T20:నాన్ స్టాప్ టీ20 ఫెస్టివల్..క్రికెట్ ఫ్యాన్స్ కు పూనకాలే
T20:ఐదు నెలల పాటు నాన్ స్టాప్ క్రికెట్ ఎంటర్ టైన్ మెంట్.. అది కూడా మొత్తం టీ20 క్రికెట్టే...
T20
గత కొన్నేళ్ళుగా ప్రపంచ క్రికెట్ లో టీ ట్వంటీ (T20) ఫార్మాట్ క్రేజ్ ఎలా పెరిగిందో అందరికీ తెలుసు. ముఖ్యంగా ఐపీఎల్ వచ్చిన తర్వాత పొట్టి క్రికెట్ లో ఎంటర్ టైన్ మెంట్ డోస్ ఓ రేంజ్ లో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా పలు టీ20 (T20) లీగ్స్ ఫ్యాన్స్ ను అలరిస్తున్నాయి. ఇప్పుడు కొత్త ఏడాది ఆరంభం నుంచీ ఇక అభిమానులకు పండగే.. ఎందుకంటే వచ్చే ఐదు నెలల పాటు నాన్ స్టాప్ క్రికెట్ ఎంటర్ టైన్ మెంట్.. అది కూడా మొత్తం టీ20 క్రికెట్టే…
మహిళల ఐపీఎల్ (డబ్ల్యూపీఎల్) తో మొదలై మే చివరి వరకూ సాగే ఐపీఎల్ తో దాదాపు 140 రోజులకు పైగా టీ20 (T20) క్రికెట్ కిక్కే కిక్కు…గత ఏడాది సౌతాఫ్రికాతో సిరీస్ ముగిసిన తర్వాత దాదాపు 3 వారాల గ్యాప్ వచ్చింది. పలువురు భారత క్రికెటర్లు విజయ్ హజారే ట్రోఫీలో ఆడినా అంతర్జాతీయ సిరీస్ ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా భారత క్రికెటర్లు ఆడే ఏ సిరీస్ అయినా, దేశవాళీ లీగ్స్ అయినా ఫ్యాన్స్ లో క్రేజ్ ఉంటుంది.
ఇప్పుడు జనవరి 9 నుంచి మహిళల ఐపీఎల్ (IPL) మొదలుకాబోతోంది. నాలుగు వారాల పాటు వుమెన్స్ ఐపీఎల్ ఫ్యాన్స్ కు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వడం ఖాయం. గత మూడు సీజన్లుగా మహిళల ఐపీఎల్ క్రేజ్ బాగా పెరిగింది. క్వాలిటీ క్రికెట్ మాత్రమే కాదు ఉత్కంఠభరితమైన మ్యాచ్ లకు వేదికగా నిలుస్తోంది. అటు వ్యూయర్ షిప్ పరంగానూ రికార్డులు నెలకొల్పింది. అందుకే ప్రతీ ఏడాది ఈ లీగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.

మహిళల ఐపీఎల్ (IPL)జరుగుతుండగానే అటు భారత పురుషుల జట్టు న్యూజిలాండ్ తో వన్డే సిరీస్, టీ ట్వంటీ (T20)సిరీస్ లు ఆడబోతోంది. సొంతగడ్డపై జరిగే టీ ట్వంటీ ప్రపంచకప్ కు ఇది రిహార్సల్స్ గా చెప్పొచ్చు.జనవరి 11 నుంచి వన్డే సిరీస్, ఆ తర్వాత టీ ట్వంటీ సిరీస్ జనవరి 31 వరకూ జరగనున్నాయి. ఈ సిరీస్ ముగిసిన వారం రోజులకే ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచకప్ మొదలవుతుంది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకూ మొత్తం 55 మ్యాచ్ లు అభిమానులను అలరించబోతున్నాయి.
ప్రపంచకప్ ముగిసిన తర్వాత మన క్రికెటర్లకు రెండు వారాల రెస్ట్ దొరుకుతుంది. మళ్ళీ మార్చి 26 నుంచి ఐపీఎల్ (IPL)షురూ అవుతుంది. ప్రపంచ క్రికెట్ లో రిచ్చెస్ట్ క్రికెట్ లీగ్ మాత్రమే కాదు ఎంటర్ టైన్ మెంట్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఐపీఎల్ 19వ సీజన్ మే 31 వరకూ జరుగుతుంది. మొత్తం మీద డబ్ల్యూపీఎల్ తో మొదలుకానున్న టీ20 క్రికెట్ ఫీవర్ ఐపీఎల్ 19వ సీజన్ తో మే నెలాఖరు వరకూ అభిమానులకు ఫుల్ మీల్స్ అందించబోతోంది.
Nestle:నెస్లే బేబీ ఫుడ్లో విషం.. 31 దేశాల్లో ఉత్పత్తుల వెనక్కి.. భారత్లో పరిస్థితి ఏంటి?




One Comment