Target: భారీ విజయమే టార్గెట్..ఒమన్‌పై తుది జట్టు ఇదేనా ?
Target: ఒమన్ తో మ్యాచ్ లో భారత తుది జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే సూపర్ 4 కు చేరడంతో ఫైనల్ కాంబినేషన్ లో ఏదైనా మార్పులు చేస్తారా లేదా అనేది చూడాలి. ఒకవేళ మార్పులు చేయాలనుకుంటే సంజూ శాంసన్, బుమ్రాలను తప్పిస్తారని భావిస్తున్నారు.

Target
ఆసియాకప్ లో వరుస విజయాలతో దుమ్మురేపుతున్న టీమిండియా లీగ్ స్టేజ్ లో చివరి మ్యాచ్ కు రెడీ(Target) అయింది. ఇవాళ అబుదాబీ వేదికగా పసికూన ఒమన్ తో తలపడబోతోంది. వరుసగా రెండు విజయాలతో ఇప్పటికే సూపర్ 4 బెర్త్ ఖాయం చేసుకున్న భారత్ మరో భారీ గెలుపుపై కన్నేసింది. తొలి మ్యాచ్ లో యూఏఈపైనా… తర్వాత పాకిస్థాన్ పై పూర్తిగా డామినేట్ చేసిన భారత్ అన్ని విభాగాల్లోనూ సూపర్ ఫామ్ లో ఉంది.
బ్యాటింగ్ లో అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ అదరగొడుతున్నారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ టీ20ల్లో తన విధ్వంసకర బ్యాటింగ్ ను కంటిన్యూ చేస్తున్నాడు. గిల్ పూర్తి స్థాయిలో రాణించకున్నా… ఓపెనర్ గా తప్పించే ఛాన్స్ లేదు. సూర్యకుమార్ పాక్ పై కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి ఆకట్టుకోగా.. మిగిలిన వారికి బ్యాటింగ్ అవకాశమే రాలేదు. అటు బౌలింగ్ లోనూ టీమిండియా అదరగొడుతోంది. పేసర్ల కంటే యూఏఈ పిచ్ లపై స్పిన్నర్లు చెలరేగుతున్నారు.

చాలా రోజుల తర్వాత తుది జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన కుల్దీప్ యాదవ్ తన స్పిన్ మ్యాజిక్ చూపిస్తున్నాడు. వరుసగా రెండు మ్యాచ్ లలోనూ అదరగొట్టేశాడు. అటు అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి కూడా రాణిస్తుండగా.. బుమ్రాకు తోడు హార్థిక్ పాండ్యా, శివమ్ దూబేలు సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా దూబే బంతితో చాలా రోజుల తర్వాత అంచనాలకు మించి రాణిస్తున్నాడు.
అయితే ఒమన్ తో మ్యాచ్ లో భారత తుది జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే సూపర్ 4 కు చేరడంతో ఫైనల్ కాంబినేషన్ లో ఏదైనా మార్పులు చేస్తారా లేదా అనేది చూడాలి. ఒకవేళ మార్పులు చేయాలనుకుంటే సంజూ శాంసన్, బుమ్రాలను తప్పిస్తారని భావిస్తున్నారు. వారిద్దరి స్థానాల్లో జితేశ్ శర్మ, అర్షదీప్ సింగ్ ను ఆడించొచ్చు. ఈ టోర్నీ ప్రారంభమైన తర్వాత అర్షదీప్ తుది జట్టులో ప్లేస్ దక్కడం లేదు. బ్యాటింగ్ డెప్త్ కోసం శివమ్ దూబేను కొనసాగిస్తుండడంతో అర్షదీప్ బెంచ్ కే పరిమితమవుతున్నాడు.
మరోవైపు తుది జట్టు కాంబినేషన్ ను మార్చకపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే గంభీర్ కోచ్ గా వచ్చిన తర్వాత ఎక్కువ సందర్భాల్లో విన్నింగ్ కాంబినేషన్ నే కొనసాగిస్తున్నాడు. ఆడేది చిన్న జట్టయినా కూడా టీమ్ రిథమ్ దెబ్బతినకూడదన్న ఉద్దేశం(target)తో ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. అవర్క్ లోడ్ మేనేజ్ మెంట్ విషయంలో బుమ్రాకు రెస్ట్ ఇస్తారనుకున్నా.. టీ ట్వంటీ ఫార్మాట్ కావడంతో 4 ఓవర్లు వేయడం పెద్ద సమస్య కాదు.దే జరిగితే అర్షదీప్ మరోసారి బెంచ్ లోనే కూర్చోవాల్సి ఉంటుంది. ఇక టోర్నీ నుంచి ఇప్పటికే ఎలిమినేట్ అయిన ఒమన్ భారత్ కు ఎంతవరకూ పోటీనిస్తుందో చూడాలి.
భారత తుది జట్టు అంచనా ..అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్థిక్ పాండ్యా, శివమ్ దూబే, సంజూ శాంసన్/జితేశ్ శర్మ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా/అర్షదీప్ సింగ్