Just SportsLatest News

T20 rankings: అన్నింటా మనోళ్లే నెంబర్ వన్..టీ20 ర్యాంకింగ్స్ స్పీప్ చేసిన భారత్

T20 rankings:టీ ట్వంటీ ఫార్మాట్ లో మరే విదేశీ ప్లేయర్ కు అవకాశమివ్వకుండా అన్ని కేటగిరీల్లోనూ అగ్రస్థానాలను కైవసం చేసుకున్నారు.

T20 rankings

వరల్డ్ క్రికెట్ లో టీమిండియా డామినేషన్ ఏంటనేది మరోసారి రుజువైంది. ఐసీసీ ర్యాంకింగ్స్ లో భారత క్రికెటర్లు దుమ్మురేపారు. ముఖ్యంగా టీ ట్వంటీ (T20 rankings)ఫార్మాట్ లో మరే విదేశీ ప్లేయర్ కు అవకాశమివ్వకుండా అన్ని కేటగిరీల్లోనూ అగ్రస్థానాలను కైవసం చేసుకున్నారు. పొట్టి ఫార్మాట్ లో టీమ్ ర్యాంకింగ్స్ తో పాటు బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండర్ విభాగాల్లో మనోళ్లే టాప్‌లో నిలిచారు. మొన్నటి వరకూ బ్యాటింగ్ లో అభిషేక్ శర్మ, ఆల్ రౌండర్ జాబితాలో హార్థిక్ పాండ్యా నెంబర్ వన్ గా నిలిస్తే… ఇప్పుడు బౌలింగ్ ర్యాంకింగ్స్ లో వరుణ్ చక్రవర్తి నెంబర్ వన్ అయ్యాడు.

తాజాగా విడుదలైన టీ 20 ర్యాంకింగ్స్ (T20 rankings) లో వరుణ్ చక్రవర్తి టాప్ బౌలర్ గా నిలిచాడు. గ‌తంలో నాలుగో స్థానంలో ఉన్న వరుణ్ లేటెస్ట్ లిస్టులో మూడు స్థానాలు ఎగ‌బాకి అగ్ర‌స్థానానికి దూసుకొచ్చాడు. దీంతో పొట్టి ఫార్మాట్ లో అగ్రస్థానం సాధించిన మూడో భారత బౌలర్ గా రికార్డులకెక్కాడు. గ‌తంలో పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్నర్ ర‌వి బిష్ణోయ్‌లు ఈ ఫీట్ సాధించిన వారిలో ఉన్నారు. కాగా ఆసియాకప్ లో అదరగొడుతున్న కుల్దీప్ యాద‌వ్ ఏకంగా 16 స్థానాలు దూసుకొచ్చి 23వ ర్యాంకులో నిలిచాడు.

T20 rankings
T20 rankings

బౌలింగ్ విభాగంలో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి 733 రేటింగ్ పాయింట్లుతో అగ్రస్థానంలో ఉండగా…జాక‌బ్ డ‌ఫీ , అకిల్ హుసేన్ , ఆడ‌మ్ జంపా, ఆదిల్ ర‌షీద్ టాప్ ఫైవ్ లో చోటు దక్కించుకున్నారు. టాప్ టెన్ లో మరే భారత బౌలర్ కు చోటు దక్కలేదు. అక్షర్ పటేల్ 12వ స్థానంలో ఉండగా… అర్షదీప్ సింగ్ 14వ ర్యాంకులో నిలిచాడు. మరోవైపు బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో అభిషేక్ శ‌ర్మ‌ నెంబర్ వన్ గా కొనసాగుతున్నాడు.

అలాగే ఆల్‌రౌండ‌ర్ కేటగిరీలో హార్దిక్ పాండ్యా టాప్ లో కంటిన్యూ అవుతున్నాడు. హైదరాబాదీ బ్యాటర్ తిల‌క్ వ‌ర్మ నాలుగో ర్యాంకులో ఉండగా.. ఆసియాకప్ లో పాక్ జట్టుపై కీలక ఇన్నింగ్స్ ఆడిన సూర్య‌కుమార్ యాద‌వ్ ఏడో స్థానానికి ప‌డిపోయాడు. ఇదిలా ఉంటే వన్డే ర్యాంకింగ్స్ లో శుభమన్ గిల్ అగ్రస్థానంలో ఉండగా… రోహిత్ శర్మ రెండో స్థానంలోనూ, విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలోనూ కొనసాగుతున్నారు. శ్రేయాస్ 8వ ర్యాంకులో ఉండగా.. టాప్ టెన్ లో మొత్తం నలుగురు భారత బ్యాటర్లు చోటు దక్కించుకున్నారు.

బౌలింగ్ విభాగంలో మాత్రం భారత్ నుంచి కుల్దీప్ యాదవ్ నాలుగో ర్యాంకులోనూ, రవీంద్ర జడేజా పదో ర్యాంకులోనూ నిలిచారు. అటు టెస్ట్ ఫార్మాట్ కు సంబంధించి బ్యాటింగ్ లో ఇద్దరు మాత్రమే టాప్ టెన్ లో కంటిన్యూ అవుతున్నారు. జైశ్వాల్ ఐదో స్థానంలోనూ, రిషబ్ పంత్ ఎనిమిదో ర్యాంకులోనూ ఉన్నారు. బౌలింగ్ ర్యాంకింగ్స్ లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా టాప్ ప్లేస్ లో కొనసాగుతుండగా… మహ్మద్ సిరాజ్ 15వ ర్యాంకులోనూ, రవీంద్ర జడేజా 17వ స్థానంలోనూ ఉన్నారు. కాగా టీమ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే టీ ట్వంటీ, వన్డేల్లో నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్న టీమిండియా టెస్ట్ ఫార్మాట్ లో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button