Lionel Messi: భారత్ లో మెస్సీ ఫీవర్ షురూ.. 3 రోజుల టూర్ కు కౌంట్ డౌన్
Lionel Messi: ఈ టూర్ లో భాగంగా డిసెంబర్ 13న హైదరాబాద్ కు రానున్నాడు మెస్సీ. ఉప్పల్ స్టేడియం వేదికగా సీఎం రేవంత్ రెడ్డితో ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్ సైతం ఆడబోతున్నాడు.
Lionel Messi
మన దేశంలో క్రికెట్ కే క్రేజ్ ఎక్కువ… మిగిలిన ఏ స్పోర్ట్ తోనైనా క్రికెట్ తో పోలిస్తే ఫ్యాన్స్ తక్కువే.. కానీ ప్రపంచంలో మోస్ట్ పాపులర్ స్పోర్ట్ మాత్రం ఫుట్ బాలే… ఎందుకంటే 200 దేశాల్లో సాకర్ ను ఆడుతుంటారు. క్రికెట్ ఆడే వేరే దేశాల్లోనూ ఫుట్ బాల్ కు ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
అర్జెంటీనా, బ్రెజిల్ , ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్, నెదర్లాండ్స్.. ఇలా ఏ దేశంలో చూసినా సాకర్ క్రేజ్ మామూలుగా ఉండదు. అందుకే ఫుట్ బాల్ లో స్టార్ ప్లేయర్స్ ఆయా దేశాల నుంచే వస్తుంటారు. ఇదే కోవలోకి వస్తాడు అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం లైనోల్ మెస్సీ(Lionel Messi)… అతడి పేరు వింటే సాకర్ ప్రపంచానికి పూనకాలే. అతడి ఆట ప్రత్యక్షంగా చూడాలనుకునే వారు కోట్లలో ఉంటారు.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఇతడిని అభిమానిస్తుంటారు. అతడి ఆట అలా ఉంటుంది మరి. తన ఆటతో అందరినీ మాయ చేస్తాడు. ప్రస్తుతం ఫుట్‌బాల్ ఆడుతున్నవారే కాదు. ఆల్ టైంలో చూసినా.. ఫుట్‌బాల్ దిగ్గజాల్లో మెస్సీ (Lionel Messi)పేరు ముందువరుసలోనే ఉంటుంది. మైదానంలో చిరుతలా కదులుతూ గోల్స్ చేస్తుంటాడు. దిగ్గజాలకే దిగ్గజంగానూ పలువురు అభివర్ణిస్తుంటారు.
అరంగేట్రం నుంచే సంచలన ప్రదర్శనతో అదరగొట్టిన మెస్సీ (Lionel Messi)సాధించిన రికార్డులు.. ట్రోపీలు.. రివార్డులు చాలానే ఉన్నాయి.లియోనల్ మెస్సీ.. 1987 జూన్ 24న అర్జెంటీనా రోసారీలో జన్మించాడు. దేశ జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు ఆడుతున్నప్పటికీ.. స్పానిష్ ఫుట్‌బాల్ క్లబ్ బార్సిలోనాతోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ క్లబ్తో అతడికి విడదీయరాని అనుబంధం ఉంది.

మెస్సీ కెరీర్ ను చూస్తే నాలుగేళ్ల వయసు నుంచే ఫుట్ బాల్ లో ఓనమాలు నేర్చుకున్నాడు. తన తండ్రి నడిపే క్లబ్ లోనే ట్రైనింగ్ తీసుకున్నాడు. అయితే మెస్సీకి 11 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు.. గ్రోత్ హార్మోన్ లోపం ఉన్నట్లు గుర్తించారు. దీని చికిత్స కోసం చాలా ఖర్ఛయ్యేది.
అప్పుడు బార్సిలోనా క్లబ్ స్వయంగా ఆ ఖర్చును భరించి మెస్సీకి అండగా నిలిచింది. దీంతో బార్సిలోనా క్లబ్ కు రుణపడిన మెస్సీ సుధీర్ఖకాలం పాటు ప్రాతినిథ్యం వహించాడు. 2003లో తొలిసారి బార్సిలోనా క్లబ్ తరఫున అరంగేట్రం చేసేటప్పటికీ మెస్సీ వయసు 17 ఏళ్లు.
ఫుట్బాల్లో అత్యుత్తమ అవార్డులు బాలన్ డీ ఓర్, ఫిఫా వరల్డ్ ప్లేయర్, పిచిచీ ట్రోఫీ, గోల్డెన్ బూట్ ఒకే సీజన్ లో అందుకున్న ఏకైక ఆటగాడిగా మెస్సీ (Lionel Messi)నిలిచాడు. బాలన్ డీ ఓర్ను అవార్డును ఏకంగా ఆరుసార్లు అందుకున్న ఏకైక ఆటగాడు మెస్సీనే. బార్సిలోనాకు ఆడుతూ.. ఇప్పటివరకు 672 గోల్స్ చేసి బ్రెజిల్ దిగ్గజం పీలేను దాటేశాడు.
అర్జెంటీనాకు ప్రపంచకప్ కల నెరవేర్చిన ఘనత అతనికే దక్కుతుంది. 1978, 1986 తర్వాత ఫిఫా ప్రపంచకప్ అర్జెంటీనాకు అందని ద్రాక్షగానే ఊరించింది. అయితే 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. అంతా తానై.. అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలబెట్టాడు. ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న క్రీడాకారుల్లో మెస్సీ అందరికంటే ముందున్నాడు. కాగా మెస్సీ భారత్ టూర్ కు వస్తుండడంతో సాకర్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సెలబ్రిటీలు సైతం అతన్ని చూసేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
ఈ టూర్ లో భాగంగా డిసెంబర్ 13న హైదరాబాద్ కు రానున్నాడు మెస్సీ. ఉప్పల్ స్టేడియం వేదికగా సీఎం రేవంత్ రెడ్డితో ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్ సైతం ఆడబోతున్నాడు.మ్యాచ్ చివరి 5 నిమిషాల్లో మాత్రమే మెస్సీ, సీఎం రేవంత్ తో కలిసి గ్రౌండ్‌లోకి అడుగుపె ట్టనున్నాడు. యువ ఆటగాళ్లకు నిర్వహించే ఫుట్‌బాల్ క్లినిక్‌లోనూ పాల్గొంటాడు. ఫలక్‌నామా ప్యాలెస్‌లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికీ హాజరుకానున్న మెస్సీతో ఫోటో దిగాలనుకునే అభిమానులు 10 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.



