Just SportsLatest News

WPL : సోఫీ డివైన్ ఆల్ రౌండ్ షో…మళ్లీ ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్

WPL : డబ్ల్యూపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది

WPL

వుమన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)మ్యాచ్ లు ఉత్కంఠతో ఊపేస్తున్నాయి. పురుషుల ఐపీఎల్ కు ఏమాత్రం తగ్గకుండా మహిళా బ్యాటర్లు దుమ్మురేపేస్తున్నారు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ , గుజరాత్ జెయింట్స్ మ్యాచ్ లో పరుగుల వరద పారింది. మొదట సోఫీ డివైన్ , తర్వాత లిజెల్లీ లీ, లారా వోల్వార్ట్ భారీ సిక్సర్లు, బౌండరీలతో రెచ్చిపోయారు.

మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా వీరి బ్యాటింగ్ మాత్రం అభిమానులను ఉర్రూతలూగించింది. ఇదిలా ఉంటే డబ్ల్యూపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. గుజరాత్ జెయింట్స్ తో ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఢిల్లీ 4 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్ లో సోఫీ డివైన్ ఇన్నింగ్సే హైలెట్. ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించిన ఈ కివీస్ బ్యాటర్ బౌండరీలు, సిక్సర్లతో స్టేడియాన్న హోరెత్తించింది.

కేవలం 42 బంతుల్లోనే 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 95 పరుగులు చేసింది. స్నేహా రాణా వేసిన ఓ ఓవర్లో ఏకంగా 32 రన్స్ చేసింది. ఆరో ఓవర్లో చుక్కలు చూపించింది. తొలి రెండు బంతులకు 2 ఫోర్లు కొట్టిన సోఫీ డిజైన్ తర్వాత వరుసగా నాలుగు సిక్సర్లు బాదింది. దీంతో కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించింది. ఆమె బ్యాటింగ్ కు స్నేహారాణా డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ గా చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. ఆమెతో పాటు ఆష్లే గార్డనర్ కూడా 49 పరుగులతో రాణించింది. దీంతో గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 209 పరుగులు చేసింది.

WPL
WPL

భారీ లక్ష్యఛేదనలో ఢిల్లీ కూడా దూకుడుగానే ఆడింది. ఓపెనర్ లిజెల్లీ లీ విధ్వంసకర బ్యాటింగ్ తో రెచ్చిపోయింది. షెఫాలీతో కలిసి 41 , వోల్వార్ట్ తో కలిసి 90 పరుగులు జోడించింది. లిజెల్లీ లీ 54 బంతుల్లోనే 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 86 పరుగులు చేసింది. ,
ఆమె ఔటైన తర్వాత వోల్వార్ట్ మెరుపు బ్యాటింగ్ తో ఢిల్లీని విజయానికి చేరువ చేసింది.

వోల్వార్ట్ దంచికొట్టడంతో 210 పరుగుల భారీ టార్గెట్ ను ఛేజ్ చేసేలా కనిపించింది. అయితే సోఫీ డివైన్ చివరి ఓవర్ ను అద్భుతంగా బౌలింగ్ చేసి గుజరాత్ ను గెలిపించింది. చివరి ఓవర్లో విజయం కోసం 7 పరుగులు చేయాల్సి ఉండగా.. సోఫీ డివైన్ కేవలం 2 పరుగులే ఇచ్చి జెమీమా, వోల్వార్ట్ లను ఔట్ చేసింది. గజురాత్ కు ఇది వరుసగా రెండో విజయం.

Dream:మీ కలలకు మీరే బాస్..అవును మీ డ్రీమ్‌ను మీరు డిసైడ్ చేయొచ్చట..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button