Just SportsLatest News

IND vs SA: చేతులెత్తేసిన భారత బౌలర్లు..  సౌతాఫ్రికా భారీస్కోరు

IND vs SA: తొలిరోజు కీలక బ్యాటర్లను త్వరగానే పెవిలియన్ కు పంపిన భారత బౌలర్లు రెండోరోజు మాత్రం చేతులెత్తేశారు.

IND vs SA

రెండో టెస్టులో సౌతాఫ్రికా(IND vs SA)ను తక్కువ స్కోరుకే కట్టడి చేద్దామనుకున్న భారత ఆశలు నెరవేరలేదు. బౌలర్లు రెండోరోజు చేతులెత్తేయడంతో సఫారీలు తొలి ఇన్నింగ్స్ భారీస్కోర్ చేశారు. ప్రధాన బ్యాటర్లు విఫలమైన చోట సఫారీ టెయిలెండర్లు అద్భుత బ్యాటింగ్ తో అదరగొట్టారు. ముత్తుసామి సెంచరీ సాధిస్తే… మార్కో జెన్సన్ సెంచరీకి చేరువలో ఔటయ్యాడు. ఫలితంగా భారీస్కోర్ చేసిన సఫారీలు మెరుగైన స్థితిలో నిలిచారు. బౌలింగ్లో తేలిపోయిన భారత్ ఇప్పుడు బ్యాటింగ్లో అద్భుతంగా ఆడితే తప్ప ఈ మ్యాచ్ లో గెలవడం కష్టమే.

టీమిండియా(IND vs SA) బౌలర్ల ఫ్లాప్ పోతో రెండోరోజు సౌతాఫ్రికా పూర్తి ఆధిపత్యం కనబరిచింది. ఆరుగురు బ్యాటర్లు కలిపి 247 రన్స్ చేస్తే.. రెండోరోజు టెయిలెండర్లు చెలరేగి సౌతాఫ్రికాకు భారీస్కోర్ అందించారు. తొలిరోజు కీలక బ్యాటర్లను త్వరగానే పెవిలియన్ కు పంపిన భారత బౌలర్లు రెండోరోజు మాత్రం చేతులెత్తేశారు. ఫలితంగా ముత్తుసామి, మార్కో జెన్సన్ కీలక ఇన్నింగ్స్ తో ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా సేఫ్ జోన్ లో నిలిచింది.

నిజానికి రెండోరోజు తొలి సెషన్లోనే సౌతాఫ్రికా(IND vs SA)ను భారత్ ఆలౌట్ చేస్తుందని చాలా మంది భావించారు. టెయిలెండర్లు ఎంత సేపు నిలబడతారులే అనుకున్నారు. అయితే పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుండడంతో ముత్తుసామి ఏడు, ఎనిమిది వికెట్లకు కీలక భాగసామ్యాలు నెలకొల్పాడు. మొదట వెరెన్నేతో కలిసి 88 రన్స్, తర్వాత మార్కో జెన్సన్ తో కలిసి 97 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యాలే సౌతాఫ్రికా భారీస్కోరుకు కారణమయ్యాయి.

IND vs SA
IND vs SA

ముఖ్యంగా రెండోరోజు ఆటలో ముత్తుసామి బ్యాటింగే హైలెట్. ఏడో స్థానంలో క్రీజులోకి వచ్చిన ఈ బౌలింగ్ అల్ రౌండర్ అసలు సిసలు టెస్ట్ బ్యాటింగ్ భారత బౌలర్లను విసిగించాడు. వెరెన్నే, జెన్సన్ కలికి జట్టు స్కోరును 400 పరుగులు దాటించాడు. ఈ క్రమంలో తన తొలి టెస్ట్ శతకాన్ని కూడా పూర్తి చేసుకున్నాడు. ఇక తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన మార్కో జెన్సన్ అయితే దూకుడుగా ఆడుతూ భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు.

ముఖ్యంగా స్పిన్నర్ల బౌలింగ్ లో భారీ సిక్సర్లు బాదాడు. ముత్తుసామి 109 రన్స్ కు ఔటైన తర్వాత చివరి రెండు వికెట్లకు 50కి పైగా పరుగులు జోడించిన ఘనత జెన్సన్ దే. శలో అతను కూడా సెంచరీ చేసేలా కనిపించాడు. చివరికి జెన్సన్ 93 రన్స్ దగ్గర ఆఖరి వికెట్ గా వెనుదిరిగాడు. దీంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 489 పరుగుల దగ్గర తెరపడింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4, జడేజా 2, సిరాజ్ 2, బుమ్రా 2 వికెట్లు తీశారు. తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ వెలుతురు లేమితో ఆటను నిలిపివేసే సమయానికి వికెట్ నష్టపోకుండా 9 పరుగులు చేసింది.

Cybercriminals: హైకోర్టును వదల్లేదు, సీఎంవోనూ వదల్లేదు..సవాల్ విసురుతున్న సైబర్ నేరగాళ్లు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button