Just SportsLatest News

T20: ధర్మశాలలో దుమ్మురేపారు..  మూడో టీ20లో భారత్ ఘనవిజయం

T20: ఈ మ్యాచ్ లో పాండ్యా అరుదైన రికార్డు అందుకున్నాడు. టీ ట్వంటీల్లో 100 వికెట్లు పూర్తి చేసుకున్న మూడో భారత బౌలర్ గా నిలిచాడు.

T20

రెండో టీ20(T20)లో బ్యాటింగ్ వైఫల్యంతో పరాజయం పాలైన టీమిండియా ధర్మశాలలో దెబ్బకు దెబ్బ కొట్టింది. గత మ్యాచ్ లో ఓటమో.. మరే కారణం వల్లనో తెలీదు కానీ మూడో టీ ట్వంటీకి భారత తుది జట్టులో మార్పులు జరిగాయి. స్టార్ పేసర్ బుమ్రా, అక్షర్ పటేల్ స్థానాల్లో హర్షిత్ రాణా, కుల్దీప్ యాడవ్ ఫైనల్ ఎలెవెన్లో వచ్చారు. టాస్ గెలిచిన సూర్యకుమార్ మరో మాట లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు.

రెండో ట్వంటీ(T20)లో భారీస్కోర్ చేసిన సౌతాఫ్రికా ఈ మ్యాచ్లో మాత్రం చేతులెత్తేసింది. భారత పేసర్లు ఆరంభం నుంచే నిప్పులు చెరిగారు. హోంగ్రౌండ్లో భారీగా పరుగులు ఇచ్చి విమర్శలు ఎదుర్కొన్న అర్షదీప్ , హర్షిత్ రాణా ఆరంభంలోనే సఫారీలను దెబ్బకొట్టారు. కేవలం 7 పరుగులకే సౌతాఫ్రికా జట్టులోని ముగ్గురు కీలక ఆటగాళ్లను పెవిలియన్ కు పంపించారు.

అయితే కెప్టెన్ మార్క్ రమ్ ఒంటరి పోరాటం చేశాడు. అటు హార్దిక్ పాండ్యా, దూబే కూడా కీలక వికెట్లు తీశారు. దీంతో సౌతాఫ్రికా కోలుకోలేకపోయింది. మార్క్ రమ్ పోరాడుతున్నా మిగిలిన బ్యాటర్లను భారత స్పిన్నర్లు క్రీజులో నిలదొక్కుకునే అవకాశం ఇవ్వలేదు. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి మ్యాజిక్ చేయడంతో సౌతాఫ్రికా తక్కువ స్కోరుకే పరిమితమైంది.

T20
T20

మార్క్రమ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడకుంటే కనీసం వంద కూడా డాటేది కాదు. నఫారీ ఇన్నింగ్స్ లో ఏడుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే వెనుదిరిగారు. చివరికి సౌతాఫ్రికా 20 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో అర్షదీప్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాడవ్ రెండేసి వికెట్లు తీశారు.

తర్వాత 118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ కు ఈ సారి ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభమన్ గిల్ మెరుపు ఆరంభాన్నిచ్చారు. అభిషేక్ ఇన్నింగ్స్ తొలి బంతినే భారీ సిక్సర్ బాదాడు. వీరిద్దరూ తొలి వికెట్ కు 5.2 ఓవర్లలోనే 60 పరుగులు జోడించారు.

ఎప్పటిలానే దూకుడుగా ఆడిన అభిషేక్ 18 బంతుల్లోనే 35 (3 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు ఔటవగా.. గిల్, తిలక్ వర్మ ఇన్నింగ్స్ కొనసాగించారు. ముఖ్యంగా టీ20(T20) క్రికెట్లో పేలవ ఫామ్ తో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న గిల్ ఎట్టకేలకు టచ్ లోకి వచ్చాడు. . తిలక్ వర్మతో కలిసి 32 పరుగులు జోడించాడు. గిల్ ఔటైనప్పటకీ.. అప్పటికే భారత్ విజయానికి చేరువైంది. తిలక్ వర్మ, శివమ్ దూబే జట్టు విజయాన్ని పూర్తి చేశారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్ లో భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది.

కాగా ఈ మ్యాచ్ లో పాండ్యా అరుదైన రికార్డు అందుకున్నాడు. టీ ట్వంటీల్లో 100 వికెట్లు పూర్తి చేసుకున్న మూడో భారత బౌలర్ గా నిలిచాడు. కాగా భారత్, సౌతాఫ్రికా మధ్య నాలుగో టీ ట్వంటీ లక్నో వేదికగా బుధవాడా జరుగుతుంది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button