Just SportsLatest News

T20 World Cup : వార్మప్ అదిరింది..సౌతాఫ్రికాపై భారత్ ఘనవిజయం

T20 World Cup : న్యూజిలాండ్ పై 4-1తో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా తాజాగా వార్మప్ మ్యాచ్ లో సౌతాఫ్రికాను చిత్తు చేసింది

T20 World Cup

టీ20 ప్రపంచకప్(T20 World Cup) కు ముందు భారత క్రికెట్ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇటీవలే న్యూజిలాండ్ పై 4-1తో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా తాజాగా వార్మప్ మ్యాచ్ లో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. మెగా టోర్నీకి చివరి సన్నాహకంగా మిగిలిన వార్మప్ మ్యాచ్ లో భారత బ్యాటర్లు పూర్తిగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసుకున్నారు.

ఊహించినట్టుగానే ఇషాన్ కిషన్ ను అభిషేక్ శర్మకు తోడుగా ఓపెనింగ్ కు పంపించారు. మరోసారి తనకిచ్చిన అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకున్న ఇషాన్ కిషన్ విధ్వంసకర బ్యాటింగ్ తో రెచ్చిపోయాడు. క్రీజులోకి వచ్చీరావడంతోనే సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 20 బంతుల్లోనే 7 సిక్సర్లు, 2 ఫోర్లతో 53 పరుగులు చేసి రిటైర్డ్ ఔట్ అయ్యాడు.

వార్మప్ మ్యాచ్ కావడంతో అందరికీ బ్యాటింగ్ అవకాశం ఇచ్చే ఉద్దేశంతో రిటైర్డ్ ఔట్ అవ్వడం సాధారణంగానే జరుగుతుంది. తొలి వికెట్ కు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ 5.4ఓవర్లలోనే 80 పరుగులు జోడించారు. అభిషేక్ శర్మ 18 బంతుల్లో 23 పరుగులు చేయగా.. తర్వాత తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ కూడా ధనాధన్ ఇన్నింగ్స్ లతో అలరించారు. గాయం నుంచి కోలుకున్న తిలక్ వర్మ తన సహజశైలి బ్యాటింగ్ తో మరోసారి మెరుపులు మెరిపించాడు. తిలక్ వర్మ 19 బంతుల్లో 45 (3 ఫోర్లు, 3 సిక్సర్లు) , సూర్యకుమార్ 16 బంతుల్లో 30 , అక్షర్ పటేల్ 35 , రింకూ సింగ్ 10 పరుగులు చేశారు.

T20 World Cup
T20 World Cup

చివర్లో హార్థిక్ పాండ్యా మెరుపు బ్యాటింగ్ భారీస్కోరును అందించింది. పాండ్యా కేవలం 10 బంతుల్లోనే 30 ( 2 ఫోర్లు, 3 సిక్సర్లు) బాదాడు. దీంతో టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 240 పరుగులు చేసింది. భారత బ్యాటర్ల దెబ్బకు సౌతాఫ్రికా బౌలర్లలో రబాడ( 0/44 ) , నోర్జే (1/57) భారీగా పరుగులు సమర్పించుకున్నారు. తర్వాత ఛేజింగ్ లో సౌతాఫ్రికా ఆరంభం నుంచే తడబడింది. తొలి ఓవర్లోనే లిండే వికెట్ కోల్పోయింది. అయితే మార్క్ క్రమ్ (38) , రికెల్టన్ (44) మెరుపులతో దూకుడు కొనసాగించినా వరుస వికెట్లు కోల్పోయింది.

భారత స్పిన్నర్లు ఎప్పటికప్పుడు వికెట్లు తీస్తూ సౌతాఫ్రికాను దెబ్బకొట్టారు. తర్వాత స్టబ్స్ , మార్కో యెన్సన్ చివర్లో మెరుపులు మెరిపించినా పరుగుల అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగారు. మొత్తం మీద ప్రపంచకప్ కు ముందు అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు ఫామ్ అందుకోవడం అభిమానులను ఖుషీ చేస్తోంది.

Under 19 World Cup : శతక్కొట్టిన ఆరోన్ జార్జ్..అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో భారత్

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button