Just SportsLatest News

India women cricketers: ఇక మహిళా క్రికెటర్ల హవా..  భారీగా పెరిగిన బ్రాండ్ వాల్యూ

India women cricketers: అటు భారత మహిళల జట్టులో కూడా పలువురు స్టార్ ప్లేయర్స్ టాప్ బ్రాండు ్స్కు ఇటీవల కాలంలోనే ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు.

India women cricketers

ఒక్క విజయం భారత మహిళా క్రికెటర్ల(India women cricketers) క్రేజ్ ను మార్చేసింది… ఒక్క విజయం వారి బ్రాండ్ వాల్యూూను రెట్టింపు చేసింది.. ఒక్క విజయం సోషల్ మీడియాలో వారి ఫాలోయింగ్ ను ఓ రేంజ్ కు తీసుకెళ్ళింది.. ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది.. ఎవరి గురించి చెబుతున్నామో.. భారత మహిళల (India women cricketers)జట్టు క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు. ప్రపంచకప్ విజయంతో ఎక్కడ చూసినా వారి హవానే మొదలైంది. సాధారణంగా మన దేశంలో క్రికెటర్లు, సినిమా స్టార్సే చాలా కార్పొరేట్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటుంటారు.

ఎక్కువ శాతం పురుషాధిపత్యమే దీనిలో స్పష్టంగా కనిపిస్తుంటుంది. హీరోయిన్స్ ను కూడా బ్రాండ్ ప్రమోషన్స్ కోసం నియమించుకుంటున్నా క్రీడల్లో మాత్రం చాలా తక్కువ శాతమే మహిళలకు అవకాశం లభిస్తుంటుంది. కానీ సానియా మీర్జా, సైనానెహ్వాల్, పివి సింధు లాంటి స్టార్ ప్లేయర్స్ పలు చారిత్రక విజయాలు సాధించిన తర్వాత క్రమంగా బ్రాండింగ్ లోనూ మహిళా క్రీడాకారిణుల పాత్ర పెరుగుతోంది.

India women cricketers
India women cricketers

అటు భారత మహిళల జట్టులో కూడా పలువురు స్టార్ ప్లేయర్స్ టాప్ బ్రాండు ్స్కు ఇటీవల కాలంలోనే ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. అయితే పురుష క్రికెటర్లతో పోలిస్తే వీరి ఎండోర్స్మెంట్ ఫీజు తక్కువగానే ఉంటుంది. ఇప్పుడు వన్డే ప్రపంచకప్ విజయంతో ఒక్కసారిగా మహిళా క్రికెటర్ల బ్రాండ్ వాల్యూ అమాంతం పెరిగిపోయింది. దాదాపు 100 శాతం పెరిగినట్టు అంచనా వేస్తున్నారు.

సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై విజయం తర్వాత చాలా కార్పొరేట్ కంపెనీలు మన మహిళా క్రికెటర్లతో ఒప్పందాల కోసం సంప్రదించినట్టు తెలుస్తోంది. ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించిన తర్వాత వారితో ఒప్పందాల కోసం కార్పొరేట్ కంపెనీలు క్యూ కడుతున్నట్టు సమాచారం.

అంతేకాదు గతంలో చేసుకున్న ఒప్పందాలను మళ్లీ రెన్యువల్ చేసుకోవడంతో పాటు వారు అడిగినంత పారితోషకం ఇచ్చేందుకు కూడా వెనుకాడడం లేదు. నిజానికి ప్రపంచకప్ గెలిచిన కొద్ది గంటల్లోనే భారత స్టార్ క్రికెటర్ల సోషల్ మీడియా ఫాలోవర్లు ఓ రేంజ్లో పెరిగారు.

స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్, రాధికా యాదవ్ వంటి స్టార్స్క 2-3 చెట్లు ఫాలోవర్స్ అమాంతం పెరిగారు. ఇదిలా ఉంటే బ్రాండ్ వాల్యూ పెరగడంతో వారు తీసుకునే రెమ్యునరేషన్ కూడా పెరిగిపోయింది. సెమీస్ లో అసాధారణ ఇన్నింగ్స్ లతో జట్టును గెలిపించిన జెమీమా బ్రాండ్ వాల్యూ 100 శాతం పెరిగిందని తెలుస్తోంది.

ఇప్పటి వరకూ 75 లక్షలు తీసుకుంటున్న ఈ యువ క్రికెటర్ ప్రపంచకప్ విజయం తర్వాత 1.5 కోట్లతో డీల్స్ కుదుర్చుకునేందుకు రెడీ అయింది. ప్రస్తుతం మహిళల క్రికెట్లో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న ప్లేయర్ గా స్మృతి మంధాన కొనసాగుతోంది. స్మృతి బ్రాండ్కు 1.6 కోట్ల నుంచి 2 కోట్ల వరకూ తీసుకుంటోంది. ఆమె దాదాపు 16 పెద్ద బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది.

మహిళల ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన మరికొందరు యువ క్రికెటర్లతో ఒప్పందాల కోసం కార్పొరేట్ కంపెనీలు ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఒక్క విజయంతో మన మహిళా క్రికెటర్ల(India women cricketers)కు భారీ క్రేజ్ వచ్చింది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button