Pakistan:రిఫరీని తప్పించేది లేదు..అన్నీ మూసుకుని మ్యాచ్ ఆడిన పాక్
Pakistan:భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన విషయాన్ని పక్కన పెట్టి టీమిండియా క్రికెటర్లు షేక్ హ్యాండ్ ఇవ్వలేదంటూ నానా రచ్చ చేసింది.

Pakistan
ఆట కంటే పనికిమాలిన విషయాలే తమకు ముఖ్యమని పాకిస్థాన్(Pakistan) క్రికెట్ జట్టు మరోసారి నిరూపించింది. ఎప్పుడెలా ఆడుతుందో తెలియని పాక్ టీమ్ ఆసియాకప్ లో తమ ఆట కంటే కూడా ఇతర అంశాలతోనే వార్తల్లో నిలుస్తోంది. భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన విషయాన్ని పక్కన పెట్టి టీమిండియా క్రికెటర్లు షేక్ హ్యాండ్ ఇవ్వలేదంటూ నానా రచ్చ చేసింది. వారి హడావుడిని ఏ మాత్రం పట్టించుకోని భారత్ తర్వాతి మ్యాచ్ లోనూ ఇలాగే ఉంటామంటూ చెప్పేసింది.
దీంతో ఈ అవమాన్ని తట్టుకోలేకపోతున్న పాక్ క్రికెట్ బోర్డు యూఏఈ మ్యాచ్ కు ముందు హంగామా చేసింది. రిఫరీ పైక్రాఫ్ట్ ను టార్గెట్ చేస్తూ అతన్ని తప్పించాల్సిందేనంటూ డిమాండ్ చేయగా… ఐసీసీ వారికి రిక్వెస్ట్ ను తిరస్కరించింది. రిఫరీది ఏం తప్పులేదని, షేక్ హ్యాండ్ ఇవ్వాలన్న రూల్ ఏం లేదన్నట్టుగా పీసీబీకి గట్టిగానే సమాధానమిచ్చింది.
దీంతో మళ్ళీ అవమానానికి గురైన పాకిస్థాన్ (Pakistan)బోర్డు యూఏఈతో మ్యాచ్ ను బహిష్కరిస్తామంటూ బెదిరింపులకు దిగింది. అంతేకాదు మ్యాచ్ కు టైమ్ అవుతున్నా స్టేడియానికి బయలుదేరకుండా హైడ్రామా నడిపించింది. కానీ ఐసీసీ వారి బెదిరింపులకు తలొగ్గలేదు. తాము తీసుకునే కఠిన చర్యలకు సిధ్ధంగా ఉండాలంటూ ధీటుగానే బదులిచ్చింది. అన్నీ మూసుకుని మ్యాచ్ ఆడితే ఆడండి అంటూ ఖరాఖండిగా చెప్పేసింది.

అదే సమయంలో ఏసీసీ, ఐసీసీ నుంచి వచ్చే ఆదాయం కూడా కోల్పోతామని గ్రహించిన పాక్ క్రికెట్ బోర్డు అప్పటికప్పుడు ఐసీసీ కాళ్ళు పట్టుకుంది. కిందా మీదా పడి రిఫరీ పైక్రాఫ్ట్ తో మీటింగ్ ఏర్పాటు చేసుకుంది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే పైక్రాఫ్ట్ తమకు క్షమాపణలు చెప్పాడంటూ ప్రచారం చేసుకుంది. మీటింగ్ కు సంబంధించిన వీడియోను ఆడియో లేకుండా విడుదల చేసి క్షమాపణలు చెబుతున్న రిఫరీ అంటూ క్యాప్షన్ రాసింది. దీంతో మళ్ళీ దొరికిపోయిందంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. క్షమాపణలు వారికి మాత్రమే వినపడ్డాయోమో అంటూ సెటైర్లు వేస్తున్నారు.
ఇదిలా ఉంటే పాక్(Pakistan) జట్టు ఓవరాక్షన్ తో యూఏఈతో మ్యాచ్ గంటల ఆలస్యంగా ప్రారంభమైంది. నిబంధనల ప్రకారం పాక్ జట్టుపై చర్యలు తీసుకోవాలి. ఉద్దేశపూర్వకంగా ఏ జట్టయినా మ్యాచ్ సమయానికి ఆలస్యంగా వస్తే ప్రత్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. అలా అయితే యుఏఈ జట్టునే సూపర్ 4 కు క్వాలిఫై చేయాలి. కానీ ఏసీసీ ఛైర్మన్ గా ఉన్న నఖ్వీ ఐసీసీని బతిమలాడినట్టు తెలుస్తోంది.
One Comment