే టెస్ట్ ఫార్మాట్ లో ఆడుతున్నారు. కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత భారత జట్టు ఇంగ్లాండ్ పై టెస్ట్ సిరీస్(Cricket) ఆడి సమం చేసింది. తొలిసారి టెస్ట్ జట్టు పగ్గాలు అందుకున్న గిల్ తన కెప్టెన్సీతో అదరగొట్టాడు. పలువురు యువ ఆటగాళ్ళు కూడా ఇంగ్లాండ్ గడ్డపై రాణించారు.

ఇప్పుడు డబ్ల్యూటీసీ 2025-27 సీజన్ లో భారత్ ఆడుతున్న రెండో సిరీస్ ఇది. ఫైనల్ రేసులో నిలవాలంటే ఇక్కడ నుంచి ప్రతీ సిరీస్ కీలకమే. దీంతో సొంతగడ్డపై విండీస్ ను ఓడించి డబ్ల్యూటీసీ సైకిల్ లో బోణీ కొట్టాలని టీమిండియా భావిస్తోంది. ఇటీవల ప్రకటించిన జట్టులో పెద్దగా మార్పులేమీ చోటు చేసుకోలేదు. కేవలం ఇంగ్లాండ్ టూర్ లో ఫెయిలైన కరుణ్ నాయర్ ను తప్పించి పడిక్కల్ ను ఎంపిక చేశారు. పంత్ గాయంతో దూరమవడంతో ధృవ్ జురెల్ మెయిన్ వికెట్ కీపర్ గా ఎంపికయ్యాడు.
అటు జగదీశన్ బ్యాకప్ వికెట్ కీపర్ గా చోటు దక్కించుకున్నాడు. అయితే బౌలింగ్ కాంబినేషన్ లో మాత్రం బుమ్రాకు రెస్ట్ ఇస్తారని భావించారు. కానీ విండీస్ తో సిరీస్ ను ఖచ్చితంగా గెలవాల్సిందే అన్న కారణంతో బుమ్రాను కంటిన్యూ చేశారు. అతనితో పాటు సిరాజ్ , ప్రసిద్ధ కృష్ణను సెలక్ట్ చేశారు.

ఇక స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జడేజా, వాషింగ్టన్ సుందర్ లకు చోటు దక్కింది. తుది జట్టులో ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లు ఉండబోతున్నారు. ఆసియాకప్ లో ఆడిన అక్షర్ పటేల్ కు తొలి టెస్టులో రెస్ట్ ఇవ్వొచ్చు. మరోవైపు వెస్టిండీస్ జట్టు సీనియర్, యువ ఆటగాళ్ళతో కలిసి బరిలోకి దిగుతోంది. రోస్టన్ ఛేజ్ సారథ్యంలోని విండీస్ ను వరుస గాయాలు వెంటాడుతున్నాయి. మరి స్వదేశంలో భారత్ కు కరేబియన్ టీమ్ ఎంతవరకూ పోటీనిస్తుందనేది చూడాలి.
One Comment