Just SportsLatest News

PSL: పీఎస్ఎల్ రెండు ఫ్రాంచైజీలు 115 కోట్లు.. మీ మొహానికి ఐపీఎల్ తో పోలికా ?

PSL: ఐపీఎల్ కంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ పెద్దదంటూ (PSL) పాక్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ చేసిన కామెంట్స్ చూసి యావత్ క్రికెట్ ప్రపంచం నవ్వుకుంది

PSL

పులిని చూసి నక్క వాత పెట్టుకున్న సామెత పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. ఆదాయంలో బీసీసీఐ కాలిగోటికి కూడా సరిపోని పాక్ బోర్డు బిల్డప్ మాత్రం ఓ రేంజ్ లో ఇస్తుంటుంది. తమ స్థాయి తెలిసినా కూడా బీసీసీఐపై విమర్శలు గుప్పిస్తూ నవ్వులు పాలవుతుంటుంది. గతంలో పలు సందర్భాల్లో ఐపీఎల్ కంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ పెద్దదంటూ (PSL) పాక్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ చేసిన కామెంట్స్ చూసి యావత్ క్రికెట్ ప్రపంచం నవ్వుకుంది.

ఐపీఎల్ లో పాక్ క్రికెటర్లను ఆడినవ్వడం లేదన్న అక్కసుతో వసీం అక్రమ్ ప్రతీసారీ నోరుపారేసుకుంటూ ఉంటాడు. అయితే పాక్ బోర్డు విలువ ఎంతన్నది క్రికెట్ ప్రపంచానికి తెలుసు. పీఎస్ఎల్ కూడా ఐపీఎల్ లో 1 శాతం విలువ కూడా చేయదనీ తెలుసు. తాజాగా ఈ విషయం మరోసారి రుజువైంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ కొత్త సీజన్ కు ముందు నానా హడావుడి చేస్తున్న పీసీబీ రెండు కొత్త ఫ్రాంచైజీలను తీసుకొచ్చింది.

కానీ వీటిని కొనేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో గత కొన్ని రోజులుగా నానా పాట్లూ పడుతోంది. పదే పదే బిడ్డింగ్ గడువు పొడిగించినా స్పందన మాత్రం శూన్యం. చివరికి ఎలాగోలా కొన్ని కంపెనీలు వచ్చాయని గంభీరంగా చెప్పుకున్నా వాళ్లు వేసిన బిడ్లు పాక్ బోర్డుకు షాకిచ్చాయి.

PSL
PSL

తాజాగా కొత్త ఫ్రాంచైజీల బిడ్డింగ్ ప్రక్రియలో వసీం అక్రమ్ చేతుల మీదుగానే వాటి విలువ తేటతెల్లమైంది. రెండు ఫ్రాంచైజీలు కలిపి బిడ్డింగ్ లో 115 కోట్లు పలికాయి. అదే సమయంలో ఐపీఎల్ లక్నో ఫ్రాంచైజీ బిడ్డింగ్ ధర అక్షరాలా 7,090 కోట్లు.. అంటే దీనిలో 10వ వంతు విలువ కూడా పీఎస్ఎల్ ఫ్రాంచైజీకి దక్కలేదు. అయినా సరే బిడ్డింగ్ ప్రక్రియలో వసీం అక్రమ్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఏదో వేల కోట్లకు తమ ఫ్రాంచైజీలు అమ్ముడైనంత ఓవరాక్షన్ చేశాడు. తీరా చూస్తే పదో వంతు కూడా రాలేదు. దీంతో నెటిజన్లు పాక్ క్రికెట్ బోర్డును, వసీం అక్రమ్ ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. మీ మొహాలకు ఐపీఎల్ తో పోలికా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా బీసీసీఐతో పోల్చుకోవడం మానుకోవాలని సూచిస్తున్నారు.

Linefit:ఎయిర్ ఇండియా ఫ్లీట్‌లో ఎనిమిదేళ్ల తర్వాత తొలి లైన్‌ఫిట్ విమానం..ఏంటి దీని స్పెషల్?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button