Just SportsLatest News

Shafali Verma: షెఫాలీ వర్మ ధనాధన్.. లంకపై టీ20 సిరీస్ కైవసం

Shafali Verma: శ్రీలంకపై ఐదు టీట్వంటీల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్ లు మిగిలుండగానే కైవసం చేసుకుంది.

Shafali Verma

ప్రపంచకప్ విజయం తర్వాత జరుగుతున్న తొలి సిరీస్లో భారత మహిళల జట్టు అదరగొడుతోంది. . శ్రీలంకపై ఐదు టీట్వంటీల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్ లు మిగిలుండగానే కైవసం చేసుకుంది. తిరువనంతపురం వేదికగా జరిగిన మూడో టీ20లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లోనూ టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. రేణుకా సింగ్, దీప్తి శర్మ జట్టులోకి తిరిగి రాగా.. అరుంధతి రెడ్డి, స్నేహ రాణాలకు విశ్రాంతినిచ్చారు.

లంక ఓపెనర్లలో హాసిని పెరీరా దూకుడుగా ఆడినా.. మిగిలిన బ్యాటర్లను భారత బౌలర్లు కట్టడి చేసారు. ఫలితంగా శ్రీలంక పవర్ ప్లేలోనే మూడు కీలక వికెట్లు చేజార్చుకుంది. చమరి ఆటపట్టు, సమరవిక్రమ , హాసిని పెరీరా పరుగులకు వెనుదిరిగారు.

సిల్వా కూడా త్వరగానే ఔటవగా.. దులానీ , దిల్హరి పరుగులతో ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ లంకను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో విజయవంతమయ్యారు. ఎక్కడా కూడా భారీ భాగస్వామ్యాలు నెలకొల్పే ఛాన్స్ ఇవ్వలేదు. రేణుకా సింగ్ తో పాటు దీప్తి శర్మ లంక ఇన్నింగ్స్ ను దెబ్బకొట్టారు.

Shafali Verma
Shafali Verma

చివర్లో వికెట్ కీపర్ కౌశానీ ధాటిగా ఆడడంతో స్కోరు వంద పరుగులు దాటగలిగింది. పవర్ ప్లేతో పాటు స్లాగ్ ఓవర్లలోనూ భారత బౌలర్లు పూర్తి ఆధిపత్యం కనబరిచారు. దీంతో శ్రీలంక మహిళల జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 113 పరుగులే చేయగలిగింది. భారత బౌలర్లలో రేణుకాసింగ్ 4 , దీప్తి శర్మ 3 వికెట్లు పడగొట్టారు.

ఛేజింగ్ లో భారత్ 27 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఇంకా పూర్తి ఫామ్ లోకి రాని స్మృతి మంధాన కేవలం 1 పరుగుకే వెనుదిరిగింది. తర్వాత క్రీజులోకి వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ తో కలిసి షెఫాలీ వర్మ (Shafali Verma)ధాటిగా ఆడింది. జెమీమా ఆచితూచి ఆడినా షెఫాలీ మాత్రం లంక బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడింది.

జెమీమాతో కలిసి రెండో వికెట్ కు 40 పరుగులు జోడించారు. జెమీమా(9) పరుగులకు ఔట్ అయినా.. షెఫాలీ (Shafali Verma)దూకుడు మాత్రం తగ్గలేదు. తనదైన శైలిలో రెచ్చిపోయిన షెఫాలీ వర్మ కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. అటు హర్మన్ ప్రీత్ కౌర్ కూడా ధాటిగా ఆడడంతో భారత్ కేవలం 13.2 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను అందుకుంది. షెఫాలీ వర్మ (Shafali Verma)79 నాటౌట్ ( 42 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లు) , హర్మన్ ప్రీత్ కౌర్ 21 నాటౌట్ రాణించారు. ఈ విజయంతో భారత్ సిరీస్ ను కైవసం చేసుకుని 3-0 ఆధిక్యంలో నిలిచింది. శ్రీలంక మహిళల జట్టుపై భారత్‌కు ఇది వరుసగా నాలుగో టీ20 సిరీస్ విజయం. భారత బౌలింగ్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన రేణుకాసింగ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button