MS Dhoni: వచ్చే సీజన్ తో ధోనీ వీడ్కోలు.. ఫ్యూచర్ ప్లానింగ్ తో చెన్నై హింట్
MS Dhoni: ముఖ్యంగా మినీ వేలంలో చెన్నై అనుసరించిన ముందుచూపు ప్లానింగ్ తో ఈ వార్తలు మరింత బలపడ్డాయి.
MS Dhoni
చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ కు నిరాశ కలిగించే వార్త… మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ(MS Dhoni) ఐపీఎల్ కు వీడ్కోలు పలకబోతున్నాడు. వచ్చే 2026 సీజన్ ప్లేయర్ గా ధోనీకి చివరిది కానుంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాకున్నా సీఎస్కే ఫ్రాంచైజీ వర్గాలు, కోచ్ , చెన్నై మాజీ ఆటగాళ్లు ఇచ్చిన సమాచారంతో ధోనీ రిటైర్మెంట్ పై క్లారిటీ వచ్చేసింది.
ముఖ్యంగా మినీ వేలంలో చెన్నై అనుసరించిన ముందుచూపు ప్లానింగ్ తో ఈ వార్తలు మరింత బలపడ్డాయి. అన్ క్యాప్డ్ కేటగిరీలోరిటైన్ చేసుకున్నప్పటకీ వచ్చే సీజన్ లో ధోనీ ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సీజన్ మధ్యలోనే తప్పుకుని మెంటార్ గా కొత్త బాధ్యతలు తీసుకునే ఛాన్స్ కూడా లేకపోలేదు. మినీ వేలంలో సీఎస్కే వ్యవహరించిన తీరే దీనికి నిదర్శనం.
ధోనీ(MS Dhoni) రీ ప్లేస్ మెంట్ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ వేలానికి ముందు రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ ను జట్టులోకి ట్రేడింగ్ చేసుకుంది. దీని కోసం రవీంద్ర జడేజా, సామ్ కరన్ లను వదులుకుంది. సారథ్య బాధ్యతలు అప్పగించకున్నా వికెట్ల వెనుక ధోనీ సక్సెసర్ గా సంజూకే ప్రయారిటీ ఇవ్వడం ఖాయం. అందుకోసమే రూ.18 కోట్లు వెచ్చించి మరీ అతన్ని తీసుకుంది.

అలాగే ఫ్యూచర్ ను దృష్టిలో ఉంచుకుని బ్యాకప్ వికెట్ కీపర్ ను కూడా కొనుగోలు చేసింది. అనామక వికెట్ కీపర్ కార్తీక్ శర్మను కోట్లు పెట్టి తీసుకుంది. వేలంలో ఇతర ఫ్రాంచైజీలతో గట్టిగానే పోటీపడి 14.20 కోట్ల భారీ ధరకు అతన్ని దక్కించుకుంది. దేశవాళీ క్రికెటర్ కోసం సీఎస్కే ఇంత వెచ్చించడం వెనుక ప్లానింగ్ చాలానే ఉంది. ఒక్క విధంగా సంజూ శాంసన్‌తో పాటు కార్తీక్ శర్మ కోసమే చెన్నై ఏకంగా రూ.32.20 కోట్లు ఖర్చు చేసిందంటే అసలు కారణం అర్థమవుతోంది.
ధోనీ(MS Dhoni)కి ప్రత్యామ్నాయ వికెట్ కీపర్‌ను రెడీ చేయాలనే ఉద్దేశంతోనే ఈ స్థాయిలో ఖర్చు చేసిందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే 44 ఏళ్ల ధోనీ 2020లోనే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇచ్చేశాడు. అభిమానుల కోసం ఐపీఎల్ లో కొనసాగుతున్నాడు. అయితే మునుపటిలో మాత్రం మెరుపులు మెరిపించలేకపోతున్నాడు. అయినప్పటకీ ధోనీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
ధోనీ (MS Dhoni)కోసమే సీఎస్కే ఎక్కడ మ్యాచ్ లు ఆడినా స్టేడియాలన్ని పసుపుమయంగానే మారిపోతున్నాయి. వయసు మీద పడడం, ఫిట్ నెస్ ఇబ్బందులతో ఇక ప్లేయర్ గా గుడ్ బై చెప్పి, సీఎస్కేకు మెంటార్ గా మహేంద్రుడు ఉండబోతున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్ స్టార్ట్ అయ్యాక దీనిపై క్లారిటీ రానుంది.



