Just SportsLatest News

ICCI : వేదిక మార్చడం కుదరదు..బంగ్లా బోర్డుకు ఐసీసీ షాక్

ICCI:టీ20 ప్రపంచకప్ లో తాము ఆడే మ్యాచ్ ల వేదికలను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలంటూ బీసీబీ చేసిన విజ్ఞప్తిని ఐసీసీ తిరస్కరించింది

ICCI

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ (ICCI) షాకిచ్చింది. టీ20 ప్రపంచకప్ లో తాము ఆడే మ్యాచ్ ల వేదికలను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలంటూ బీసీబీ (bCCI) చేసిన విజ్ఞప్తిని ఐసీసీ తిరస్కరించింది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న హత్యాకాండకు నిరసనగా ఐపీఎల్ (IPL) నుంచి ముస్తఫిజుర్ రహమాన్ ను తప్పించారు. మినీ వేలంలో ముస్తఫిజుర్ ను కోల్ కత్తా నైట్ రైడర్స్ రూ.9.2 కోట్లు పెట్టి కొనుగోలు చేయగా.. బీసీసీఐ ఆదేశాలతో రిలీజ్ చేసింది. ఇక్కడ నుంచి వివాదం మొదలైంది. బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రతీకార చర్యలు మొదలుపెట్టింది.

దీనిలో భాగంగా టీ20 ప్రపంచకప్ ఆడేందుకు తాము భారత్ కు రాలేమని ప్రకటించింది. తమ మ్యాచ్ ల వేదికలు మార్చాలని కోరుతూ ఐసీసీకి (ICCI) లేఖ రాసింది. నిజానికి బంగ్లా క్రికెట్ బోర్డు కంటే ఆ దేశ ప్రభుత్వమే ఈ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించింది. బంగ్లా ప్రభుత్వ సలహాదారు సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేశారు. అంతేకాకుండా వెంటనే ఐసీసీకి లేఖ రాయాలని బీసీబీని ఆదేశించడం , బంగ్లాలో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధించారు. దీంతో రంగంలోకి దిగిన ఐసీసీ వేదికలను మార్చే విషయంలో చర్చించింది.

icci
icciఇప్పటికే షెడ్యూల్ ఖరారవడం, టోర్నీ ఆరంభానికి నెలరోజుల సమయం కూడా లేకపోవడంతో షెడ్యూల్ మార్చడం కుదరదని బీసీసీఐ(bcci) స్పష్టం చేసింది. లాజిస్టిక్స్ పరంగా చాలా సమస్యలు వస్తాయని, ఇతర జట్ల విమాన టికెట్లు, హోటల్ బస వంటివి ఇప్పటికే బుక్ చేసినట్టు కూడా తెలిపింది. కేవలం బంగ్లాదేశ్ ను దృష్టిలో పెట్టుకుని షెడ్యూల్ మార్చడం కుదరదని, ఇతర జట్ల గురించి కూడా ఆలోచించాలని ఐసీసీకి (ICCI) సూచించింది. ప్రస్తుతం ఐసీసీ ఛైర్మన్ గా ఉన్న జైషా ఈ వివాదాన్ని ఇబ్బందులు లేకుండా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. బంగ్లా క్రికెట్ బోర్డు లేఖపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి చర్చించిన తర్వాత షెడ్యూల్ మార్చడం క్లిష్టమైన పనిగా తేల్చేశారు. ఇదే విషయాన్ని బీసీబీకి కూడా చెప్పేశారు.

భద్రతా పరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని హామీ ఇచ్చారు. ప్రపంచకప్ ఆడే ప్రతీ దేశ ఆటగాళ్ల భద్రతకు పూర్తిబాధ్యత ఐసీసీ,(ICCI) ఆతిథ్య దేశం తీసుకుంటాయన్నారు. ఒకవేళ భారత్ కు రాకుంటే పాయింట్లు కోల్పోవాల్సి ఉంటుందని కూడా జైషా బీసీబీని హెచ్చరించినట్టు సమాచారం. దీంతో వెనక్కి తగ్గిన బంగ్లా క్రికెట్ బోర్డు తమ నిర్ణయాన్ని చెప్పేందుకు సమయం కావాలని కోరింది. తమ ప్రభుత్వంతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button