India vs South Africa: ఆరంభం అదుర్స్.. తొలి వన్డేలో భారత్ విక్టరీ
India vs South Africa: సౌతాఫ్రికాతో రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డేలో 17 రన్స్ తేడాతో విజయం సాధించింది.
India vs South Africa
వైట్ వాష్ పరాభవానికి రివేంజ్ తీర్చుకోవాలని పట్టుదలగా ఉన్న టీమిండియా వన్డే సిరీస్ లో దానికి తగ్గట్టే తొలి అడుగు వేసింది. సౌతాఫ్రికాతో రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డేలో 17 రన్స్ తేడాతో విజయం సాధించింది. భారీస్కోర్లు నమోదైన ఈ మ్యాచ్( India vs South Africa) లో విరాట్ కోహ్లీ సెంచరీ హైలెట్ గా నిలిచింది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ తుది జట్టులో అనూహ్య మార్పులు జరిగాయి. పంత్ తో పాటు నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కలేదు. తిలక్ వర్మను సైతం పక్కన పెట్టారు. నాలుగో స్థానం కోసం రుతురాజ్ గైక్వాడ్ కు అవకాశనిచ్చారు. ముగ్గురు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్ల కాంబినేషన్ తో భారత్ బరిలోకి దిగింది.
గిల్ లేకపోవడంతో ఓపెనర్ గా అవకాశం దక్కించుకున్న జైస్వాల్ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. భారీ సిక్సర్ కొట్టి ఊపు మీదున్నట్టు కనిపించిన జైస్వాల్ 18 పరుగులకే ఔటయ్యాడు. తర్వాత రోకో జోడీ దుమ్మురేపింది. సఫారీ బౌలర్లను ఓ ఆటాడుకుంది. ఆసీస్ గడ్డపై ఫామ్ ను కంటిన్యూ చేస్తూ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భారీ షాట్లతో అలరించారు. వీరిద్దరి జోరుతో భారత్ రన్ రేట్ 6.5కు పైగా సాగింది.
భారీ షాట్లతో విరుచుకుపడ్డ రోహిత్ అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు అందుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకోగా.. రెండో వికెట్ కు 136 పరుగులు జోడించారు. రోహిత్ 57 రన్స్ కు ఔటవగా… రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్ నిరాశపరిచారు. ఈ దశలో కేఎల్ రాహుల్ తో కలిసి కోహ్లీ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఐదో వికెట్ కు వీరిద్దరూ 76 పరుగులు జోడించారు.

ఈ క్రమంలో కోహ్లీ 103 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు. వన్డేల్ల విరాట్ కు ఇది 52వ శతకం. అలాగే అంతర్జాతీయ క్రికెట్ లో 83వ సెంచరీ. దీంతో వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. కోహ్లీ 135 పరుగులకు ఔటవగా.. రాహుల్ 60 , జడేజా 32 రన్స్ చేశారు. దీంతో భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 349 పరుగుల భారీస్కోర్ సాధించింది.
ఛేజింగ్ లో సౌతాఫ్రికాను భారత బౌలర్లు ఆరంభం నుంచే దెబ్బకొట్టారు.అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా సఫారీ టాపార్డర్ ను త్వరగానే పెవిలియన్ కు పంపించారు. రికెల్టన్, డికాక్ లను డకౌట్ గా వెనక్కి పంపారు. మార్క్ క్రమ్ ను కూడా సింగిల్ డిజిట్ కే ఔట్ చేశారు. దీంతో సౌతాఫ్రికా 77 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అయితే బ్రీక్జే , మార్కో యెన్సన్ మెరుపులు మెరిపించడంతో సౌతాఫ్రికా రన్ రేట్ భారత్ కు ధీటుగానే సాగింది. ముఖ్యంగా యెన్సన్ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. యెన్సన్ కేవలం 39 బంతుల్లోనే 70 పరుగులు చేయగా.. బ్రీక్జే 72 రన్స్ చేశాడు. చివర్లో సఫారీ టెయిలెండర్లు కూడా పోరాడడంతో మ్యాచ్( India vs South Africa) ఆఖరి వరకూ వెళ్ళింది. బోస్చ్ చివర్లో వరుస సిక్సర్లు బాదుతూ భారత్ ను కంగారెత్తించాడు. చివరి ఓవర్లో విజయం కోసం 18 రన్స్ చేయాల్సి ఉండగా.. ప్రసిద్ధ కృష్ణ బోస్చ్ ను ఔట్ చేయడంతో సౌతాఫ్రికా 332 పరుగులకు ఆలౌటైంది. కుల్దీప్ యాదవ్ కీలక సమయంలో వికెట్లు తీయడం కలిసొచ్చింది. హర్షిత్ రాణా 3, కుల్దీప్ 4 వికెట్లతో రాణించారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే బుధవారం రాయ్ పూర్ లో జరుగుతుంది.




🔥 Absolutely loving this trend! ❤️ The way people are exploring real happiness, confidence and intimate connection is just amazing 💫 If anyone is looking for genuine companionship and good vibes, you should definitely check this 👉 https://www.westdelhiescorts.com/ 💕 Trust me, the experience will be totally unforgettable 😍